శ్రీవిరించీయం

చెప్పుకోలేని దుఃఖం-తప్పుకున్న శీలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఆమె ముఖంలో ఎలాంటి భావం కనబడడం లేదు. ఏడ్చి ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కూడా కరువయినట్లు బాధపడి, బాధపడి మనసు మొద్దుబారినట్లు, మెదడుమీద బండెడు బరువుమోపితే ఆలోచన కోల్పోయినట్లు, దేన్నిచూసినా చలనం లేని దానిమల్లే ఆమె వుంది. లచ్చమ్మ దుకాణంముందు నిల్చుని ఆ స్ర్తి.... ఆమె ముఖాన బొట్టులేదు. ముక్కుకు ముక్కుపుల్ల మాత్రం వుంది. మాసిపోయిన పూల పూల చీర కట్టుకుంది. అది అడ్డదిడ్డంగా వుంది. పోగులు కొన్ని ఊడిపోయి వున్నాయి.
బజారులో చిల్లర తిండి సరుకులు అమ్ముకునే లచ్చమ్మ దుకాణం ముందుకు వచ్చి నిలబడింది ఆ స్ర్తి.
వుప్పల నరసింహం- వ్రాసిన ‘అనామకురాలు’అన్న కథానికలో సన్నివేశం యిది. ఈ సన్నివేశాన్ని ప్రదర్శించే ముందు కథకు కావలసిన వాతావరణాన్ని కల్పిస్తూ ప్రకృతి- చెట్లమీద ఎగురుతున్న కాకిపిల్ల, కుక్క తరుముకు వచ్చి దానిని మింగాలని ప్రయత్నంచేసి విఫలం అయిపోవడం గురించి ప్రస్తావనలు వున్నాయి, తగు మాత్రంగా. లచ్చమ్మ- ఆ చిల్లరకొట్టు నడిపే ఆమె పిల్లలన్నా ఆడవాళ్ళన్నా కాని, సహాయపడే మనస్తత్వం వున్న మనిషి. తన స్వంత లాభం చూచుకోకుండా ఎదుటవున్న వారికి సహాయ సహకారాలు అందించటానికి ముందుకు వస్తుంది.
ఎదురుగా వచ్చి నిలబడ్డ ఆ అనామక స్ర్తిని పలుకరించి, ఆమెకు యేం కావాలో విచారించుదామని గొప్ప ప్రయత్నం చేస్తుంది లచ్చమ్మ. కాని ఆ అమ్మాయి ‘ముఖంలో ఎలాంటి భావం పలకలేదు. నోట మాట రాలేదు. కనీసం కనురెప్పలు కూడా కదల్చలేదు. అలాగే విగ్రహంలా నిలబడింది. అక్కడున్న తినుబండారాలను చూసైనా నోట్లో నీళ్లు ఊరినట్లు లేదు.
ఆ మనిషి ఎక్కడనుంచి వస్తోంది, ఎక్కడకు వెడుతోంది, ఏమిటి ఆ మనిషికి వచ్చిన కష్టం... దానికి ఏం పరిహారం చేయగలం--- అన్న ప్రశ్నలు, లచ్చమ్మ కొట్టుచుట్టూ చేరిన అనేకమంది ఆడవాళ్లు, మగవాళ్లు తమకం నిండిన మనసులో మునిగిపోయి సంధిస్తారు గాని ఎవరికీ ఎటువంటి సమాధానం గానీ సమాచారం గానీ దొరకదు. కొంతమంది ఆ అమ్మాయిని గురించి అతి చులకనగా మాట్లాడి, లచ్చమ్మ చేత చివాట్లు గూడా తింటారు. ఆ అమ్మాయి పిచ్చిది అనే తీర్మానం కూడా ముందుకు వస్తుంది. లచ్చమ్మ రుూ మాటనూ తేలికగా కొట్టిపారేస్తుంది. ఆమెకు ఒకటే ఆలోచన. ఆడజన్మ చాల నికృష్టమయినది. ఏమి బాధపడి ఎక్కడినుంచి రోడ్డుమీదకు చేరుకున్నదో రుూ అమ్మాయి, యిదే నా కూతురు అయితే నేను లాలించి, సంబాళించి సంగతి యేమిటో కనుక్కోకుండా, ఆ పిల్ల యిబ్బందులకు సమాధానాలు సమకూర్చకుండా వుంటానా?. లచ్చమ్మకు తోడు బాలమ్మ అనే మరో దుకాణదారు కూడా తోడు. మరోతోడు కిష్టమ్మ అనే ఆమె. ‘ఏం కష్టం వచ్చినా బాధలొచ్చినా కన్నీళ్లతోటి, లేక కులంతోటి, చెప్పుకుంటారు కాని గిట్ల ఊర్లమీద పడతారే? ఇప్పుడు ఎవరు ఆదుకుంటరు దాన్ని?- అని ఒకరు ప్రశ్నిస్తే, లచ్చమ్మ ఆ పిల్లకు తల్లీతండ్రీ వున్నారో లేదో? అత్తమామలు వున్నారో లేదో. తెలవదయె మనకు. గవన్నీ మన మెట్ల అందాం చెప్పు’అని సమాధానపరుస్తుంది.
