శ్రీవిరించీయం

పనిచేయడంలో వెసులుబాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘షెడ్డులోపల పరిస్థితి చూస్తే లోపలెవరో ఆడ మనిషి ముఖంమీద పైట చెంగు కప్పుకుని గచ్చుమీద వళ్లు తెలియని నిద్రపోతోంది. రేకుల పైకప్పుకోసం ఉపయోగించిన ఇనుప పైపులతోబాటు ప్రత్యేకంగా యేర్పాటుచేసిన మరికొన్ని పైపులకూ గోడల చుట్టూ యేర్పాటుచేసిన పెద్ద పెద్ద చిలక్కొయ్యలకు యాదగిరి గుడిలో వేళ్లాడగట్టిన కొబ్బరికాయల మాదిరిగా తెల్లగుడ్డలు వేళ్లాడ గట్టిన వందలకొద్దీ మట్టిముంతలు కన్పించాయి.. ఆ మనిషి నలుపుతెలుపుతో వున్న జుట్టును వేలుముడి వేసుకుంది. జుట్టు లేని ముఖం అక్షరం వ్రాయని పలకలా తేలగా వుంది. చిన్నచిన్న కళ్లు తెమ్మలు కొంచెం పైకి లేచిన సన్నటి ముక్కు కొంచెం ఎత్తుపళ్లు పాసి రంగు నేత చీర మీద అదే రంగు జాకెట్ తొడుక్కుంది. మెడలో నల్లటి కాశీదారం. చేతులకు రబ్బరు గాజులు వేసుకుంది.
- స్మశాన వాటికలో ‘వాచ్‌మన్’ (నిజానికి వాచ్ ఉమెన్ అనాల్సి వుంది) సీతమ్మ గురించిన వర్ణన యిది. శీరంశెట్టి కాంతారావు వ్రాసిన కథానిక ‘అంతులేని పయనం’లో సన్నివేశం యిది.
స్మశాన వాటికకు తాను ఎట్లా కాపలాదారుగా యేర్పాటయిందీ చెబుతుంది. సీతమ్మ- అక్కడ తమ బంధువుకు అంత్యక్రియలు జరిపించటానికి వచ్చిన యిద్దరు మగవాళ్లతో.
సీతమ్మ తండ్రి పల్లెటూరులో యేదో చిల్లర పని చేసుకుంటూ కుటుంబ రక్షణ నడుపుకుంటూ వుండేవాడు. అలాంటివాడు రోగం పాలుకాగా, ఆ వూరి సర్‌పంచి అతనికి తేలికగా కూర్చునే ‘కాపలాదారు’ పని కల్పించి, కొద్దిపాటి జీతంకూడా యేర్పాటుచేస్తాడు. అతడు రోగంతోనే చనిపోగా అతని భార్య ఆ పని కొనసాగిస్తుంది. అతని కూతురు ‘సీతమ్మ’ భర్త చనిపోవడంతో, యిద్దరు పిల్లలతో పుట్టింటికి చేరి, తల్లి తర్వాత తను రుూ స్మశాన వాటికకు కాపలాదారుగా తయారయి, కుటుంబాన్ని నిలుపుకుంటూ వస్తోంది.
ప్రదేశాన్ని శుభ్రంగా వుంచడం, వచ్చినవాళ్లకు తగిన సమాచారం అందించడం, అస్తికల ముంతలను భద్రంగా వుంచి వారి వారికి అందించం,-- యితర సౌకర్యాలు సమకూర్చడం ఆమె పని. దీన్నంతటినీ ఆమె అతి కుశలంగా, కులాసాగా చేసుకుంటూ పోతోంది. అయినా, స్మశాన వాటికల రూపరేఖలు మారిపోయి- పల్లెటూరు మునిసిపాలిటీ అవడంతో అక్కడ కూడా యాంత్రిక పరికరాలతోనే పని జరిగిపోవడం సాధ్యమై యిప్పుడు సీతమ్మకు రుూ పనికూడా దక్కకుండా పోయే పరిస్థితి వచ్చింది. కొన్ని సంవత్సరాలుగానూ, వంశపారంపర్యంగానూ చేస్తున్న రుూ పనిని తననుంచి వేరుచేయడం ‘న్యాయం’ కాదనీ ‘్ధర్మం’ కాదనీ ఆమె అధికారులతో మొత్తుకుంటుంది. కాని యేమీ ప్రయోజనం వుండదు.
