Others

మహిళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యుని చుట్టూ భూమిలా
మన చుట్టూనే తిరుగుతుంది!

ఆలనా పాలనా చూస్తూ..
రేయనకా పగలనకా..
నీడలా మనతో నడుస్తుంది!

పైపైన నవ్వులను
తన పెదాలకు పులుముకుంటూ
గలగల మువ్వల
సవ్వళ్ళను వీనుల విందు చేస్తుంది!

క్షణం తీరిక
క్షణం ఓపిక లేకున్నా
నిన్నంటిపెట్టుకుంటూ..
చల్లని వెనె్నల కురిపిస్తుంటుంది!

అసహనం
కడుపు పొత్తిళ్లలో దాచుకుని
సహనం
ముంగిళ్లలో వ్యక్తపరుస్తూ..
పేదరికం
రుద్రతాండవమాడినా..
ప్రేమను దోసెడు గంజిలో నింపి
ఆకలిదప్పులను తీరుస్తుంది!

ఆపదలో ఆదిపరాశకె్తై
ప్రక్షాళన గావించే
మహిళకు వందనం!

-కుంచె చింతా లక్ష్మీనారాయణ