సబ్ ఫీచర్

సంక్షేమానికి ప్రాధాన్యం.. దేశానికే ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలో పధ్నాలుగేళ్ళ సుదీర్ఘ శాంతియుత ఉద్యమం ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టేనాటికి రాష్ట్రంలో అనేక రంగాల్లో అనిశ్చిత పరిస్థితులు, అధికారులు అందుబాటులో లేకపోవడం, పొ రుగు రాష్ట్రం నుంచి సహకారం లేకపోవడం వంటి సమస్యలుండేవి. కేసిఆర్ అధికారం చేపట్టే సమయంలో ఎదుర్కొన్న అనేకానేక సవాళ్లను- ‘్భరత ప్రథమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో బాధ్యతలు స్వీకరించిన నాటి స్థితిగతుల’తో పోల్చవచ్చునేమో! నవభారత నిర్మాతగా నెహ్రూ దేశానికి దిశానిర్దేశం చేయడానికి తనదైన శైలిలో సమర్ధవంతమైన కార్యాచరణ పథకాన్ని, రోడ్ మ్యాప్‌ను రూపొందించి, ఏ విధంగా దేశాభివృద్ధికి పునాదులు వేసాడో, అలాగే అరవై ఏళ్ల ‘ఆంధ్రా పాలన’ అవలక్షణాలను అధిగమించి, మూడేళ్లలోనే మిగతా అన్ని రాష్ట్రాలకంటే అగ్రభాగాన నిలవడానికి ప్రణాళికలు రచించి అమలు చేశారు ‘నవ తెలంగాణ నిర్మాత’ కేసిఆర్. అనేక వినూత్న కార్యక్రమాలతో యావత్ దేశం దృష్టినీ ఆకర్షిస్తున్నది. చిమ్మచీకట్ల తెలంగాణను ‘కోతలు లేని’- మిగులు విద్యుత్ రాష్ట్రంగా మలచిన ఒక్క ఉదాహరణ చాలు రాష్ట్భ్రావృద్ధిని నిర్వచించడానికి. ఇలాంటివి ఎన్నో.. ఎనె్నన్నో..
ప్రతి ఒక్కరికీ ఒక కారణముంది తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించడానికి. అందరి ఆకాంక్షలు నెరవేర్చింది. సకల జనులకు సంక్షేమం పంచింది. మూడేళ్ల పాలనలో అద్వితీయ ఫలితాలు సాధించింది. మానవీయతతో ప్రజాసంక్షేమం గురించి అహర్నిశలూ ఆలోచించి పథకాలు రూపొందించింది. 38లక్షల మందికి రూ.4,844 కోట్ల వ్యయంతో ప్రతి నెలా వెయ్యి రూపాయల చొప్పున ఆసరా పెన్షన్లు, కళ్యాణలక్ష్మి/ షాదీ ముబారక్ ద్వారా పేదింటి ఆడపిల్ల పెళ్లికి రూ.75,116ల ఆర్థిక సహాయం, రూపాయికి కిలో చొప్పున పేద కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ నెలకు 6 కిలోల బియ్యం, గర్భిణులకు రూ.12వేల ఆర్థిక సాయం, శిశువులకు కేసీఆర్ కిట్, ఒంటరి మహిళలకు భృతి వంటివి మానవీయతతో చేపట్టిన కొన్ని జన సంక్షేమ పథకాలు.
