సబ్ ఫీచర్

సంక్షోభంలో రైస్ మిల్లులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనం ఆకలిని తీర్చే రైస్‌మిల్లు పరిశ్రమ సంక్షోభంలో కూరుకొని పోయింది. కోట్ల రూపాయలు పెట్టి రైస్‌మిల్లు పరిశ్రమను స్థాపిస్తే, పాలకుల తలాతోక లేని పాలసీలు, అధికారుల నిర్లక్ష్యంవల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పారాబాయిల్డ్, రా రైస్‌మిల్లులు మూతపడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోను సుమారు 4వేల వరకు రైస్ మిల్లులు ఉన్నాయి. ఈ మిల్లు ల ద్వారా హమాలీ, దడ్వాయి, మిల్‌మేస్ర్తి, గుమస్తాల రూపంలో లక్షలాది మందికి ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఉపాధి లభిస్తుంది. కొన్ని ఏళ్ళనుంచి పాలకవర్గాలు రైస్‌మిల్లు పరిశ్రమ కష్టనష్టాలను బేరీజువేసి, సంక్షోభంలోకి కూరుకొనిపోయిన పరిశ్రమను కాపాడే ప్రయ త్నం చేయకపోవటం విచారకరం. ఏటా ధాన్యం కొనుగోళ్ళు, బియ్యం ఎగుమతులు, కార్మికుల వేతనాలతో కోట్లాది రూపాయల వ్యాపారం నిర్వహించే మిల్లర్లు ప్రస్తుతం కష్టాల కడలిలో ఉన్నారు. ఒకప్పుడు 4కోట్లు విలువచేసే మిల్లు స్థాపించి, నడవని స్థితిలో ఒక్క కోటికైనా అమ్ముకొని బ్యాంకు అప్పులు తీర్చడానికి రైస్‌మిల్లర్లు సమాయత్తం అవుతున్నారు. మిల్లు నిర్వహణ ఖర్చులు రైస్‌మిల్లర్లకు తలనొప్పిగా తయారయ్యాయి. 12 నెలల్లో 3నెలలే రైస్‌మిల్లు నడుస్తుంది. మిల్లు మూత ఉన్న ప్రతినెల మినిమమ్ పవర్ బిల్లు పేరుతో 5వేల నుంచి 15వేల దాకా చెల్లించాల్సిందే. మినిమమ్ ఫిక్స్‌డ్ విద్యత్త్ఛుర్జీల పేరిట మిల్లర్ల నడ్డివిరుస్తున్నారు. ప్రతి మిల్లు కస్టమర్ చార్జీల పేరిట ప్రతినెల 750 రూపాయలు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు.
మహిళా సమాఖ్యలు, ఇందిరాక్రాంతి పథకం తదితర ఏజెన్సీల ద్వారా గ్రామాల్లోనే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు స్థాపిస్తున్నారు. తాలు, నాసిరకం వడ్లు మహిళ సంఘాలు గుడ్డిగా కొని, కస్టమ్ మిల్లింగ్ రైస్ (సి.ఎం.ఆర్) పేరిట మిల్లుకు ఇస్తున్నారు. మిల్లర్ కొన్న వరిధాన్యంలో ఎంత తేమ ఉండాలో, బ్రోకెన్ రైస్ ఎంత శాతం తీసుకోవాలో చూసి తీసుకుంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు, వరిధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ఎలాంటి వరి ధాన్యం కొనాలో ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వటం లేదు. సరిగ్గా ఎండని, 17శాతం తేమలేని, తాలు పొట్టువడ్లను కొని, వాటిని సి.ఎం.ఆర్. పేరిట మిల్లుకి ఇచ్చి బియ్యం తీసుకొనే పద్ధతివల్ల మిల్లర్లు 67 శాతం మంచి బియ్యం పెట్టలేక దివాలా తీస్తున్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొన్న బియ్యం ‘నూక’కావటంవల్ల పారాబాయిల్డు మిల్లులకి వెళ్ళాలి. బాయిల్డ్ మిల్లుకి పంపాల్సిన వడ్లను రామిల్లుకి పంపిస్తున్నారు రెవె న్యూ అధికారులు. బీహార్, తమిళనాడు, కేరళ, ఒరిస్సా తదితర రాష్ట్రాలవారు ఉడుకు బియ్యం (బాయిల్డ్‌రైస్) తింటారు. తెలంగాణ, ఏ.పి.రాష్ట్రాల ప్రజలు సన్న బి య్యం మాత్రమే తింటారు. ‘దొడ్డు’బియ్యం అంటే తెలు గు ప్రజలకు విరక్తి. రెండు రాష్ట్రాల్లో 75శాతం రారైస్ మిల్లులు ఉండగా 25 శాతం బాయిల్డ్ రైస్‌మిల్లులు ఉన్నాయి. ప్రతినెల మిల్లు నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడుకావటంతో కస్టం మిల్లింగ్ కింద దిగుమతిచేసిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి విక్రయించి, వ్యాపారం చేసినవారు జైలుపాలయ్యారు. వరి తీసుకొని సి.ఎం.ఆర్. పెట్టనందుకు చాలా మిల్లులను అధికార్లు లాక్ చేశారు. అప్పుఇచ్చిన బ్యాంకర్లు మిల్లులను అమ్మకానికి పెడుతున్నాయి. ప్రభుత్వశాఖలో సి.ఎం.ఆర్. ఇవ్వని వారిమీద క్రిమినల్ కేసులుపెట్టి ఆస్తులు వేలం వేస్తున్నారు. రెండు దశాబ్దాల క్రితం లాభాల్లో ఉన్న రైస్ మిల్లలు మారిన ఆర్థిక విధానాలవల్ల నష్టాల ఊబిలోకి కూరుకునిపోయాయి. వ్యాపారంలో అనుభవం లేనివారు అనుభవం ఉన్నవారు పోటీపడి మిల్లులు పెట్టారు. తక్కువ ధరకు ఎకరాలకు ఎకరాలుకొని బ్యాంక్ గ్యారంటీతో మిల్లులు అడ్డగోలుగా నిర్మించారు.
