Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంత వైవిధ్యభరిత మీ సృష్టి!...
ప్రతి నక్షత్రమూ ఒక మహాగ్నిగోళమే! భూమికి అనేక రెట్లు! అనేక పిల్ల నక్షత్రాలు!... ప్రతి పిల్లనక్షత్రమూ ఒక సూర్యుడే!... ప్రతి సూర్యుడూ ఒక వీరుడే!... విశ్వకల్యాణ మహాయజ్ఞంలో ఒక సమిధే!...
కొన్ని గ్రహాల్లో సృష్టి!... కొన్ని సృష్టి రహస్యాలు!... సూర్యుని చుట్టూ గ్రహాలు! గ్రహాల చుట్టూ ఉపగ్రహాలు! నీహారికల చుట్టూ నీహారికలు! ... ఒక నిరంతర పరిభ్రమణం!...ఒక నిరంతర మహాయానం!...
ఈ విశ్వరహస్యాలనన్నిటినీ ఛేదించగల వాడెవ్వడు?... అసలు మనిషి తనని తాను తెలుసుకున్నాడా?... నిజానికి మనిషంటే ఎవరు?...ఒక అత్యద్భుత సృష్టి!... ఒక విశ్వప్రతీక!...ప్రతి మనిషీ ఒక వైశ్వానరుడే!...
అతని దృష్టి సప్తర్షి మండలంపై పడింది. భూమీద ఋషులున్నట్లే ఆకసంలోని నక్షత్రాల్లోనూ సప్తర్షులున్నారట!... ఆ నక్షత్ర ప్రతీకలే ఈ భూమీది ఋషులేమో!... అవీ నిరంతరం మహాక్రతువుల్ని చేస్తుంటాయి. నక్షత్ర రాశుల్ని కుప్పలుగాపోసి!... ఆ మంటల్లోంచే, ఆ వెలుగుల్లోంచే ఆ పరీమళాల్లోంచే సృష్టి ఆవిర్భవిస్తోంది. సృష్టి, స్థితి, లయల చక్రం నిర్విఘ్నంగా, నిర్విరామంగా తిరుగుతోంది!... ఆ మహాయజ్ఞం విశ్వకల్యాణ కారకం!...అది లేక మనిషికీ, మనిషిలోకి ఆలోచనకీ, కార్యాచరణకీ ఆస్కారమే లేదు!
ఆ స్వర్గలోకయజ్ఞానికి అనుకరణే, అనుసరణే మనం ఈ భూమీద చేసే యజ్ఞయాగాదులు కావచ్చు.
అందుకేనేమో! ‘‘ఈభూమీద జరిగే ప్రతి చర్యా, పై లోకంలో జరిగే చర్యకి ప్రతిచర్య! ప్రతిబింబమే’’నన్న ఒక సిద్ధాంతం పుట్టుకొచ్చింది.
ఇంకా వుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087