అశేష తెలంగాణ ప్రజానీకానికి అండదండగా వున్న తె లంగాణ ప్రభుత్వం అన్ని వర్గాలకు మేలు జరిగేలా వివిధ కార్యక్రమాలు చేపట్టింది. రూ.40వేల కోట్ల రూపాయలతో 35 సంక్షేమ పథకాలను అమలుచేస్తున్న ఏకైక రాష్ట్రం ఇదే. చిన్న ఉద్యోగులు, చిన్న వ్యాపారులు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకోవడానికి వీలుగా ‘పేదలుగా గుర్తించేందుకు’ వారి ఆదాయ పరిమితిని తెలంగాణ ప్రభుత్వం పెంచింది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల వరకు ఆదాయం ఉన్నవారిని కూడా పేదలుగానే గుర్తించి సంక్షేమ పథకాలు అందిస్తున్నది. రాష్ట్రంలో కేజి టూ పీజి నిర్బంధ విద్యా విధానం అమలవుతున్నది. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యనందించడానికి పెద్దఎత్తున రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభించింది. విదేశాల్లో విద్యావకాశాలు వచ్చిన వారికి రూ.20లక్షల వరకు ఓవర్సీస్ స్కాలర్‌షిప్ అందిస్తున్నది. సంక్షేమ హాస్టళ్లలో, మధ్యాహ్న భోజనంలో, అంగన్‌వాడీ కేంద్రాల్లో నాణ్యమైన సన్న బియ్యంతో వండిన భోజనం పెడుతున్నది. వ్యవసాయాధారిత దళిత కుటుంబాలకు మూడెకరాల భూమి పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తూ, వారికి మొదటి ఏడాది పెట్టుబడిని ప్రభుత్వమే సమకూరుస్తున్నది.
‘వ్యవసాయాభివృద్ధి- రైతు సంక్షేమం’ రాష్ట్ర ప్రభుత్వానికీ, ముఖ్యమంత్రికీ అత్యధిక ప్రాధాన్యత కలిగిన అంశంగా పరిగణించాలి. ఏడాదికి రెండు పంటలకు ఎకరానికి రూ.8వేల చొప్పున రైతాంగానికి ఆర్థికసాయం అందించాలని సీఎం నిర్ణయించారు. అధికారంలోకి వచ్చిన తక్షణమే 35లక్షల మంది రైతులకు 17వేల కోట్ల రూపాయల వ్యవసాయ రుణాల మాఫీ చేశారు. నాలుగు విడతలుగా ఈ మొత్తాన్ని రైతులకు చెల్లించడం జరిగింది. కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు భారీ, మధ్యతరహా నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఏటా రూ.25వేల కోట్లు కేటాయింపు చేసి, శరవేగంగా ప్రాజెక్టుల నిర్మాణం చేయిస్తున్నదీ ప్రభుత్వం. 46వేల చెరువుల పునరుద్ధరణకు ‘మిషన్ కాకతీయ’ పథకం అమలుపరుస్తున్నది. 21.5 ల క్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో భారీ సంఖ్యలో గోదాముల నిర్మాణం జరిగింది. కోతల్లేని కరెంటుతో రెప్పపాటు కూడా విరామం లేకుండా ‘నిరంతర విద్యుత్ సరఫరా’ ఈ రాష్ట్రం ప్రత్యేకత. రాష్ట్రం ఆవిర్భవించిననాడు కేవలం 6,000 మెగావాట్ల విద్యుత్ మాత్రమే అందుబాటులో వుండగా అది ఇప్పుడు రెట్టింపై 12,000 మెగావాట్లకు చేరింది. మరో రెండేళ్ళలో 25వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిలక్ష్యంగా కొత్త ప్లాంట్లు నిర్మాణంలో వున్నాయి. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో వుంది. విద్యుత్ రంగంలో చేపట్టిన పకడ్బందీ పథకాల వల్ల రైతాంగానికి ప్రస్తుతం 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా చేయడంతోపాటు, వచ్చే ఏడాది నుంచి వ్యవసాయానికి 24 గంటలూ విద్యుత్ సరఫరా చేయడానికి అవసరమైన కార్యాలు చేపట్టింది ప్రభుత్వం.