ఏటా సాగుకు సీజన్ అనుకూలించకపోవటం, వర్షాలు కురవకపోవటంవల్ల ధాన్యం లేక మిల్లులను ‘ఖాళీ’గా ఉంచుకొనే పరిస్థితి వచ్చింది. దిగుబడి తగ్గటం, వర్షాలులేక పంటలు ఎండిపోవటంవల్ల కరువు, కాటకాలవల్ల రైతులు నష్టపోవటమేకాక, వ్యవసాయంమీద ఆధారపడిన రైస్‌మిల్లు పరిశ్రమ నష్టాల ఊబిలో కూరుకొనిపోయింది. కొన్ని కోట్లు పెట్టిన ఇండస్ట్రి లాభాలు రాకపోగా, ప్రతి ఏటా నష్టాలు ఇబ్బడిముబ్బడిగా పెరగటంతో రైస్‌మిల్లర్లు ‘దివాలా’తీస్తున్నారు. ఐ.పి దాఖలుచేసి పారిపోతున్నారు. కస్టం మిల్లింగ్ పేరిట ప్రతి మిల్లర్లు 10నుంచి 20 లక్షల మేర నష్టపడిపోతున్నారు. నాణ్యత లేని వడ్లనుతీసుకొని 67శాతం నూకలు లేని బియ్యం పెట్టటం మిల్లర్లను నష్టాలకు గురిచేస్తుంది. మరోవైపు మూలిగే నక్కపై తాటి పండు పడినట్లు లెవీ విధానం బంద్ చేయటం మిల్లర్ల ఆత్మహత్యా సదృశ్యం అయింది. 25 ఏళ్ళక్రితం ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం కస్టం మిల్లింగ్ చార్జీలు లెక్కించి ఇస్తున్నారు. 200 శాతం అప్పటికి ఇప్పటికి మెయిటెనెన్స్ ఖర్చులు పెరిగాయి. ఎన్నో ప్రభుత్వాలు, పాలకులు, రాజకీయ నాయకులు ఎలక్షన్ సీజన్లలో కోట్ల ఫండ్ పొంది న్యాయమైన డిమాండ్లను నెరవేర్చలేదు. చందాల కోసం మిల్లులపై పడి వసూళ్ళు చేసుకుంటారు. కాని వారి కష్టాలు నష్టాలు ఎవరికీ పట్టవు.
మిల్లులో ధాన్యం లేక, మూసి ఉన్న నెలకు 80వేల నుంచి ఒక లక్ష దాకా ఖర్చులు చెల్లించాల్సి వస్తుంది. ప్రతి ఏటా 12నుంచి 20 లక్షలు నిర్వహణ ఖర్చులకే వెచ్చించాల్సి వస్తుంది. విద్యుత్తు ఎన్ని యూనిట్లు వాడితే అంత చార్జీరావాలి. కాని రైస్‌మిల్లు ఇండస్ట్రిని ‘అగ్రికల్చర్ ఇండస్ట్రీ’ అయినప్పటికీ దీనిని ఇండస్ట్రియల్ కరెంట్ కేటగిరిలో చేర్చి డబ్బులు దండుకుంటున్నారు. 100 హెచ్.పి. దాటితేనే దాని హెచ్.టి. కింద లెక్కిస్తారు. 20మంది ఉద్యోగులు ఉంటే ప్రావిడెంట్ ఫండ్ గ్రూపు ఇన్సూరెన్స్ కట్టాలి. మిల్లులో లేబర్ పీస్‌రేట్ ప్రకారం చార్జీలు తీసుకుంటారు. మిల్లులో గుమస్తాలు, మిల్లు మేస్ర్తిలు 10లోపే ఉంటే ఉద్యోగులకే పి.ఎఫ్., జిపిఎఫ్, ఇన్సూరెన్స్ కట్టాలి. కాని ఇద్దరు లేబర్ ఉన్నా పి.ఎఫ్. కట్టాలని అధికారులు వేధింపులు.
రైస్ ఇండస్ట్రి ఐనా రైస్‌మిల్లు ఇండస్ట్రికి కూడా పౌల్ట్రీ(కోళ్ళ) ఇండస్ట్రికి ఇచ్చిన రాయితీలు ఇవ్వాలి. అంగబలం ఉన్నవారు కోళ్ళ పరిశ్రమలో ఉండి వ్యవసాయ రాయితీలు పొందారు. కాని రైస్‌మిల్లు ఇండస్ట్రిని నాయకులు, పాలక వర్గాలు, ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. రెండు రాష్ట్రాల్లో సంక్షోభంలో ఉన్న రైస్‌మిల్లు పరిశ్రమను లాభాల్లోకి తీసుకొని వెళ్ళటానికి మండల, జిల్లా, రాష్టస్థ్రాయిల్లో సమీక్ష సమావేశాలు పెట్టాలి. విద్యుత్ చార్జీలు ఎత్తివేయాలి. వ్యవసాయ పరిశ్రమగా రైస్‌మిల్లు ఇండస్ట్రిని గుర్తించి ప్రోత్సాహకాలు, సబ్సిడీలు అందించాలి.

- రావుల రాజేశం