బాలమ్మ యేదో రహస్యంగా చెప్పింది లచ్చమ్మకు. ఈమె కూర్చున్నచోటునుంచి కదలివచ్చి ఆ స్ర్తికి దగ్గరగా వచ్చి గాఢంగా పరిశీలిస్తుంది. ఆ అమ్మాయి ‘ముట్టు అయింది. పిరుదుల దగ్గర చీరకు పెద్ద రక్తపు మరక!’
లచ్చమ్మ అరచేత్తో నుదురు కొట్టుకుంటూ ‘ఆడదాని బతుకు ఎంత అధ్వానం బతుకుచూడు. ఎంత అగమామ బతుకు. అయ్యో! భగవంతుడా- ఆ పిల్ల నీకేం అపకారం చేసింది? దాని బతుకు గిట్లా చేసినవ్!’ అని విలపిస్తుంది.
‘బాలక్కా! నీ బిడ్డయినా, నా బిడ్డయినా గిసుంటి అలతుల వుంటే వూకుండిమానె! పాపం ఆ పోరి ఏ ఊరికేం ఎన్ని దినాలనుండి నడుసుకుంట వొస్తున్నదో! తిన్నదో లేదో? పోరి ముఖం సూస్తే కోసనిపిస్తోంది’ అని తన యింటి కాడనుండి పాత చీర తెప్పిస్తుంది. ఆ చీర వచ్చేలోపుగా లచ్చమ్మ ఆ కొత్త ఆడమనిషి దగ్గరకి నడిచి ‘రా, బిడ్డా, యిటుపక్క కూచుందువురా-’ అని బుజంమీద చేయివేసి దగ్గరకు నడిపిస్తుంది. లచ్చమ్మ బుజాలమీది చేయి వేసేసరికి ఆ అమ్మాయికి సముద్ర కెరటం విరుచుకుపడ్డట్టు ఒకటే ఏడుపు; దుఃఖం. ఇంతకూ ఆమె బయటకు చెప్పుకోలేని కథనం:
‘మూడు రోజుల క్రితం తన ఊళ్లో పటేళ్ల కొడుకులు ముగ్గురు బలవంతాన, రాక్షసంగా తనను అనుభవించారు. అప్పుడు దాని దుఃఖం ఆమెకు లచ్చమ్మ ఆలన, ఆదరింపులతో కట్టలుతెంచుకు యివతల పడింది. సముద్రంలా పొంగిపోయింది. ఆమె దుఃఖాన్ని చూచి ‘అక్కడవున్న వాళ్లందరూ ఆశ్చర్యపోయారు’అని కథను ముగింపుచేస్తారు రచయిత.
తెలంగాణ పదజాలంతో రాసిన రుూ కథానిక పల్లెటూళ్లలో ఆడపడుచులకు ఎదురవుతున్న యిబ్బందులు, బతుకులు బండలుఅయే పద్ధతులు వున్నాయని బాహాటంగా చెబుతుంది. దయార్ద్రం హృదయులయిన ఆడవాళ్లు కొందరు వుంటారు, వాళ్లు అలాంటి దీనులకు, భయార్తులకు ఆసరాగా నిలుస్తారు. భగవంతుడు చేసిన అభాగ్యస్థితిని సరిదిద్దటానికి శ్రమపడతారు. ఆదుకుని ఆదరం చూపుతారు. మంచి వాళ్లకు కరువులేదు, వాళ్ల సంఖ్య ఎక్కువ కాకపోయినా-- అని రుూ కథ ఒక ఆశాభావాన్ని చిలకరింప చేస్తుంది. బతుకులో వున్న కష్టసుఖాలు కావడి కుండలు మటుకే అని చెబుతుంది.
అసలు ‘కీలక’మయిన విషయాన్ని కథ చివరకునెట్టి, పర్యవసానాన్ని పదిలంగా ప్రజల ముందు (చదువరుల ముందు) దర్శనం రుూ కథానికలో వున్న విశేషం. మామూలు తరగతి ‘కొసమెరుపు’కాదు యిది. గుండెలు బద్దలుచేసి, హృదయపు లోతులు తవ్వి బయటపెట్టే ‘అలుపు ఎరుగని మలుపు’ యిది!

-శ్రీవిరించి