Others

మరమ్మతుల ఖర్చు రాణీగారివే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చారిత్రాత్మకమైన బకింగ్ హామ్ ప్యాలెట్‌కి మరమ్మతులు, అలంకరణలు వగైరా చేయడానికి నిపుణులు, రాజ కుటుంబం కూడా అంగీకరించాయి. దీని పునరుద్ధరణ, సుందరీకరణ కార్యక్రమానికి మొత్తం అరవై తొమ్మిది మిలియన్ పౌండ్ల ఖర్చవుతుందని అంచనా. అంటే రూపాయిలో లెక్క కడితే 31 వందల కోట్ల రూపాయలు! పైగా దీన్ని పూర్తి చేయడానికి వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి పది సంవత్సరాలు పట్టవచ్చును.
ద్వితీయ ప్రపంచ యుద్ధ కాలంలో దెబ్బతిన్న భాగాలనుంచీ, అన్ని భాగాలనూ యివాళ రిపేరు చేయాలీ అంటే ప్రభుత్వం మొదట అనుకున్న 170 మిలియన్లు గాక 369 మిలియన్ పౌండ్లవుతుంది. విద్యుత్ తీగలు మొదలు, కారుతున్న పైకప్పుల దాకా, పెచ్చులూడిపోయిన గోడలదాకా మరమ్మతు చేసి, ముస్తాబు చెయ్యాలి.
అయితే, ఖర్చుల నిమిత్తం రుూ పైకం రాణీగారికి ఇవ్వాలనే ప్రభుత్వం అనుకున్నా- దానికి భారీ ఎత్తున ప్రజావ్యతిరేకత తలెత్తింది. 1837లో రాణీ విక్టోరియా గారు దీన్ని నివాసంగా చేసుకున్న దగ్గరనుంచీ దీని శోభ, వైభవం యినుమడించాయి.
ఇప్పటికీ ఏటా వేసంగిలో లక్షలాది సందర్శకులు రుూ ప్యాలెస్‌ను చూడవస్తారు. కానీ పండు వయస్సు తొంభై సంవత్సరాలలో వున్న ఎలిజబెత్ రాణీగారి బాత్‌రూమే యిప్పుడు సరిగ్గా లేదు. అంచేత రాణీగారు లిండ్సర్ ప్యాలెస్‌కి మకాం మార్చి దీన్ని బాగు చెయ్యాలంటున్నారు.
ఐతే, రాణీమాత- ‘‘నేనిక్కడే వుంటాను. మరమ్మతులు కొనసాగించండి’’ అన్నది. అయితే దీని వ్యయం అంతా రాణీగారే తన సొంత పైకంతో చేయించాలని, ఒకలక్షమంది, వెబ్‌సైట్ల ద్వారా పిటిషన్లు పెట్టారు. జనవాక్యం యింకా పెరుగుతున్నది. కానీ, ‘రాణీగారి ఆదాయంలో, ఇంత మొత్తం పోడం- రాయల్ కుటుంబ సభ్యులకీ, రాణీగారికీ కూడా యిష్టం లేదు’ అంటున్నారు. ‘‘ఈ తగాదావల్ల కూలిపోయే ఇంగ్లండ్ ప్రతిష్ఠ తిరిగి అందంగా లేచి నిలబడేనా?’’ అన్నది అమూల్యమైన సందేహం!