సబ్ ఫీచర్

అంధుల పాలిట వెలుగురేఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సృష్టిలోని అందాలను ఆస్వాదించాలన్నా, ఎవరిపైనా ఆధారపడకుండా జీవించాలన్నా కంటిచూపు ప్రధానం. ‘దృష్టి’ లేదని దిగులు చెందకుండా, ఆత్మవిశ్వాసంతో అంధులు ముందుకుపోయేలా వినూత్న లిపిని అందించిన కారణ జన్ముడు లూరుూ బ్రెయిలీ. అంధులకు వెలుగురేఖలా దారిచూపిన బ్రెయిలీ 1809 జనవరి 4న పారిస్ సమీపంలోని క్రూవే అనే గ్రామంలో జన్మించాడు. ఆయన తన నాలుగో ఏటనే ఓ ప్రమాదంలో రెండు కళ్లను కోల్పోయాడు. చూపు లేకపోవడంతో అంధుల సమస్యలు ఎంత దయనీయంగా ఉంటాయో తెలుసుకున్న బ్రెయిలీ అంధుల పాఠశాలలో చేరి చదువులో విశేష ప్రతిభను కనపరిచాడు. పారిస్‌లో తాను చదువుకున్న పాఠశాలలోనే ఆయన అధ్యాపకుడిగా సేవలందించాడు. చెక్కమీద ఉబ్బెత్తుగా చెక్కిన అక్షరాలను స్పృశిస్తూ పాఠాలు నేర్చుకున్న బ్రెయిలీ అంధుల కోసం సులభమైన లిపిని రూపొందించాలని అనునిత్యం తహతహలాడేవాడు. కాగితంపైన, చెక్కపైన అక్షరాలను ఉబ్బెత్తుగా ముద్రించడం, వాటిని స్పర్శ ద్వారా అంధులు నేర్చుకోవడం వంటి పద్ధతులపై విస్తృతంగా పరిశోధనలు చేశాడు. కేవలం ఆరు చుక్కలను పలురకాలుగా పేర్చుతూ ఇంగ్లీష్ అక్షరాల ఆకృతులను రూపొందించాడు. చుక్కల ఆధారంగా అంధుల కోసం వినూత్న లిపిని 1784లో బ్రెయిలీ ఆవిష్కరించి సంచలనం సృష్టించాడు. అదే ఆ తర్వాత ‘బ్రెయిలీ లిపి’గా విశ్వవ్యాప్తమైంది.
పుస్తకాలను అర్థం చేసుకునేందుకు అంధ విద్యార్థులు వారి స్పర్శ జ్ఞానాన్ని ఎక్కువ స్థాయిలో వినియోగించాల్సి రావడం ఇబ్బందికరంగా ఉందని, ఇందులోని లోపాలను సవరించాలని ఆయన ఆరాటపడేవాడు. అంధ విద్యార్థులకు సులువైన లిపిని కనుగొనాలన్న సంకల్పం ఆయనలో బలంగా నాటుకుంది. అటు కాగితంపై, ఇటు చెక్కపై ఉబ్బెత్తు అక్షరాలు వరుసలా కాకుండా చుక్కల రూపంలో ఉంటే అంధులకు వీలుగా ఉంటుందని భావించాడు. స్పర్శ ద్వారా అక్షరాలను చదవడం మరింత వేగవంతం, సౌకర్యవంతం అవుతుందని పరిశోధన ద్వారా తెలుసుకున్నాడు. చార్లెస్ బార్బియర్ అనే సైనికాధికారి తాను పంపే సమాచారాన్ని తన సైనికులు చీకట్లో సైతం చదవగలగాలన్న ఉద్దేశంతో 12 చుక్కలతో వినూత్న ‘సంకేతాల లిపి’ని 1821లో రూపొందించాడు. ఇది తెలిసి బ్రెయిలీ ఆ 12 చుక్కలను ఆరు చుక్కలుగా కుదించి ఇంగ్లీష్ అక్షరాలను, అంకెలను ఆవిష్కరించాడు. అంధుల కోసం ప్రత్యేక లిపిని కనుగొనాలన్న ఆశయంతో రేయింబవళ్లు పనిచేసి, చివరికి క్షయ వ్యాధికి గురై బ్రెయిలీ 43 ఏళ్ల వయసులోనే 1852 జనవరి 6న తుదిశ్వాస విడిచాడు. లూరుూ కనిపెట్టిన లిపికి ‘బ్రెయిలీ లిపి’ అని నామకరణం చేయడమే కాదు, ఏటా జనవరి 4వ తేదీన ‘అంతర్జాతీయ బ్రెయిలీ దినోత్సవం’ జరపాలని ఫ్రాన్స్ ప్రభుత్వం నిర్ణయించింది. తమ కోసం ఓ ప్రత్యేక లిపిని ఆవిష్కరించి వెలుగు దారి చూపడంతో విశ్వవ్యాప్తంగా అంధులందరూ బ్రెయిలీ సేవలను నిరంతరం గుర్తుంచుకుంటారు.

- సూరం అనిల్