పర్యాటకం

పానకప్రియుడు, పాపనాశకుడు స్తంభాద్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్ష్మీనరసింహుడు
భక్తవరదుడు, భక్తవత్సలుడు, అపారదయాంబురాశి ఇట్లా భగవంతుణ్ణి నమ్మేవాళ్లు ఏపేరుతో పిలిచినా ఓ అని పలికే పరమేశ్వరుడు కృపానిధి. ఆ పరమేశ్వరుడే దుష్టలను శిక్షించినా, శిష్టులను ఆదరించినా చివరకు అందర్నీ తనలోనే ఐక్యం చేసుకొంటాడు. అందుకే ఉన్నది అంతా పరమాత్మనే. వస్తువులోను, అవస్తువులోను పరమాత్మ అంశనే ఉందని పరమభాగవతోత్తములు అంటారు.
అట్లాంటి పరమాత్ముడు ఓసారి తన భక్తుడైన ప్రహ్లాదునికోసం నరమృగరూపంలో తన్నుతాను సృజించుకున్నాడు. అక్కడ ఇక్కడ అన్నసందేహమేమీలేదు ఎక్కడైనా ఆ పరమేశ్వరుడు ఉంటాడని ఘంటాపధంగా చెప్తున్న తన భక్తుని మనోరధం తీర్చడానికి స్తంభంలోనుంచి ప్రకాశవంతమైన కాంతితో, కన్నులు మిరిమిట్లుకొలిపే ఎర్రనైన కోపోద్రిక్తమైన కనులతో, క్రోధవశంతో అదిరే పెదవులతోను, వాడియైన, చురుకైన, పదునైన ఆయుధాలవంటి నఖాలతోను, చంద్రుని కళనే వెక్కిరించే తెల్లదనమున్న కోరలతోను దుష్టులకు అతి భయంకరంగానూ, శిష్టులకు, అచంచలమైన భక్తివిశ్వాసాలు ఉన్న తన భక్తులైన వారికి అత్యంతాద్భుతమైన రూపంతోను స్తంభంనుంచి వెలువడి ఆ అహంకారపూరితుడైన హిరణ్యకశ్యపుణ్ణి చీల్చి చెండాడు.
ఆ నరసింహుడే వౌద్గల్యమహర్షి తపస్సు కు మెచ్చి లక్ష్మీనరసింహుడై కానవచ్చాడు. ఆ స్వామిని చూచి హర్షాతిరేకంతో కనులు వర్షించగా ఆనందపరవశత్వంతో పెదవులు అదురుతుండగా, నిశే్చష్టతనొందిన దేహాన్ని వశంలోకి తెచ్చుకుంటూ అసంకల్పితంగాను, మనసు పరవశించి చేతులు వాటికవే లేచి మొక్కుతుండగా వౌద్గల్యమహర్షి లక్ష్మీనరసింహుని తనవితీరా స్తుతించాడట.
అద్భుతమనోహర రూపవిన్యాసాలతో దివ్య కాంతిపుంజాలతో వెలుగొందే స్వామిని కొనియాడుతూ ‘‘స్వామీ! నీవు భక్తులను, సజ్జనులను కాపాడడానికై ఎన్ని అవతారాలను సృష్టించుకున్నావు. ద్వాపరంలోను కృష్ణుడివై మదోన్మత్తులను కాలరాచావు. త్రేతాయుగంలో సత్వగుణసంపన్నుడివై గర్వోన్నతుడై కన్నుమిన్ను కాయని రావణాసురాది రాక్షసులను మట్టుపెట్టావు.
కాని, ఎన్ని రూపాలెత్తినా అవి అన్నీ నీ భక్తులకు అండగా నున్నట్టివే. అట్టి నీవు నా కోరికను మన్నించి ఈ ఖమ్మంజిల్లాలో ఈ స్తంభాద్రి స్థలంలో ఈ లక్ష్మీనరసింహునివై ఇక్కడ ఉన్న భక్తులనూ, ఎక్కడెక్కనుంచో వచ్చే నీ భక్తజనాన్ని రక్షించుటకై నీవు ఇక్కడే స్థిరంగా ఉండ’వలసిందిగా పరిపరి విధాలా వేడుకున్నాడట. దీనజనబాంధవుడు లక్ష్మీప్రియవల్లభుడైన లక్ష్మీనరసింహుడు వౌద్గల్యమహర్షికి తాను ఈస్తంభాద్రిలోనే నివసిస్తానని అభయం ఇచ్చాడట.
