శ్రీవిరించీయం

భార్య మరణం - విచిత్ర సూత్రీకరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పుట్టింటికి వెళ్లి డబ్బు తీసుకురమ్మనమనీ, లేదంటే వదిలేస్తాననీ శారదని అప్పుడప్పుడూ బెదిరించేవాడు. అభిమానవతి అయిన శారద పుట్టింటికి ససేమిరా వెళ్లనని మొండికేసింది. అలా అయితే విడాకుల పత్రం మీద సంతకం చేయమని వేధిస్తున్నాడనీ, తనకి చనిపోవడంకంటే మరో మార్గం లేదనీ చివరిసారిగా కలిసినపుడు శారద మా ఆవిడతో చెప్పింది..’- ఈ మాటలు శారద పొరుగింటి ఆసామీ నోటినుంచీ జారుతాయి. తీరా జరగవలసిన దారుణం అంతా జరిగిపోయిన తరువాత ప్రతిమ వ్రాసిన కథానిక ‘మగాడి మరో కోణం’ అన్నదానిలో సందర్భపడే సన్నివేశం ఇది.
భాస్కరం అనే అతను శారద భర్త. అయితే ఇతనికి ఆమెవల్ల తనకేమీ ధనలాభం లేదని తెలిసిపోయి, ఎలాగయినా వదిలించుకోవాలని ప్రయత్నం చేస్తాడు. తాను కారణం అయినట్టు కనిపించకుండా భార్య మరణాన్ని యాదృచ్ఛిక సన్నివేశంగా కనిపించేట్లు ఒక ప్రణాళిక తయారుచేసుకుంటాడు. భార్య మరణించటానికి ముందుగా, తనకు ఆమె అంటే ఎంతో ప్రేమ, ఆప్యాయత, ప్రాణాధిక్యత వున్నట్లుగా నిశ్చయం ఏర్పడేట్లు కొన్ని సన్నివేశాలు సృష్టిస్తాడు.
తన భార్య పుట్టిన రోజుకు ఒక మంచి ‘చీర’ కొనాలనీ, అందుకు తనతో పాటు మార్కెట్‌కు వచ్చి సహాయం చేయమని తోటి ఉద్యోగస్థురాలు సంధ్యారాణిని ప్రాధేయపడతాడు. స్కూటర్ మీద నుంచి పడిపోయి గాయాలపాలు అయిన భార్యను ఆస్పత్రికి తీసుకువెళ్లటానికి పోలీసు ఇన్స్‌పెక్టర్ జీపు తీసుకుంటాడు. ఈ దాఖలాలు తనను ఏ మాత్రం పట్టి ఇవ్వవు అని నిర్థారించుకుని దీపావళినాడు టపాకాయల సంరంభంలోనే శారద చనిపోయిందన్నట్లు కథనం తయారుచేస్తాడు. అయితే ఇదంతా అతనికి వ్యతిరేకంగా తయారవుతుందని అతని ఊహకు అందదు. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా పక్క యింటి కుర్రవాడు డాబామీంచి చూచి భాస్కరం కిరసనాయిలు తెచ్చి శారద మీద వొలకబోయడం, నిప్పు అంటించడం చేస్తాడని అతనికి కల రాలేదు గదా! ఆ సాయంత్రం శారద యింటి పక్క గృహస్థు ఇంటికి ఆలస్యంగా రావడం, అతని భార్య బంధువులతో యిష్టాగోష్టి చేస్తూ ఇంటిలోనే వుండిపోవడం, వాళ్ల కుర్రాడు తండ్రి కోసం ఎదురుచూస్తూ డాబామీద నిలబడి రోడ్డువార చూస్తూ- అలవోకలో పక్క యింటి దారుణ కృత్యం గమనించాడు... ఇవన్నీ పరిస్థితులు కల్పించిన అననుకూలతలు.
శారదను భాస్కరమే చంపాడంటే ఎవరూ తేలికగా నమ్మని పరిస్థితిలో- సంధ్యారాణి ఒక మహిళా మంత్రి సేవా కార్యాలలో నిమగ్నురాలయిన మనిషి కనుక, ‘గ్రేహౌండ్ డిటెక్టివ్ ఏజెన్సీ’ వారి సహాయం కూడా తీసుకుని హత్యారోపణకు నాంది తయారుచేస్తుంది. వాళ్ల రిపోర్టు ప్రకారం- ‘శారద సంతకం చేయనందువల్ల విడాకులు ఇవ్వడం కన్నా చంపేయడం తేలికని’ నిర్ణయించుకున్నాడు. తల్లి ప్రోద్బలం కూడా ఇందుకు తోడయింది. కాని స్టౌ పేల్చి చంపడం ఈ రోజుల్లో బొత్తిగా అనుమానాస్పదంగా వుంటుంది. అందుకని భాస్కరం అందుకు భిన్నంగా మరో కొత్త మార్గాన్ని ఎన్నుకున్నాడు. అదే దీపావళి పండుగ! ... చివరికి అతని దురదృష్టం కొద్దీ ఆరేళ్ల బాబు హరీష్ చూచి వుండనట్లయితే భాస్కరం హత్య చేసి ఉంటాడని ఆ భగవంతుడిక్కూడా అనుమానం కలిగి ఉండేది కాదు..’- ‘స్ర్తి శక్తి కదిలింది’ అని కధకు ముగింపు యిస్తూ, మగవాడి దౌష్ట్యాన్ని కళ్లకు కట్టినట్లుగా వర్ణించి- సోదాహరణంగా చెప్పే రుూ కథానిక- దురాలోచనలు వున్న మగవాళ్లకు హెచ్చరిక.

-శ్రీవిరించి