సబ్ ఫీచర్

సొంత వైద్యంతో ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మారిన ఆహారపు అలవాట్లు, సొంతవైద్యం కారణంగా ఇటీవలి కాలంలో ‘ఎసిడిటి’ (ఆమ్లత్వం, పుల్లటి తేన్పులు, గ్యాస్) సమస్యతో బాధపడేవారి సంఖ్య గణనీయంగా పెరిగిందని ఓ పరిశీలనలో తేలింది. ముఖ్యంగా గత సంవత్సరం ఎసిడిటి సమస్యతో బాధపడే రోగులకు 490 మిలియన్ల ప్రిస్కిప్షన్స్‌ను వైద్యులు రాసిచ్చారంటే తీవ్రత ఏమిటో అర్థమవుతుంది. కడుపుబ్బరం లేదా ఎసిడిటి సమస్య నివారణకు డాక్టర్లు ‘యాంటాసిడ్’ ఔషధాన్ని సూచించడం సర్వసాధారణమైపోయింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఔషధం వాడకం 11 శాతం పెరిగిందంటే ఈ సమస్య ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. మితిమీరిన ఔషధాల వాడకం ఈ పరిస్థితికి ఒక కారణమైతే ఆహారపు అలవాట్లు మరో కారణం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఇటీవల జరిగిన ఓ క్లినికల్ సర్వే ప్రకారం ఎసిడిటితో బాధపడే రోగుల్లో ఎక్కువమంది ఆ రోగ లక్షణాలు కనిపించిన తరువాత కనీసం ఐదారు నెలలపాటు సొంత వైద్యంతో గడిపేస్తున్నారు. దీనివల్ల అసలు రోగం తగ్గకపోగా, పరోక్ష సమస్యలకు కారణమవుతోంది.
రోగుల సొంతవైద్యం వల్ల యాంటాసిడ్ మందుల కౌంటర్ సేల్స్ 27 శాతం పెరిగిందన్నది ఆ సర్వే తేల్చిన నిజం. 40-50 సంవత్సరాల వయసున్నవారిలో ఎక్కువగా ఈ ఎసిడిటి సమస్య ఎక్కువగా కనిపిస్తోందని ఏసియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ సంస్థలో సీనియర్ గాస్ట్రోఎంటరాలజిస్ట్‌గా సేవలందిస్తున్న డాక్టర్ సందీప్ లఖటాకియా చెబుతున్నారు. నిజానికి యువతీ యువకుల్లో కూడా ఈ సమస్య అధికంగా కనిపిస్తోందని, 20-30 ఏళ్ల వయసు వారిలో ఇది తీవ్రంగా కనిపిస్తోందని ఆయన చెబుతున్నారు. సమస్య ఏర్పడినప్పుడల్లా సొంతవైద్యం లేదా చిట్కావైద్యానికి వారు ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. ఆహారపు అలవాట్లలో తీవ్రమైన మార్పులవల్ల ఎసిడిటి వారిని వేధిస్తోందని ఆయన అంచనావేస్తున్నారు. గొంతులోను, ఉదరంలోను మంట లేదా ఉబ్బరించినట్లు ఉంటే తమకు తోచిన యాంటాసిట్ మందులను విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారని, దీనివల్ల డయేరియా లేదా మలబద్దకం సమస్య తలెత్తుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎసిడిటితో బాధపడే రోగుల్లో 65శాతం మంది పగటిపూట అసౌకర్యానికి గురవుతున్నారని, మిగతావారు రాత్రిపూట ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గాంధీ ఆస్పత్రి గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాధిపతి డాక్టర్ శ్రావణ్‌కుమార్ చెబుతున్నారు. ఎసిడిటి వల్ల గొంతులో మంట, నిద్రసరిగా పట్టకపోవడం, ఇతర సమస్యలకు కారణమవుతుందని, దైనందిన జీవితంపై ఇది ప్రభావం చూపుతుందని ఆయన చెబుతున్నారు. సొంతవైద్యం కాకుండా, నిపుణుడైన వైద్యుని సలహాతో, అసలు వ్యాధి ఏమిటో తెలుకునే పరీక్షలు చేయించుకోవడమే ఉత్తమమని ఆయన సూచిస్తున్నారు. కేవలం ఉదరంలోను, గొంతులోను సమస్యకు ఎసిడిటియే కారణమని చెప్పడానికి వీలులేదని, ఇతర జీర్ణకోశ వ్యాధులవల్లా ఈ సమస్య కనిపిస్తుందని అంటున్నారు. సాధారణంగా మంచి ఫలితాలనిచ్చే పచ్చి ఉల్లిపాయలు, నల్ల మిరియాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, పులుపు ఉండే (సిట్రిక్) పండ్లు, మజ్జిగ, చాక్‌లెట్లు, కార్బొనేటెడ్ పానీయాలు, చీజ్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు, బంగాళదుంపలు, టమాటాలు అతిగా తింటే ఎసిడిటి సమస్యను కొనితెచ్చుకున్నట్లేనని వారు హెచ్చరిస్తున్నారు.

-రవళి