సబ్ ఫీచర్

చరిత్ర రచనకు ఏది ప్రామాణికత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ్యాపారం పేరుతో వచ్చి, మన దేశాన్ని ఆక్రమించుకుని నూట యాభై ఏళ్లు పాలించిన ఆంగ్లేయులు ఇక్కడున్న వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారు. వారు అక్కడితో ఆగలేదు. తమదైన సంస్కృతీ ధర్మాలపై భారతీయుల్లో ఉన్న నిష్ఠను దెబ్బతీసేందుకు ‘మెకాలే’ విద్యా విధానాన్ని బలవంతంగా రుద్దేరు. ఈ దశలోనే వక్రీకరించిన మన దేశ చరిత్రను పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టారు. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లయినా అదే చరిత్రను మన విద్యాసంస్థల్లో బోధిస్తున్నాం. కాలమనే కొలమానంతో లెక్కగట్టగలిగితేనే ‘చరిత్ర’గా పరిగణించడం పాశ్చాత్యుల పద్ధతి. రాజులు, రాజవంశాలు, రాజ్యపాలన, రాజ్య విస్తరణ కోసం ఇతర రాజ్యాలను ఆక్రమించడం, యుద్ధాలు చెయ్యడం.. వీటి గురించి చర్చ చేయడమే విదేశీయుల దృష్టిలో ‘చరిత్ర’కు అర్థం. ఒకరిపై అధికారం చెలాయించడానికో, ఆ అధికారాన్ని నిలుపుకోడానికి లేదా విస్తరింపజేసుకోవడానికి యుద్ధాలు చేయడానికి మాత్రమే మానవ జీవితం పరిమితం కాలేదు. చరిత్ర అంటే- రాజులు, రాజ్యాలు, యుద్ధాలు, రాజవంశాలు మాత్రమే కాదు. మానవ జీవితంతో ముడిపడిన ప్రతిదానికీ చరిత్ర ఉంటుంది. ధర్మం,ప్రేమ, దయ, సహనం, స్నేహం, సేవ, త్యాగం, ఔదార్యం ఇలా ఎన్నో సద్గుణాలు మనిషి ఆదర్శ జీవితం గడపడానికి దోహదం చేస్తాయి. మనిషికి స్ఫూర్తినిచ్చే ఈ సద్గుణాలకు సంబంధించిన ఉదంతాలు కూడా చరిత్రే.
భారతదేశ చరిత్రను అధ్యయనం చేసేవారు, పరిశోధన జరిపేవారు కొన్ని వౌలిక విషయాలను ఆలోచించాలి. అసలు చరిత్ర ఎందుకు? ఎవరి చరిత్రను ఎందుకు చదవాలి? మనపై దండయాత్రలు జరిపి, మనలను గెలుచుకున్నవారి గాథలకే మన చరిత్రను పరిమితం చెయ్యాలా? లేదా కొన్ని వంశక్రమాలు, భౌతిక విషయాలకే చరిత్ర పరిమితమా? చరిత్ర అధ్యయనం వల్ల పలు ప్రయోజనాలున్నాయి. అవి 1. పూర్వ అనుభవం ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొనడానికి ఉపకరిస్తుంది. 2. సద్వర్తన వల్ల సత్ఫలితాలు పొంది, సత్పురుషుల గాథల వల్ల మనకు మార్గదర్శనం లభిస్తుంది. 3. దుర్గుణాల వల్ల మనిషికి, సమాజానికి జరిగిన చేటు మనకి హెచ్చరికగా నిలుస్తుంది.
భారతీయ చరిత్రకారులు రాచరిక వ్యవస్థలకో, కాలగణనకో చరిత్ర రచనను పరిమితం చేయలేదు. ఈ ప్రాతిపదికన పురాణాలు, ఇతిహాసాలు మన చరిత్రయే. చరిత్ర బోధన పరమోద్దేశం ఉత్తమ జీవన విలువలతోకూడిన వ్యిక్తి నిర్మాణం. ప్రస్తుతం బోధిస్తున్న చరిత్ర పాఠ్యాంశాలు ఈ ప్రయోజనాన్ని నెరవేర్చవు. ఎందుకంటే పాశ్చాత్య చరిత్రకారులు రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. కానీ, పురాణాలలో ధర్మానికే ప్రముఖ స్థానం. దానిచుట్టూ ఎన్నో సంఘటనలు, రాజుల చరిత్రలు, ఋషుల చరిత్రలు, సామాన్యుల చరిత్రలు నేర్చారు. దానివల్ల రాజ్యపాలనేగాక ప్రజల సంస్కృతి, నాగరికతల గురించి కూడా తెలుస్తుంది. ఇవేవీ ఆధునిక చరిత్రకారులకు పట్టవు. ‘చరిత్ర’ పాత్ర గతకాలపు సంఘటనలను తెలుసుకోవడానికి మాత్రమే పరిమితం కాదు. ఒక జాతి పునర్నిర్మాణంలో అది ఎంతో ప్రేరణదాయకంగా నిలుస్తుంది. జాతి అంటే మన ఉద్దేశంలో పాశ్చాత్యులు చెప్పిన అర్థం లేని నిర్వచనం కాదు. మన దృష్టిలో జాతీయత లేదా రాష్ట్రీయత అనేది యుగయుగాలుగా మనల్ని నడిపిస్తూన్న సాంస్కృతిక విలువలు కూడా. మన పూర్వీకుల గూర్చి, మన సంస్కృతీ ధర్మాల సంరక్షణకై వారు చేసిన పోరాటాలు, బలిదానాలను గూర్చి తెలుసుకున్నప్పుడే దేశం పట్ల భక్తి, అంతా ఒక్కటే అన్న భావన పెంపొందుతాయి.
మన దేశచరిత్ర లిఖిత పూర్వకంగా లేదంటారు. పురాణాలు చరిత్రే. ఆధునిక చరిత్రకారులుగా చెలామణి అవుతున్నవారు క్రీస్తుపూర్వానికి చెందిన దేనినీ చరిత్రగా అంగీకరించరు. నిజానికి భారత్‌లో చరిత్ర అధ్యయనం, పరిశోధనలపై పాశ్చాత్య, వామపక్ష భావాల ఆధిపత్యం రాజ్యమేలుతోంది. పాశ్చాత్య దృక్పథంతోనే మన దేశాన్ని అధ్యయనం చేయడాన్ని మన చరిత్ర పాఠాలు బోధిస్తున్నాయి. ఇది బ్రిటిష్‌వారు మనపై బలవంతంగా రుద్దిన ఆలోచనా ధోరణి. పరాయి పాలన నుంచి విముక్తి లభించినా నేటికీ చరిత్ర అధ్యయనంలో ఈ ధోరణే కొనసాగుతోంది. ప్రతి జాతికీ తనదైన దృక్పథంతో చరిత్ర అధ్యయనం, రచన చేసే హక్కు ఉంది. అధ్యయనం, రచనలో మనదైన జాతీయ దృక్పథం ఉండాలి. ఇదే భారతీయకరణం అంటే. అటువంటి చరిత్రే విద్యార్థులకు దేశభక్తి కలిగేలా ప్రేరణనిస్తుంది.

- దుగ్గిరాల రాజకిశోర్