శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన జేసీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనుమసముద్రంపేట, మార్చి 17: ఆత్మకూరు ప్రాంతంలో వివిధచోట్ల నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ పరిశీలించారు. శనివారం మహిమలూరు, ఆత్మకూరు, కరటంపాడు, రాజవోలు సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వెలుగు ఏరియా కో ఆర్డినేటర్ వెంకటేశ్వర్లుకు వివిధ సూచనలిచ్చారు. అకాల వర్షాలు కురుస్తున్న దృష్ట్యా రైతుల ధాన్యపురాశి తడవకుండా తగు జాగ్రత్తలు తీసుకునేందుకు సహకరించాలన్నారు. ఇందుకోసమై అవసరమైన సంఖ్యలో టార్పాలిన్ పట్టాలను అందచేయాలని సూచించారు. ఇప్పటికే తడిచిన ధాన్యానికి సంబంధించి రైతులకు నష్టం వాటిల్లకుండా తగు చర్యలు తీసుకునేందుకు సూచనలు చేశారు. గత పక్షం రోజుల నుంచి కొనుగోలు కేంద్రం వద్దకు ధాన్యం తరలించినా నేటికీ లారీల కొరత అంటూ తమ రాశిని తీసుకెళ్లడం లేదని రైతులు వాపోయారు. దీనికి వెంటనే స్పందించిన జాయింట్ కలెక్టర్ మిల్లర్లు తరలించిన ధాన్యాన్ని వెంటనే అన్‌లోడ్ చేసుకోవాలని కోరారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో విఆర్‌ఓలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. వివిధ రికార్డులను పరిశీలించి పిఎల్‌ఆర్ త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు.

నేడు రాజరాజేశ్వరి ఆలయంలో ఉగాది మహోత్సవం
నెల్లూరు కలెక్టరేట్, మార్చి 17: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని దర్గామిట్టలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో ఆదివారం ఉగాది మహోత్సవం, పంచాంగ శ్రవణం ఏర్పాటు చేసినట్లు సహాయ కమిషనర్, ఇఒ వి రవీంద్రరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నూతన తెలుగు ఏడాది (ఉగాది) సందర్భంగా ఉదయానే్న అమ్మవారికి విశేష అభిషేకాలు నిర్వహించి ముత్యాల చీరతో విశేష పూలంగి సేవ అలంకరణ ఉంటుందన్నారు. అనంతరం షడ్రుచులతో తయారుచేసిన ఉగాది పచ్చడి ప్రసాదం అందజేస్తామన్నారు. పది గంటలకు ఆలూరి శిరోమణి శర్మ పంచాంగ శ్రవణం నిర్వహిస్తారన్నారు. రాత్రి 7:30 గంటకు అమ్మవారికి ప్రత్యేక పల్లకిసేవ ప్రదక్షిణోత్సవం ఉంటుందన్నారు. కార్యక్రమాలకు ఉభయకర్తలుగా ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి దంపతులు వ్యవహరిస్తారన్నారు. భక్తులు పెద్దసంఖ్యలో హాజరై అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆ ప్రకటనలో ఆయన కోరారు.

భారీవాహనం పట్టివేత
రూ.10.18లక్షల జరిమానా
తడ, మార్చి 17: శ్రీపెరంబదూరు నుండి విజయవాడకు వెడుతున్న భారీ వాహనాన్ని బీవీపాలెం చెక్‌పోస్టు వద్ద ఆగకుండా వెడుతుండగా రవాణా శాఖ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఆ వాహనాన్ని వెంబడించి పట్టుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాన్ని నడిపిన కారణంగా 10.18లక్షల రూపాయల జరిమానా వసూలు చేసినట్టు అధికారి చంద్రశేఖరరెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం శ్రీపెరంబదూరు నుండి విజయవాడకు స్క్రూయింగ్ క్లేటర్ కంపెనీకి చెందిన భూం అపరేట్ సంప్‌ను తరలిస్తున్న వాహనం శనివారం బీవీపాలెం చెక్‌పోస్టు వద్ద ఆపకుండా వెడుతుండగా రవాణాశాఖ అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ సుందరరావు వెంబడించి పట్టుకొని చెక్‌పోస్టుకు తరలించారు. ఈ వాహనం ద్వారా అపరాధరుసుం, ట్యాక్స్ 10.18లక్షలు వసూలు చేసినట్టు అధికారి తెలిపారు.