సబ్ ఫీచర్

సృజనకు కేంద్రం ‘బాలోత్సవ్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్పత్తి రంగంలో వచ్చిన మార్పులు, ఆవిష్కరణలు సమాజంలోని ఇతర రంగాలనూ ప్రభావితం చేస్తాయి. పారిశ్రామిక విప్లవాలు ఈనాటి విద్యారంగానికి పునాది. పరిశ్రమల్లో ఒక మూసలో పోసిన యంత్రాలు తయారవుతాయి. వాటి నిర్మాణాలతో కొద్దిగా మార్పు వచ్చినా దాన్ని తిరస్కరిస్తారు. కొత్త నమూనాలో వస్తువులు తయారుచేస్తారు. విద్యా రంగంలోనూ విద్యార్థిని ఒక మూసలో పోసిన యంత్రంగా తయారుచేస్తారు. అది ఒక ప్రత్యేక అవసరం కోసం తయారుచేయబడింది. ప్రభుత్వ రంగానికి విధేయతతో వుండే పనిముట్టుగా మాత్రమే తయారుకావాలి. దానిలో విధేయత ప్రధానం. పారిశ్రామిక విప్లవం తర్వాత వచ్చిన విద్యా విధానం నూతన ఆలోచనల కన్నా, ఒక వ్యవస్థను కాపాడేవారిని తయారుచేస్తూ వస్తుంది. ఉత్పత్తి కూడా ఒక నమూనాలో జరగటం లేదు. ముడిసరుకును ఆధారం చేసుకుని వివిధ దశల్లో పలు రకాల ఉత్పత్తులు చేస్తారు. పంచదార ఫ్యాక్టరీలో ఒక యంత్రం ముడిసరుకును మార్చేస్తుంది. కొన్ని రసాయనాలు కలిపి చెరుకు రసాన్ని చక్కెరగా రెండు, మూడు దశల్లో తయారుచేస్తారు. అదే పద్ధతి విద్యా రంగంలో కూడా ప్రతిస్పందిస్తుంది.
ప్రాథమిక, సెకండరీ విద్య, ఉన్నత విద్య అనే మూడు పద్ధతుల్లో ఉంది. ప్రతి దశలో ఉత్పత్తిలో పరీక్షలు ఎలా జరుగుతాయో విద్యారంగంలో కూడా పరీక్షలు జరుగుతాయి. పరిశ్రమల్లో వస్తువులకు, విద్యారంగంలో మేధస్సుకు రూపకల్పన జరుగుతుంది. వస్తువు ఆ మూసలో ఉపయోగపడకపోతే దాన్ని ఎలా మార్చేస్తారో విద్యా విధానంలో కూడా అలాంటి మార్పులనే ‘ఫ్రేమ్’ చేస్తారు. దాన్ని తిరస్కరించిన మనిషి ఏమవుతాడో ఆలోచించండి. దానికి ఒక ప్రత్యామ్నాయం చూపించకపోతే ఈ విద్యా విధానం భ్రష్టుపట్టిపోయేది. ఆ ప్రత్యామ్నాయాన్ని కొత్తగూడెంలో ‘బాలోత్సవ్’ పేరిట పాటలో, నాట్యంలో, కళలలో రాణించవచ్చునని గత 25 ఏళ్ల నుంచి ఏకధాటిగా ప్రత్యామ్నాయాన్ని సృష్టించారు. ఇందులో కళాకారుల పాత్ర తక్కువేం కాదు. ‘బాలోత్సవ్’కు డాక్టర్ రమేష్‌బాబు చేసిన కృషి అనుధారమైంది. ఒక ప్రత్యామ్నాయ మార్గానికి ‘బాలోత్సవ్’ ద్వారా ఆయన తలుపులు తెరుస్తున్నాడు. పిల్లలు చదువులో రాణించకపోతే ఆటపాటల్లో, క్రీడల్లో రాణించవచ్చు. ఒక పద్ధతిని, నమూనాను ఆవిష్కరిస్తే ఉత్పత్తి విధానం ముడిసరుకులకు ఉపయోగపడవచ్చు. ప్రాణమున్న మనుషులు మాత్రం ముడిసరుకులు కాకూడదు. అదే జరిగితే సమాజం భ్రష్టుపడుతుంది. ఒక లక్ష్యం కోసం ముందుకు సాగాలి. ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపించాలి. అది అన్ని రంగాల్లో జరిగినట్లయితే సమాజంలో హార్మోనియల్ డెవలప్‌మెంట్ ఉంటుంది. ఇదొక విశ్వవిద్యాలయం. ‘బాలోత్సవ్’ ఎలాంటి అధికార ముద్రలు లేని బాలల విశ్వవిద్యాలయం. ఇది సృజనకు కేంద్రం. ప్రత్యామ్నాయాన్ని చూపించినవాడే క్రియేటర్. బాలోత్సవ్ సృష్టికర్త రమేష్‌బాబు క్రియేటర్. అది పేరుకు ‘బాలోత్సవ్’. కానీ, అది ప్రత్యామ్నాయ దారి. దీనిలోంచి ఎందరెందరో నూతన వ్యక్తులు జనించవచ్చు. నాలుకలకు తగ్గ రుచులు అందరికీ అందించటం అంత సులభం కాదు. బాలోత్సవ్ అందర్నీ సంతృప్తిపరిచే, ఆలోచింపచేసే వేదిక.

-చుక్కా రామయ్య