శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

వరద బాధితులను ఆదుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడూరు, నవంబర్ 21: వరదల కారణంగా నష్టపోయిన బాధిత కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామని కేంద్ర మంత్రి ఎం వెంకయ్య నాయుడు అన్నారు. వరదలు సంభవించిన ప్రాంతాల్లో హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేయడానికి గూడూరు చేరుకున్న ఆయన్ను వరద బాధితులు చుట్టుముట్టి వరదల కారణంగా తాము పడ్డ ఇబ్బందులను వెళ్లబోసుకొని తమను అన్నివిధాలా ఆదుకోవాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరద బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు అన్నివిధాల చర్యలు తీసుకుంటున్నాయని అన్నారు. వరదల కారణంగా నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని తెలిపారు. వరదలతో గూడూరులో జరిగిన నష్టాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ దేవసేన ఆయనకు వివరించారు. అనంతరం మంత్రి హెలికాప్టర్‌లో ఏరియల్ సర్వేకు వెళ్లారు.

వరద బాధితులను పరామర్శించిన మంత్రి సునీత
గూడూరు, నవంబర్ 21: భారీ వర్షాల కారణంగా నష్టపోయిన బాధిత కుటుంబాలను శనివారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత పరామర్శించారు. పట్టణంలోని మధురెడ్డి కాలనీ, మండలంలోని వేములపాళెం, నెల్లటూరు గ్రామాలను ఆమె అధికారులతో కలసి సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలను అన్నివిధాలా ఆదుకొనేందుకు ప్రతి పేద కుటుంబానికి 25 కేజీల బియ్యం, చక్కెర, కిరోసిన్, కందిపప్పు తదితర నిత్యావసర వస్తువులు అందజేస్తుందని తెలిపారు. ఈ పంపిణీలో రేషన్ డీలర్లు అవకతవకలకు పాల్పడినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటివరకు ప్రభుత్వపరంగా తమకు ఎటువంటి సహాయం అందలేదని వేమలపాళెం, నెల్లటూరు గ్రామస్థులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తక్షణం స్పందించిన మంత్రి ప్రతిఒక్కరికి వెంటనే ప్రభుత్వం ఆదేశించిన విధంగా సరకులు అందజేయాలని ఆదేశించారు. ఈమె వెంట గూడూరు సబ్‌కలెక్టర్ గిరీషా, డిఎస్‌పి శ్రీనివాస్, పారిశ్రామికవేత్త గంగా ప్రసాద్, తదితరులు ఉన్నారు.