సబ్ ఫీచర్

శబ్ద కాలుష్యంతో ఛేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధునికత వల్ల వచ్చిన సౌకర్యాలు కొత్త సమస్యలకు కారణమవుతున్నాయి. సౌకర్యాల మోజులో పడిన మనం అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటున్నాం. నిజజీవితంలో అనునిత్యం ఎదుర్కొంటున్న సున్నితమైన అంశాలను మనం పెద్దగా పట్టించుకోం. అలాంటివాటిలో శబ్దకాలుష్యం ఒకటి. మనదేశంలో ప్రజల్లో చైతన్యం కొరవడడం, ఇదో పెద్దవిషయంగా భావించకపోవడంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. అందుకే శబ్దకాలుష్యం వల్ల వచ్చే సమస్యలను ఏకరవుపెడుతూ ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ప్రతి ఏటా ఏప్రిల్ చివరి బుధవారం నాడు అంతర్జాతీయ శబ్దకాలుష్య చైతన్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1996 నుంచి ఇది మొదలైంది. సెంటర్ ఆఫ్ హియరింగ్ అండ్ కమ్యూనికేషన్స్ (సిహెచ్‌సి) ఆధ్వర్యంలో దీనిని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు, పర్యావరణ సంస్థలు, ప్రభుత్వాలు, స్వచ్చంద సంస్థలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. శబ్దకాలుష్యం వల్ల ఎదురయ్యే సమస్యలను వివరించే చర్చాగోష్టులు, పరిష్కార మార్గాలు, విస్తృత ప్రచారం ఎలా చేయాలన్నదానిపై కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న ప్రకారం తరగతి గదిలో 38 డెసిబుల్స్‌కు మించి శబ్దం ఉండకూడదు. ప్రశాంతంగా, ఆదమరచి నిద్రపోవాలంటే బెడ్‌రూమ్‌లో 30 డెసిబుల్స్‌కు మించి శబ్దం ఉండకూడదు. 75 డెసిబుల్స్ శబ్దం ఉంటే అది పెద్ద రొదగానే భావించాలి. ట్రాఫిక్‌జామ్ సందర్భంగా మనవాళ్లు చేసే హారన్‌లు, స్కూళ్లలో, ఉత్సవాల సమయంలో, దీపావళి వంటి పండుగల సమయంలో శబ్దకాలుష్యానికి హద్దే ఉండదు. 80 డెసిబుల్స్ శబ్దకాలుష్యం ఉంటే ఇక చెవికి సంబంధించిన వినికిడి సమస్యలు ఎదురవుతాయి. పరోక్షంగా మానసిక, శారీరక ఇబ్బందులకు ఇది కారణమవుతుంది. పనిలో ఏకాగ్రతను దెబ్బతీస్తుంది. మనదేశంలో కాలుష్య నివారణ కోసం 1981లో చట్టం తీసుకువచ్చారు. దీనిప్రకారం శబ్దకాలుష్యాన్ని వాయుకాలుష్యంగానే పరిగణిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 80 డెసిబుల్స్‌కు మించి శబ్దం వస్తే అది నిబంధనల ఉల్లంఘనే. కానీ మన దేశంలో సగటున 100 డెసిబుల్స్ పైగానే అది ఉంటోంది. ముఖ్యంగా ప్రధాన కార్యాలయాలు, బిజీగా ఉండే రహదార్లపై ఈ రణగొణధ్వనుల స్థాయి అలా ఉంటోంది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ విషయంలో కఠినంగానే ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. కానీ మనదగ్గర ఇంకా అంత చైతన్యం రాలేదు. విద్యాలయాలు, కోర్టులు, దేవాలయాలు, పార్కులు వంటి ప్రాంతాలను సైలెన్స్ జోన్‌లుగా పరిగణిస్తున్నా ఆచరణలో పెద్దగా ఫలితం కనిపించడం లేదు. ప్రజల్లో అవగాహన, చొరవ, చైతన్యం లేకపోవడమే ఇందుకు కారణం. డస్ నాయిస్ అబ్టేమెంట్ సొసైటీ, డచ్ అకాస్టికల్ సొసైటీ వంటి సంస్థలు శబ్దకాలుష్యాన్ని ఎలా నివారించాలో ఉచితంగా సలహాలు ఇస్తాయి. ఆచరణలో సహకారాన్ని అందిస్తాయి. అరుపులు కేకలు, ఆటపాటలు, బాణాసంచా పేలుళ్లు వినోదానికి గుర్తుగా భావించేవారు ఓ విషయాన్ని గుర్తించాలి. మన మనసు భరించలేని స్థాయిలో శబ్దాలు వెలువడితే మన ఆరోగ్యాన్ని చేజేతులా పాడుచేసుకున్నవాళ్లమవుతాం.

-కృష్ణతేజ