Others

శతకోటి ప్రణామాలు తల్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకాశం లోనే కాదు
అర్ధాకలిలో కూడా సగానివే
పుట్టినప్పటి నుంచి
పురిటి శాపాన్ని భరిస్తూ
నీడనిచ్చే చెట్టులా కాపాడుతూనే ఉన్నావు

తరతరాలు నిన్ను
బిడ్డలని కనే యంత్రంగా
మార్చినా కూడా
చిరునవ్వుతో
మగాడి చేతుల్లో
రేపటి తరపు భవిష్యత్తుని
భద్రంగా అప్పగిస్తావు.

చదువుల్లో సరస్వతివై
లోకానికి జ్ఞానాన్ని పంచినా
లక్ష్మి లేని లోటు నిన్ను
కట్న అగ్నిలో పడేసి కాలబెట్టినా
క్షమయా ధరిత్రిలా
కన్నీళ్లతో బతికించేస్తుంటావు..

ఏడాదికోసారి ఒక దినాన్ని
నీ పేరుతో జరుపుకున్నా
తేదీల్లోనే తప్ప, బతుకులో మార్పేమీ
కనిపించదని తెలిసాక కూడా
చిరునవ్వుని మొలిపిస్తూ
నలుగురికి దారి చూపిస్తావు...
పోరాటానికి నిలువెత్తు
నిదర్శనానివి నువ్వు

వివక్షత నీవునడిచే దారుల్లో
ముల్లై గుచ్చుతున్నా
గాయాల పాదంతోనే
ముందడుగు వేస్తావు

సహనంలో భూదేవి కూడా
నిన్ను చూసి అసూయపడాల్సిందే

ప్రతినిత్యం ఎక్కడో ఒకచోట
నీ అస్తిత్వాన్ని సమాధి చేస్తున్నా
మొక్కవోని ధైర్యంతో
యుద్ధం చేస్తున్న ఓ వనితా
నీకివే మా వేల వందనాలు

మా తప్పులని కాచి
కడుపున పెట్టుకొని కాపాడు
అమ్మా తల్లి..!
నీకివే ప్రణామాలు

- పుష్యమీ సాగర్ 9032215609