సబ్ ఫీచర్

సంస్కర్త ఉపాధ్యాయుడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే తరగతి గది సాధించిన అద్భుతాలను తక్కువగా అంచనా వేయలేం. ఎలక్ట్రానిక్స్‌లో వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం అన్ని రంగాలకూ విస్తరించక ముందే ‘నానో టెక్నాలజీ’ వచ్చింది. అది మెదడులోని వ్యాధులకు, క్యాన్సర్ జబ్బులకు కొత్త పరిష్కారాలను ఇచ్చింది. పది, పదిహేను లేజర్లను ఒకదాని పక్కన ఒకటి పెట్టినా వెంట్రుక వెడల్పు మాత్రమే ఆక్రమిస్తుంది. టెక్నాలజీ ఇప్పటివరకూ స్పృశించని రోగాలకు ఒక సంజీవినిగా మారిపోయింది. కేవలం వైద్యశాస్త్రానికే కాదు, వ్యవసాయ రంగంలో పంటకు ఎంత నీరు కావాలి? ఎంత ఎరువు వేయాలి? అన్న ప్రశ్నలకు జవాబులు దక్కాయి. ఇలా వ్యవసాయ క్షేత్రంలో కొత్త మార్పులకు దోహదపడ్డాయి. పెట్రోల్, డీజిల్‌లో నానో కణువులను కలపటం ద్వారా ఇంధన వినియోగ సామర్థ్యం పెంచవచ్చని, పెట్రోల్ కొరత తీర్చేందుకు నీటిలోని హైడ్రోజన్‌ను శక్తిగా మార్చుతున్నారు. వీటిని కనుక్కుంటున్నది ఎవరోకాదు.. వీరంతా మనముందు పెరిగిన పిల్లలే. అమెరికాకు వెళ్లినా అక్కడి ‘నాసా’లో ఎంతోమంది మన తరగతి గదినుంచి వెళ్లిన పిల్లలే కన్పిస్తారు. ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌లకు వెళ్లినా చెన్నపాటి జగదీశ్ లాంటి వాళ్లే కనిపిస్తారు.
మన తరగతి గది సృష్టించిన ఫలితాలతో కొత్త టెక్నాలజీ వస్తున్నది. మన తరగతి గదికి ఆ సామర్థ్యం ఉన్నది. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మన తరగతి గది బోధనను, సిలబస్‌ను, పరీక్షా విధానాన్ని సంస్కరించుకుంటే ప్రపంచంలో అనేక సమస్యల పరిష్కారానికి కొత్త టెక్నాలజీని అందించవచ్చును. మార్పు ఎక్కడి నుంచో రాదు. తరగతి గది నుంచే ఉత్పన్నమవుతుంది. తరగతి గది ఒక ఆర్గానిక్ లక్షణం కలది. సంస్కరణలు బయట నుంచి రావు. మనం మార్పులకు అనుగుణంగా విద్యార్థులలో దాగి ఉన్న మేధా సంపత్తిని వెలుపలకు తీయగలిగితే కొత్త టెక్నాలజీని ఇవ్వవచ్చును. మనం చెప్పే పాఠమే విద్యార్థిలోని మేధాశక్తిని వెలికితీస్తుంది. పిల్లలకు రోజూ ఏం చెప్పామన్నది ప్రధానం కాదు, ఎట్లా చెప్పాం? ఏ విధంగా చెప్పాం? అన్నది ముఖ్యం. ఉపాధ్యాయుడు కొత్త బోధనా పద్ధతులు, కొత్త టెక్నిక్‌లను ఆలోచించాలి. వారు ఎక్కడి నుంచో వచ్చి సంస్కరించరు. వాళ్లు మనలోంచే వస్తారు. మనలో ఉండే ఏ కొద్దిమందినైనా రగిలిస్తే అదే జ్వాలగా మారుతుంది. టెక్నాలజీ విభిన్న రూపాల్లో ఉద్భవిస్తున్న రోజులివి. దాన్ని రగిలించే పద్ధతులు ఆలోచించాలి. అధ్యాపకునిలోనే ఆ మహత్తర శక్తి ఉన్నది.

- చుక్కా రామయ్య