Others

త్యాగాలకు పుడమి తల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తల్లివై, చెల్లివై, భార్యవై, బిడ్డవై
ఎనె్నన్నో రూపాలతో అలరించే
ఓ మహిళా శిరోమణీ! నారీమణీ!
నీకు అడుగడుగునా స్వాగతం
నీవు చేయు త్యాగాలకు ఈ పుడమి తల్లి
అర్పించేను ఆనందపు బాష్పాంజలి.

నీ బ్రతుకే ఒక సమరమై అంధకారబంధురమై
ఆ చీకటిదారుల వెంట ధైర్యంగా నడచి నడచి
నీవారికి వెలుగునిచ్చు నీ అమృత
హృదయానికిదే పాదాభివందనం
నీ ఇంట్లో నీకే అవమానం, అవహేళన
చిరాకులు, పరాకులు ఎనె్నన్నో ఎదురైనా
బదులు పలుకలేని నీ అసహాయత
ఏమి చేయలేని నీ నిస్సహాయత
కన్నీటి చుక్కలను కనురెప్పలచాటున దాచి
కృంగిపోయి, క్రుళ్ళిపోయి, ఎండిపోయిన
నీ హృదయానికి నీవే ధైర్యం చెప్పుకొని
మునుముందుకు సాగిపోయే దీప్తిమయి
మమతామయి, నీకిదే సమర్పించుచుంటి
నా హృదయాంజలి..
స్వీకరించు ఈ నవ్యాంజలి.

వ్యతిరేకత నీకున్నా ఎవరు తోడు రాకున్నా
చిరుదీపం చేతబట్టి ఆత్మబలం నీ తోడై
గుండెబలం నీ నీడై ఓర్పు నేర్పుల ప్రతిరూపమై
అమావాస చీకటులను
తరిమివేయ నడుము కట్టిన
ఓ సహనశీలి!

ఆడబ్రతుకు ఒక శాపమై దిన దినమొక గండమై
నీ తల్లిదండ్రులు కూడా ఆడపిల్ల వద్దనుకునే
ఈ దురదృష్ట ప్రపంచంలో పుట్టి, నీవే ఒక
వేగుచుక్కై, నీవే ఒక క్రాంతివై దారి చూపి
ప్రేమ పంచు ఓ చైతన్య స్రవంతీ! నీకిదే
నా కవితాంజలి! స్వీకరించు సిరిమల్లీ!
శతకోటి వరాల జాబిల్లి