Others

మమతల కోవెల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మారాం చేస్తున్న
పిల్లలతో తాత
కథ చెబుతాననగానే
అల్లరినంతా నిశ్శబ్దం కమ్మేసింది
అదిగదిగో
సృష్టికర్త స్వయంగా
పల్లకిమోస్తూ
దారివ్వడంటూ
చిరునవ్వులు చిందిస్తూ
భూతల స్వర్గంగా అడుగులు
వింటున్నారా చెప్పుకోండి చూద్దాం
మీలో ఎవరైనా
అదీ అదీ ఎవరో కాదు
మానవతామూర్తి సహనశీలి
మమతల కోవెల
విశ్వసనీయతకు
ఆత్మస్థైర్యానికి
నిలువుటద్దము
మానవాళికినిరంతరం
సంరక్షకురాలిగా వెన్నంటి
కష్టాలు - కడగండ్లూ
ఒంటిచేతితో
స్వచ్ఛమైన నవ్వులు చిందించే
ముఖచిత్రం
జీవిత ఆసాంతం జీవన దశలుగా
చిట్టిపొట్టి పట్టీల పాదాల సవ్వడిగా
ఇల్లంతా కలియదిరుగుతూ
చిరునవ్వుల ముత్యాలు ఒల్కబోస్తూ
అమ్మా నాన్నల అపురూపంగా
అనురాగం పంచే
అక్కా చెల్లెలుగా
సప్తపదిగా అడుగులేసి
జీవిత భాగస్వామికి సగభాగమై..
గృహలక్ష్మిగా కొలువుదీరి
సంసారసాగరంలో నడయాడే
జీవననౌకకు చుక్కానిలా..
పొత్తిళ్లలో పురుడుపోసుకున్న
బిడ్డను గుండెలకు హత్తుకొని
జీవామృతం తాగించి
అమ్మగా - ఆదిగురువుగా
పిల్లలకు బొమ్మరిల్లు కథలై..
ఎక్కడయితే స్ర్తిలు గౌరవించబడతారో
దేవతలు సంచరిస్తారు అక్కడే
పిల్లలలో తానూ ఒకడైపోయి
వూకొడుతూ జోకొడుతూ
కథ చెబుతూ వింటూ
దిండుపైకి జారిపోతున్న
నిదురించే తోటలోకి నాన్నా అనే పిలుపు
కన్నుల్లో నీరు తుడిచిందీ!

-మడిపల్లి హరిహరనాథ్