గ్రామీణ ఆర్థికవ్యవస్థ పరిపుష్టమే లక్ష్యంగా పనిచేస్తున్నదీ ప్రభుత్వం. సాగునీరు, విద్యుత్, పెట్టుబడి లాంటి సౌకర్యాలతో రైతాంగానికి చేయూతనిస్తున్నది. గొల్ల, కుర్మలకు 75 శాతం రాయితీపై గొర్రెల పంపిణీ చేపట్టింది. ప్రభుత్వ పెట్టుబడితోనే చేపల పెంపకం ప్రోత్సహించి బెస్త, ముదిరాజ్ కుటుంబాలకు ఆర్థిక ప్రయోజనం చేకూరుస్తున్నది. చేనేత కార్మికులకు నెలకు రూ.15వేల వేతనం, నూలు-రసాయనాలపై 50శాతం సబ్సిడీ సమకూరుస్తున్నది. నారుూ బ్రాహ్మణులకు నవీన క్షౌరశాలల ఏర్పాటుకు లక్ష రూపాయల చొప్పున సాయం అందచేస్తున్నది. ప్రభుత్వం రూ.1000 కోట్లతో ఎంబిసి కార్పొరేషన్ ఏర్పాటుచేసింది. ‘మిషన్ భగీరథ’తో సురక్షిత మంచినీరు అందించే లక్ష్యంతో పనిచేస్తున్న ఈ ప్రభుత్వం ప్రతి ఇంటికీ పవిత్ర గోదావరి, కృష్ణా జలాలు సరఫరా చేయడానికి రంగం సిద్ధం చేసింది. దీనివల్ల 25వేల ఆవాస ప్రాంతాలకు రోజూ తాగునీరు సరఫరా అవుతుంది. నిరుపేదలు ఆత్మగౌరవంతో బతకాలన్నదే లక్ష్యంగా డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణానికి పూనుకుంది ప్రభుత్వం. ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభాకు అనుగుణంగా బడ్జెట్‌లో ప్రత్యేక ప్రగతి నిధి ప్రభుత్వం ఏర్పాటుచేసింది ప్రభుత్వం. వారికి కేటాయించిన నిధులు ఖర్చుకాకుంటే మరో ఏడాదికి వాటిని బదలాయించే విధంగా చట్టం రూపొందించి అభివృద్ధి నిధులు పొందడం ఆ వర్గాలకు హక్కుగా మార్చింది. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన మైనారిటీలకు 12 శాతం, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో చట్టం చేసింది ప్రభుత్వం. తెలంగాణలో తండాలను గ్రామ పంచాయితీలుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరుల కు టుంబాలను ఆదుకునేందుకు ఒ క్కొక్క కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించింది. ప్రతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించింది. ప్రభుత్వ ఉ ద్యోగులకు మూల వేతనంలో 43 శాతం మేర పెంచి (్ఫట్‌మెంట్) ఇచ్చారు. నగదు ప్రయోజనం తెలంగాణ ఆవిర్భావ దినమైన 2 జూన్ 2014 నుంచి అమలు జరిగింది. కాంట్రాక్టు లెక్చరర్లు, అంగన్‌వాడీ టీచర్లు, పారిశుద్ధ్య కార్మికులు, జలమండలి ఉద్యోగులు, ఆశావర్కర్ల వేతనాలు భారీఎత్తున పెంచింది. వెట్టిచాకిరీ విముక్తి దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. తెలంగాణ విద్యుత్ సంస్థలో పనిచేసే 24వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసును రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మాతాశిశు సంరక్షణకు ‘కేసీఆర్ కిట్స్’ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రసవ మరణాలు పూర్తిగా తగ్గించేందుకు, మాతాశిశు సంరక్షణకు ఒక్కొక్కరికీ రూ.15వేలతో ‘కేసీఆర్ కిట్’ రూపొందించారు. గర్భిణులకు రూ.12వేల ఆర్థిక సాయం, ఆడపిల్ల పుడితే వెయ్యి రూపాయల ప్రోత్సాహకం, 16 వస్తువులతో పిల్లల కోసం రూ.2వేల విలువైన కేసీఆర్ కిట్స్ పంపిణీ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా నేడు అన్ని జిల్లాల్లోనూ ప్రారంభమవుతోంది. న్యాయవాదుల సంక్షేమానికి రూ.100 కోట్లు, జర్నలిస్టుల సంక్షేమానికి రూ.50కోట్లు బడ్జెట్‌లో ప్రభుత్వం కేటాయించింది. రూ.100 కోట్లతో బ్రాహ్మణుల సంక్షేమానికి బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి పేదల మృతదేహాలను స్వస్థలాలకు చేర్చేందుకు పరమపద వాహనాలు ఏర్పాటుచేసింది ప్రభుత్వం. భవన నిర్మాణ కార్మికులకు, హోంగార్డులకు, జర్నలిస్టులకు, గీత కార్మికులకు 5 లక్షల రూపాయల ఉచిత ప్రమాద జీవిత బీమాను ప్రభుత్వం కల్పించింది. దేశంలో మరెక్కడా లేని విధంగా ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు ప్రభుత్వం ప్రతి నెలా రూ.వెయ్యి చొప్పున పెన్షన్ అందిస్తున్నది. రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల్లోని 4.22 లక్షల మంది సభ్యులకు ఉపయోగపడేలా రూ. 50 గ్రూపుల్లోని పరిమితి ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది ప్రభుత్వం.
విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సకాలంలో రైతులకు అందే విధంగా చర్యలు తీసుకుంది ప్రభుత్వం. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతు ముంగిటకే రాయితీపై విత్తనాలు పంపిణీ చేయడం జరుగుతున్నది. రైతులకు విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా ముందుగానే స్టాక్ తెప్పించి గోదాముల్లో నిల్వచేయిస్తున్నది ప్రభుత్వం. భూ వివాదాలన్నీ సత్వరం పరిష్కరించి భూ రికార్డులను సవరించాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. 12 లక్షల సాదా బైనామాలను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించింది. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధించే అవకాశమున్న మైక్రో ఇరిగేషన్‌కు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నది. అన్ని మార్కెట్ కమిటీలకు రిజర్వేషన్ పద్ధతిలో నామినేషన్లు జరిగాయి. ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న పేదలకు 125 చదరపు గజాల్లోపు స్థలాన్ని ఉచితంగా క్రమబద్ధీకరించింది. లక్షా 25వేల మందికి భూమి పట్టాలు పంపిణీ చేశారు.
వరల్డ్ బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ తెలంగాణాలో అమలులో ఉంది. ఐటి రంగంలో రాష్ట్రంలో అగ్రగామి. పారిశ్రామిక అనుమతులకు టిఎస్‌ఐ పాస్ చట్టం ద్వారా 15రోజుల్లోగానే అన్నిరకాల అనుమతులు లభిస్తున్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలో నెంబర్‌వన్ రాష్ట్రం తెలంగాణ. ఐటి ఎగుమతుల్లో దేశంలోనే అగ్రగామి. ఔత్సాహిక ఐటి పారిశ్రామికుల టి-హబ్ ఇంక్యుబేటర్ నెలకొల్పింది ప్రభుత్వం. పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు సౌకర్యం లక్ష్యాలుగా రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటుచేశారు. తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్రంలో పది జిల్లాలుంటే నేడు 31 జిల్లాలున్నాయి. పచ్చదనం పెంచే అతిపెద్ద మానవ ప్రయత్నం తెలంగాణకు హరితహారం. మూడేళ్లలో 230 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఆదాయాభివృద్ధిలో దేశంలోనే అగ్రస్థానాన నిలవడం ఇక్కడ అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు సత్ఫలితాలిస్తున్నాయనడానికి ప్రబల నిదర్శనం. తెలంగాణ ధనిక రాష్టమ్రని ముఖ్యమంత్రి పదే పదే చెప్తున్న విషయం అక్షర సత్యం. ఈ వృద్ధిరేటుతో మరెన్నో పథకాల రూపకల్పనకు, వాటి అమలుకు రాష్ట్రం శ్రీకారం చుట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

- వనం జ్వాలా నరసింహారావు