‘వోరీ మొదనష్టపు కాలమొచ్చిపడింది. ఊరల్ల జనానికి బతుకుతెరువు లేక పొట్టచేత పట్టుకుని వలస వెళ్లిపోతుండ్రు... ‘కష్టంచేసేటోనికి బువ్వ దొరకని రోజులొచ్చినై. జనం గొసబడ్తున్నయి. అయినా నీ ముచ్చట్లన్నీ ఒకనాటికి నడిసేయి కావు... ఇదీ పల్లెకారుల బతుకు బాట, పయనమూను.
తమ బంధువును యిక్కడ అంత్యక్రియలకు యేర్పాటుచేసుకున్నాక, రుూ యిద్దరు మగవాళ్లూ, ఆ సాయంత్రం కపాలమోక్షం వరకూ అక్కడ వుండి యిలా అనుకుంటారు. తమ మనస్సులోనే. ‘కన్నవాళ్లు డాలర్ల వేటలో విదేశాలకు వెళ్లిపోగా మాలాంటి బంధువుల సహకారంతో అన్నీ ఉండీ, ఏమీలేని వాని మోస్తరుగా వెళ్లిపోయినా మా మేనమామ కట్టెను కట్టెల మీద చేర్చి నిప్పంటించగానే అప్పటిదాకా మొహమాటానికో, మొక్కుబడిగానో శవయాత్రలో పాలుపంచుకున్న మా బంధువుల్లో సగం మందిపైగా స్నానాలుచేసి, ఇంటికెళ్లి దీపం చూడకుండానే ఎక్కడివాళ్లక్కడ నిశ్శబ్దంగా జారుకున్నారు.
సీతమ్మ యేమయిందో చూద్దాం తరువాత. ‘చీకట్లో, సమాధుల మధ్య చితిమంటల వెలుగులో ఒక స్ర్తి ఎంతో ధైర్యం ఉంటే తప్ప-(యిక్కడ వుండడం) సాధ్యంకానిపని.
విద్యుదహన వాటికలను మోసుకొచ్చిన లారీలు రావడం చూచి, ఆమె, పాపం ఒక్కసారిగా దుఃఖంతో కుప్పకూలిపోయింది.
తరువాత- కొంతకాలానికి వాళ్లు యిద్దరూ సీతమ్మను హాస్పిటల్‌లో పనిచేస్తూండగా కలుసుకుంటారు.
‘మునిసిపాలిటీవాళ్లు మళ్లీ నీకేదైనా పని చూపించనే లేదా?’ అన్నవాళ్ల ప్రశ్నకు ఆమె యిచ్చిన సమాధానం.
‘లేదు సార్. ఇంకా వాళ్లు సూపించరు. అందుకే ఈడ జేరిన. నా రెక్కల్లో సత్తువ ఉండాలేగాని చేసే దానికి పనికేం కరువు. ఏదో ఒకటి దొర్కుతనే ఉంటది. బతుకుబండి నడుస్తనే ఉంటది సారూ!’
ఆమెను ‘కర్మయోగి’గా నిర్ధారించుకుంటారు వాళ్లు యిద్దరూ.
తెలంగాణ భాషలో వ్రాసిన ఈ కథానిక బతుకుబాటలో సరళతను చెప్పకనే చెబుతుంది. జీవితంలో కొత్త చిగుళ్లు మొలుచుకువస్తాయని ఆశను ప్రేరేపిస్తుంది.

- శ్రీవిరించి