శ్రీవిరించీయం

జీవితంలో కష్టాలు రావడం- కష్టపడడం వేరువేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఎంత గాఢ నమ్మకం మీ అందరికీ నేను జీవితంలో చాలా కష్టపడ్డానని. ఆనంద్ రోజుకు పదిసార్లయినా అంటాడు- మా అమ్మ కష్టపడిందని! శ్రీ్ధర్ చనిపోయాడని తెలిసినప్పుడు మొదటిసారిగా షాకింగ్‌గానే అనిపించింది. కాని నేను వెంటనే తేరుకున్నాను. నన్ను నేను కష్టపెట్టుకోగూడదనీ, ఒకరు సానుభూతి చూపేటట్లుగా వుండగూడదనీ అనుకున్నాను. నా జీవితాన్ని జాగ్రత్తగా మలుపుతిప్పుకుని, సంగీతము- సాహిత్యము, ఒకటేమిటి ప్రపంచంలో వున్న ఆహ్లాదాలన్నిటినీ నా యింటి ముంగిటిలోకి తెచ్చుకుని ఆనందంగా బతికాను. నాకొచ్చిన కష్టాన్ని నేను జయించాను. ఆ విషయాన్ని మరెవ్వరూ గుర్తించక పోవడం నాకు ఆనందాన్ని కలిగించదు. అవమానకరంగా అనిపిస్తుంది’- ఈ మాటలు భర్తను పోగొట్టుకుని కొడుకుకోడల ఆశ్రయంలో వున్న భ్రమర అనే ఆమె చెబుతుంది. టి.శ్రీవల్లీరాధిక రాసిన కథానిక ‘స్వయం ప్రకాశం’అన్న దానిలో సంభాషణ యిది.
జీవితం అంటేనే కష్టసుఖాల కలగలుపు. కష్టం వచ్చింది అనుకోవడం కంటె ఆ కష్టాన్ని అననుకూలతను తగిన రీతిగా మలుచుకుని యితరుల సానుభూతి కోరుకోకుండా బతకడం చాలా అవసరం. మనిషికి కష్టం రావడం ఒకవైపు, ఆ కష్టాన్ని- కష్టం అనుకోకుండా జీవితంలో వున్న ఒక సందర్భంగానే ఎదురుచూచి సహించడం మరో వయిపు. కష్టం పడుతున్నాం అని కుమిలిపోతూ జీవించడం కంటె, ఆ కష్టాన్ని గుర్తించకుండా - నెమరువేసుకోకుండా- తగుమాత్రంగా యితర పరిస్థితులతో సమన్వయం చేసుకుని రోజులు ఆనందంగా గడపడం, అతి అవసరం అన్న విషయాన్ని చెప్పక, చెప్పీచెప్పనట్లు సూచించే రుూ కథానిక చదువరులకు కొత్త జీవిత కోణాన్ని చూపిస్తుంది. అంతవరకు తెరుచుకున్న తలుపులు కాకుండా, కొత్తగా నిర్మించుకున్న కిటికీలను తెరుస్తుంది. కొత్త తేజస్సు మనిషిలో అనవరతము విడవకుండా వుండేట్లు చేస్తుంది.
భ్రమర అనే ఆమెకు, ఆమె స్నేహితురాలు ఇందిరకు జరిగిన సంభాషణ సన్నివేశాలే రుూ కథ అంతా. భ్రమర యింటి పనులు చేసుకుంటూ, కోడలుకు సహాయపడుతూ వుంటుంది. కోడలు యింట బయట ఎక్కువ కష్టపడుతోందని ఆమె కష్టాన్ని భర్తకూడా సరీగా గమనించడం లేదనీ భ్రమర స్పష్టంగా చెబుతుంది. ఇంటి పనులు చేసుకోవడం ఎవరికీ యెలాంటి యిబ్బందికరం అయన విషయం కాదనీ, యితరుల సానుభూతి వదనాలే దురదృష్టకరమయినవనీ ఆమె నిగాఢ విశ్వాసం.
కొడుకు కంట యేమీ పనిచేస్తున్నట్లు కనిపించకుండా, అతని ఉనికి లేనప్పుడు మాత్రం కోడలుకు అవసరం అయిన సహాయ సహకారాలు అందిస్తూ వుంటుంది. ఆఫీసునుంచి వచ్చిన కోడలుకు కాఫీ కలిపి యివ్వడం, మనమడికి కావలసిన స్నానం, పానం చేయించడం ఆమెకు సహజమయిన పనులుగానే కనిపిస్తాయి గాని యేదో తెచ్చిపెట్టుకున్న యిబ్బందులు గానో యితరులు తనమీద రుద్దిన గండగత్తెర గానో అనిపించదు.
తన అభిప్రాయాలను ఎవరూ అర్థంచేసుకోలేనందుకు ఆమెకు ‘విచారమే’గాని క్రోధం లేదు. తనను అర్ధంచేసుకున్నాననుకునే స్నేహితురాలు ఇందిర సైతం యేమాత్రం అర్ధంచేసుకోలేదని గ్రహించి- ఆమెను అర్ధం అయ్యేరీతిలో సోదాహరణంగా తన జీవిత వివరాలను తివాచీలా పరుస్తుంది.
ఆమె అభిప్రాయాలు చాటుగా విన్న కోడలుపిల్ల కూడా రుూ మాటలకు ఎంతో చలించి కొత్త తేజస్సు పొందిన విషయం కథకు తలమానికం. కుటుంబంలో సభ్యుల మధ్య- ముఖ్యంగా అత్తకోడళ్ల మధ్య-ఎటువంటి అవగాహన, పరస్పర సంఘీభావం వుండాలో రచయిత్రి చాల వివరంగా చెప్పగలిగారు. జీవితాన్ని యథాతథంగా అర్థంచేసుకోవడం అనే ‘కొత్త క్రియ’కు దారిచూపే రుూ కథానిక అన్నివర్గాలవారూ- అందున స్ర్తివాదంవారు- తప్పకుండా చదవవలసినది, ఆలోచనలు పెంచుకోవలసినదీ అనడంలో ఎటువంటి సంశయం అవసరం లేదు.

-‘శ్రీవిరించి’