సబ్ ఫీచర్

మద్య నిషేధం వల్ల ఉత్తమ ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మద్యం అనేది ఒక రక్కసి. అది ప్రజలను అటు ఆరోగ్యపరంగా ఇటు ఆర్థికపరంగా చిదిమి వేయడమే కాకుండా, సమాజంలో పలు హింసాత్మక సంఘటనలు జరగడానికి కారణవౌతున్నది. ముఖ్యంగా మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడులు, గృహహింసలు నానాటికీ పెరిగిపోవడానికి మద్యం మహమ్మారి కారణమన్న సంగతి సర్వవిదితమే. అయితే, పాలక పక్షాలు మాత్రం మద్యం అమ్మకాలను మాత్రం ఒక ప్రధాన ఆదాయ వనరుగా భావిస్తూండటం దురదృష్టకరం. మద్యం వలన ఎంతో విలువైన మానవ వనరులు వృథా అవుతున్నాయి. అయినప్పటికీ మద్య నిషేధాన్ని అమలుచేయడానికి పాలకపక్షాలు ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడం గమనార్హం. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మద్య నిషేధాన్ని అమలుచేయడం సాధ్యంకాదని చేతులు ఎత్తివేసిన సంఘటనలు ఉన్నాయి. మద్య నిషేధాన్ని అమలుచేయడంవలన మద్యం అక్రమరవాణా, కాపుసారా తయారీలు పెరుగుతాయని వీరు సాధారణంగా చెప్పే కుంటి సాకులు. మన దేశంలో సంపూర్ణ మద్య నిషేధం అమలుచేయడం సాధ్యంకాదని కాకమ్మ కబుర్లు చెప్పే నాయకుల నోళ్ళకు తాళాలు వేయించిన ఘనత బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌కే దక్కుతుంది. నిబద్ధత, నిజాయితీ ఉంటే సంపూర్ణ మద్యనిషేధం అమలుసాధ్యమేనని ఆయన నిరూపిస్తున్నారు. బిహార్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయన గత ఏప్రిల్ ఒకటవ తేదీనుంచి మద్య నిషేధాన్ని అమలుచేస్తున్నట్లు ప్రకటించారు. మద్యనిషేధంను అతిక్రమించేవారిని నియంత్రించేందుకు ఆయన కఠినమైన చట్టాలను రూపొందించారు. దేశంలో నేరాల చిట్టాలో ఎప్పుడూ బిహార్‌దే అగ్రస్థానం. బిహార్‌లోని కొన్ని ప్రాంతాలలో ఆటవిక రాజ్యం కొనసాగుతుంది. ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ క్రమక్రమంగా ఆటవిక రాజ్యమేలుతున్న వారికి చెక్ పెడుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన బిహార్‌లో మద్య నిషేధంను అమలుచేస్తున్నారు. సమాజంలో పలురకాల దౌర్జన్యాలు, దోపిడీలు, హింసాకాండలకు మద్య మే కారణమన్న విషయం బిహార్‌లో మరోసారి నిరూపితమైంది.
బిహార్‌లో మద్య నిషేధాన్ని అమలుచేసిన నెల రోజుల్లో అక్కడ క్రైమ్‌రేటు తగ్గిపోవడమే అందుకు ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పుకోవచ్చు. గత ఏప్రిల్ నెలలో బీహార్‌లో హత్య, కిడ్నాప్, అత్యాచారాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, మహిళా వేధింపులు తదితర నేరాలు గత సంవత్సరం ఏప్రిల్‌తో పోల్చితే 27 శాతం తగ్గాయి. గత సంవత్సరం ఏప్రిల్‌లో బిహార్‌లో 276 హత్యలు జరుగగా, గత ఏప్రిల్‌లో 206 జరిగాయి. గత సంవత్సరం ఏప్రిల్‌లో 12 కిడ్నాప్‌లు జరగ్గా, గత ఏప్రిల్‌లో ఒకటి, గత సంవత్సరం ఏప్రిల్‌లో 112 మంది మహిళలపై అత్యాచారాలు జరుగగా, గత ఏప్రిల్‌లో 59 అత్యాచారాలు జరిగాయి. ఈ గణాంకాలను పరిశీలిస్తే, మద్యం విక్రయాలు జరుగుతున్నప్పుడే నేరాల సంఖ్య పెరిగినట్లు తెలుస్తుంది. మద్య నిషేధం వలన బిహార్‌లో నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టడమే కాకుండా, అక్కడ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతుండటం గమనార్హం.
పాలక పక్షాలు ప్రజలకోసం పలు సంక్షేమ పథకాలను అమలుచేస్తూ, అందుకోసం వేలాది కోట్ల ప్రజాధనాన్ని ఖర్చుచేస్తున్నాయి. సంక్షేమ పథకాలను గత ఆరున్నర దశాబ్దాలకుపైగా అమలుచేస్తున్నప్పటికీ పేదరికం మాత్రం సమసిపోలేదు. విరివిగా సంక్షేమ పథకాలు అమలుచేయడంకన్నా మద్య నిషేధాన్ని అమలుచేస్తే ప్రజలకు ఎక్కువ మేలు జరుగుతుంది. దీనివలన, ప్రజల జీవన ప్రమాణాలు పెరగడమే కాకుండా పేదరికం కూడా తగ్గిపోతుంది. మద్య నిషేధాన్ని కట్టుదిట్టంగా అమలుచేయడం ద్వారా బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ దేశంలోని ముఖ్యమంత్రులు అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు.

- పి.భార్గవరామ్