సబ్ ఫీచర్

తరగతి గదిలో సామాజిక స్ఫూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ నూతన ఆవిష్కరణకైనా సమాజంలోని భిన్న సంఘటనలే కారణభూతమవుతాయి. ఇందుకు ఈ ఉదంతం ఓ ఉదాహరణ. హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో ఇటీవల నలుగురు డ్రైనేజీ కార్మికులు మేన్‌హోల్‌లోకి దిగి పనిచేసేటప్పుడు విషవాయువులు పీల్చి మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన గురించి తెలిసిన తర్వాత జెఎన్‌టియులో ఆర్కిటెక్చర్ కోర్సు చేస్తున్న హనుమాన్ అనే విద్యార్థితో- ‘డ్రైనేజీ కార్మికుల స్థితిగతులపై ఇంటెర్న్‌షిప్ చేస్తే బాగుంటుంది కదా’ అన్నాను. నా సూచనను దృష్టిలో పెట్టుకుని ఆ విద్యార్థి తన తరగతి గదిలో ఉన్న 60 మంది విద్యార్థులకు ఈ ప్రాజెక్టునిచ్చాడు. తమ ఆలోచనల మేరకు ‘సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ప్రాజెక్టు’ను తమ కెమిస్ట్రీ టీచర్‌కు వివరించారు. వారి సహకారంతో అంబర్‌పేటలోని ట్రీట్‌మెంట్ ప్లాంట్‌కు వెళ్లి అక్కడ పనులు నిర్వహిస్తున్న సైంటిస్ట్ సూర్య ప్రకాశరావును కలిసి తమ లక్ష్యం గురించి చెప్పారు. వీరి ఆసక్తిని కనుక్కునేందుకు ఆ అధికారి ప్రశ్నలు అడిగాడు. వీరిలో నిజాయితీని గుర్తించి అతనే అధ్యాపకుడు అయ్యాడు.
హైదరాబాద్‌లో నివసిస్తున్న దాదాపు 70 లక్షల మంది జనాభాకు ఎంత తాగునీరు కావాలి? వాషింగ్‌కు, టాయిలెట్‌కు ఎంత నీరు కావాలి? అన్న విషయాలను చెప్పటం జరిగింది. దాని ప్రకారం వేస్ట్‌వాటర్ 1800 మిలియన్ లీటర్లు(ఎంఎల్‌టీ) ప్రతిరోజూ వస్తుంది. దానిలో 715 ఎంఎల్‌టీలు మాత్రమే నగరంలో రీ-సైక్లింగ్ చేయటం జరుగుతుంది. మిగతా నీరంతా చుట్టుపక్కలనున్న చెరువులలోకి వదలటం జరుగుతుందని, అంబర్‌పేట్‌లో కేవలం 339 లీటర్లు మాత్రమే రీసైక్లింగ్ చేయటం జరుగుతుందని వారు తెలిపారు. ‘హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సీవేజ్ బోర్డు’ మురుగునీటిని శుద్ధి చేసి తరలించే పనులను చేపడుతుంది. ఈ ప్రక్రియను ఏ విధంగా, ఏ పరికరాల ద్వారా చేస్తున్నారో విద్యార్థులకు వివరించారు.
తరగతి గది కేవలం విద్యార్థుల భవిష్యత్‌కు రూపురేఖలు మాత్రమే ఇవ్వదు. వర్తమాన జీవితంలో డ్రైనేజీ కార్మికుల అవస్థలను విశదీకరించి సామాజిక స్పృహను రగిలిస్తున్నది. తరగతి గది సామాజిక సమస్యలపైనా చైతన్యం కలిగిస్తుంది. గతంలో జరిగిన ప్రయత్నాలను తెలియజేస్తుంది. పత్రికలు వర్తమానం సమాచారాన్ని అందిస్తాయి. పిల్లల మెదళ్లలో భవిష్యత్‌కు కావల్సిన పథకాలు ఏర్పడతాయి. తరగతి గది- గతం, వర్తమానం, భవిష్యత్ అనే మూడింటి సంగమం. దీనివల్ల పిల్లల్లో సామాజిక స్పృహ కలగటమేగాక దేశ సమస్యలపై అవగాహన కలిగేందుకు అవకాశం ఉంటుంది. తరగతి గది కేవలం పరీక్షల కోసం, ఉద్యోగావకాశాలను పెంచటం కోసం కాదు. గతంలో ప్రజాసమస్యలపై ఏ విధమైన పరిశోధన జరిగింది? వర్తమాన కాలంలో ఏం జరుగుతోంది? అనే విషయాలను విద్యార్థులు తెలుసుకుంటారు. సమస్యలను ఆధునిక పద్ధతుల్లో అర్థం చేసుకోడానికి, సవాళ్లను పరిష్కరించేందుకు విద్యార్థులను తరగతి గది ముందుకు తీసుకువెళుతుంది. ఈ కారణంగా పిల్లలకు సామాజిక స్పృహ ఏర్పడుతుంది. దీనే్న ‘క్రియేటివ్ క్లాస్’ అంటారు. ప్రతి సమస్యపై ఫోకస్ జరగాలనే ఉద్యమం విద్యారంగంలో తప్పక వస్తుంది.

- చుక్కా రామయ్య