Others

దార్శనికురాలివి నీవే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొడ్డుకోయక ముందే జన్మకారకుడైన,
జనకునితో తేనె నెయ్యి పసిడితో నాకించి,
పల్చనైన నా గుండెకు వెచ్చని ఊపిరి పోశావే!?
గర్భగత నీటి దోషాలు, పూర్వజన్మ పాపవాసనలు
నాకంట కూడదని నా క్షేమాన్ని ఆకాంక్షించావే!?
అమ్మా! బిడ్డ మీద మమకార సాకార శక్తివి..
మాతృమూర్తీ! శిశోదయుడైన నాకు
యేదుష్టశక్తి ఆవహించకూడదని,
చెడు చూపుల దోషం అంటకూడదని,
‘‘నా దిష్టే నీకు తగిలేటట్లుందిరా కన్నయ్యా!’’
అంటూ కౌశల్యామాత శ్రీరామచంద్రమూర్తికి
‘‘వికల్యకరణి’’ రక్షకట్టి
ఇది దుష్టశక్తులను శిక్షిస్తుంది!
శస్త్రాస్త బాధలను నిరోధిస్తుందని! ‘‘దీవెనలు అందిస్తే’’
నీవు నీ పేగు బంధం తెగిపోకూడదని,
ప్రాణనాడిగా చిరకాలం నాతోనే వుండాలని
బొడ్డుతాడు చిరుకణాన్ని, తాయిత్తులో వుంచి
కుడిచేతి దండానికి కట్టావు!!
ఎంత విచిత్రమిది? ఈనాడు మహామేధావులే
అంతుచిక్కని సృష్టి రహస్యం కోసం
తలలు పట్టుకుంటుంటే,
యే విజ్ఞాన శాస్త్రం చదవని, పరిశోధించని నీవు,
సృష్టి మూర్తినివిగా, మూల కణాన్ని
డి.ఎన్.ఎ రహస్య శకలాన్ని నాతోనే వుంచి
‘‘నీ మూలకంమిది దీన్ని జాగ్రత్తగా
భద్రపరచుకో’’ అంటూ స్పష్టపరిచిన,
శాస్ర్తియ సిద్ధాంత దార్శనికురాలివి నీవే!!
శాస్త్ర సద్య: స్పూర్తికి నీవే జన్మనిచ్చావు కదా!
నీ మనోదృష్టి మహత్త్వపూర్ణము తల్లీ!!!!

-బి.యస్.నారాయణ దుర్గ్భాట్టు 9346911199