సబ్ ఫీచర్

తరగతి గది.. వాత్సల్య గది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూల్స్‌లో డిజిటల్ తరగతులు ఆరంభం చేయటం అభినందనీయమైన విషయం. బహుశా తరగతి గదిలో బోర్డు, చాక్‌పీసులు వచ్చినప్పుడు విద్యారంగం ఎంత ఉవ్విళ్లూరిందో 21వ శతాబ్దంలో నేను కూడా అంతే సంతోష పడుతున్నాను. ముఖ్యంగా పేద కుటుంబాలనుంచి వచ్చిన విద్యార్థులకు అవగాహనశక్తి ఎంతమేరకు ఉందో మనం అంచనావేయవచ్చును. దీనినే ‘వెర్నర్స్ సెంటర్ ఎడ్యుకేషన్ సెంటర్’ అంటారు. అంటే విద్యార్థిని దృష్టిలో పెట్టుకుని చదువు చెప్పటం. ఇది టీచర్‌కు కవచంగా ఉపయోగపడుతుంది. పిల్లలు మాత్రం ప్రాణమున్న చైతన్యంగల ఉపాధ్యాయుల కోసమే ఎదురు చూస్తుంటారు. కారణం టెక్నాలజీకి కొన్ని పరిమితులుంటాయి.
విద్యార్థులలో నింపవలసిన ఉత్సాహాన్ని మిషన్ నింపలేదు. అది టీచర్ చేయగలుగుతాడు. యంత్రం నవ్వించలేదు, కవ్వించలేదు. అది పిల్లల్లో ప్రేరణ కలిగించలేదు. పిల్లల్లో చురుకుదనం పుట్టించలేదు. టెక్నాలజీ, చేస్తున్న పనిని సులభతరం చేయగలుగుతుంది కానీ టీచర్‌కు ప్రత్యామ్నాయం కాదు. నవోదయ స్కూళ్లు, కేంద్రీయ విద్యాలయాలలో అనుభవంతో ఈ విషయం తెలుసుకున్నాను. బోధనలో రహస్యమంతా కూడా ప్రాణమున్న ఉపాధ్యాయునిలో ఉండదు. అది ఉపాధ్యాయుని పని నైపుణ్యాన్ని పెంచటానికి ఉపయోగపడుతుంది.
ప్రభుత్వం కూడా పరికరాలు పెట్టంగానే పని పూర్తయినట్లుకాదు, దాన్ని మెయింటెన్ చేయాలి. కావాల్సిన సౌకర్యాలు కలిగించాలి. ఇల్లు అలకంగానే పండుగ కాదు, సాంకేతిక పరికరానికుండే పరిమితులుంటాయి. అవి ఉపాధ్యాయులకు చెప్పకుంటే పరికరానే్న తన సహాయకుడు అనుకుంటారు. డిజిటల్ క్లాస్‌లు తరగతి గదికి శృంగారాన్ని మాత్రమే ఇస్తాయి. కానీ వాత్సల్యం మాత్రం ఇవ్వవు. విద్యార్థిని తరగతి గదిలో బంధించేది వాత్సలతే. దీని పరిమితులు అర్థం చేసుకుని ఈ సాంకేతిక సౌకర్యాన్ని ఉపయోగించుకుంటే విద్యాప్రమాణాలు పెరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వం తరగతి గదికి తీసుకువచ్చిన డిజిటల్ సౌకర్యానికి అభినందనలు.

- చుక్కా రామయ్య