అట్లా ఈ ఖమ్మంజిల్లా నగర నడిబొడ్డులో కాకతీయులచే నిర్మితమైన ఏకశిలావేదికపైన లక్ష్మీనరసింహుడు కొలువయ్యాడు. ఆనాడు వౌద్గల్యమహర్షి కోరికపై 150 అడుగుల ఎత్తున ఉన్న కొండపై కుదురుకున్న లక్ష్మీనరసింహునికి 16 శతాబ్దిలో కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు గొప్ప మండపాన్ని నిర్మించాడు. ఆ తరువాత ఎందరో రాజులు, భక్తులు ఆలయ నిర్మాణంలో భాగం పంచుకున్నారు. స్వయంభూ గా వెలసిన ఈలక్ష్మీనరసింహుడు కొలువైన ఈ స్తంభాద్రి నేడు మనం చూసే ఈ ఆలయనిర్మాణం అంతా ఎక్కువగా కాకతీయ కళావైభవానికి చిహ్నంగా కనిపిస్తోంది. ఈ మందిర నిర్మాణం నేటికి అటు పురాతత్వశాస్తజ్ఞ్రులకు ఆకర్షితమై ఉంది.
ఈ వౌద్గల్యమహర్షి కోరికపై స్వయంభూ గా వెలసిన లక్ష్మీనరసింహుణ్ణే కోనేరు కావాలని వేడుకుంటే స్వామి పాదతాకిడితో ఇక్కడున్న గుట్ట రెండుగా చీలి అక్కడ కోనేరు ఏర్పడిందని స్థలపురాణం చెప్తోంది. ఈ కోనేటిలో నీరు ఎల్లవేళలా ఇంకిపోకుండా ఉంటుంది. పైగా వర్షాకాలంలో ఈ కోనేటిలో ఉన్న నీరు ఎక్కువైనప్పుడు స్వామి నాభిసూత్రం నుంచి గర్భాలయంలోకి వెళ్తాయట. ఇక అక్కడ్నుంచి పైపుల ద్వారా నీటికి వెలుపలికి పంపిస్తారట. ఇలా ఈ ఆలయనిర్మాణంలో ప్రతిదీ ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. అంతేకాక ఈ కోనేటిలో స్నానం చేసిన వారికి దీర్ఘాయుష్షుకలుగుతుంది. అనేక వ్యాధుల నివారణ జరుగుతుందని స్థానిక భక్తులు చెబుతారు.
ఈ లక్ష్మీనరసింహస్వామి దక్షిణాభిముఖుడై భక్తులకు దర్శనమిస్తాడు. ఆ ఎడమవైపున లక్ష్మీదేవి ఆసీనురాలై దర్శనమిస్తుంది. ఆలయంలో కుడివైపున అద్దాల మండపము, ఆలయానికి ఎదురుగా ధ్వజస్తంభమూ, తూర్పువైపున ఆంజనేయ స్వామి మందిరం, వేంకటేశ్వరుని ఆలయమూ కుదురుకుని భక్తులకు నయనానందాన్ని కలుగచేస్తాయి.
ఈ లక్ష్మీనరసింహుడు పానక ప్రియుడిగా ఖ్యాతి గడించాడు. ఈ లక్ష్మీనరసింహస్వామి కోరిన కోర్కెలు తీర్చడానికి భక్తులు పానకంతో అభిషేకం నిర్వహిస్తానని మొక్కుకుంటారు. అందుకే నిత్యమూ ఈ లక్ష్మీనరసింహస్వామికి పానకాభిషేకాన్ని ఆలయ అర్చకులు నిర్వహిస్తుంటారు. అంతేకాక స్వామి పుట్టినరోజునాడు వైశాఖ శుద్ధ చతుర్థశి నాడు జన్మదినవేడుకలు కూడా విశేషంగా జరుపుతారు. ఈ స్వామికి జరిగే బ్రహ్మోత్సవాల్లో పాలుపంచుకోవడానికి భక్తజనం తండోపతండాలు విచ్చేస్తారు. స్వామివారికి, అమ్మవారికి శ్రావణంలో పవిత్రోత్సవాలను, ఆశ్వయుజమాసంలో విశేష వాహనసేవలను కూడా నిర్వహిస్తారు.

- సాయికృష్ణ