సబ్ ఫీచర్

పొందూరు సన్నఖాదీకి మంచిరోజులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయ ఖ్యాతి పొందిన శ్రీకాకుళం జిల్లా పొందూరులోని ఆంధ్ర సన్నఖాదీ పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం పేటెంటు హక్కులను కల్పించింది. పొందూరు ఖాదీని రక్షించేందుకు, నకిలీ ఖాదీని అరికట్టేందుకు ఈ పేటెంటు హక్కులు ఉపయోగపడతాయి. ప్రైవేటు సంస్థలు కాని, ప్రైవేటు వస్త్ర వ్యాపారులు కాని పొందూరు ఖాదీ పేరుతో విక్రయాలు జరిపినా, దుకాణాలు నిర్వహించినా వారిపై చట్టపరమైన చర్యలు ఉం టాయి. ముందుగా వారికి లీగల్ నోటీసులను అందచేసి తదుపరి చర్యలు తీసుకుంటారు. ఖాదీప్రియులు అసలైన ఖాదీని గుర్తించడానికి ప్రభుత్వం ప్రత్యేకమైన గుర్తిం పు ఉన్న స్టాంపు, బాడ్జీలను వస్త్రాలపై ముద్రిస్తారు. అఖిల భారత ఖాదీగ్రామోద్యోగ కమిషన్ (ఎ.ఐ.కె.వి.ఐ.సి) ఇప్పటికీ ఇందుకు సంబంధించిన లోగో (చిహ్నం)లను విడుదల చేయడం శుభపరిణామం. కొనుగోలుదారులు ఈ బ్యాడ్జీలు ఉన్న ఖాదీ వస్త్రాలనే ఎంపిక చేసుకోవచ్చు. సన్న ఖాదీవస్త్రాలకు సమాంతరంగా రూపొందిస్తున్న నకి లీ వస్త్రాలపై ఎలాంటి గుర్తింపు కలిగిన చిహ్నాలు ఉం డవు. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఖాదీ పరిశ్రమ తన మనుగడను కాపాడుకోవడమే కాకుండా గత వైభవాన్ని సంతరించుకొనేందుకు దోహదపడుతుంది. నకిలీ ఖాదీని అడ్డుకోవడం ద్వారా అసలైన ఖాదీకి మరింత గిరాకీ వస్తుందని వేరేగా చెప్పనక్కరలేదు. ఇటీవల అంతర్జాతీయ యుద్ధనౌకల విన్యాసాల కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ విశాఖపట్టణం వ చ్చినప్పుడు నకిలీ ఖాదీ విషయాన్ని పలువురు ఆయన దృష్టికితెచ్చారు. దీంతో ఆయన స్పందించి వౌఖిక ఆదేశాలు ఇవ్వడంతో ఖాదీగ్రామోద్యోగ కమిషన్ రంగంలోకి దిగింది. పొందూరు ఖాదీకి పేటెంటు హక్కులు కల్పించింది.
ఇంతవరకు పొందూరు ఖాదీకి నకిలీ ఖాదీ సమస్య స వాలుగా మారింది. ఈ ఖాదీ వస్తవ్య్రాపారం ఏటా రూ.4కోట్లు కాగా, నకిలీ ఖాదీ రూ.16 కోట్ల మేరకు సాగుతున్నది. నకిలీ ఖాదీ వ్యాపారులు పొందూరు ఖాదీ పేరు నే తమ వస్తస్రామ్రాజ్యాన్ని విస్తరింప జేస్తున్నారు. చేతితో వడికిన నూలును కాకుండా, మిల్లుదారాన్ని ఉపయోగించి కాషాయంలో ముంచి నకిలీ వస్త్రాలను తయారుచేస్తున్నారు. దీంతో పొందూరు అసలు ఖాదీ పరిశ్రమ బీటలు వారుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభు త్వం పొందూరు ఖాదీకి పేటెంటు హక్కులు కల్పించడంతో దీని దశ దిశ మారేందుకు అవకాశం కలిగింది.
పెంచిన మజూరీలు
వడుకు పనివారలకు 20 శాతం, నేత పనివారలకు 10 శాతం మజూరీలను పెంచుతూ ఖాదీగ్రామోద్యోగ కమిషన్ ఆదేశాలు జారీచేసింది. ఈ ఏడాది ఆగస్టు 1నుంచి మజూరీలను విస్తరింపజేస్తున్నట్టు ఆదేశాల్లో పేర్కొనడం మంచి పరిణామం. పొందూరు ఖాదీ సంస్థ పరిధిలోని 40గ్రామాల్లో వెయ్యి మంది మహిళలు వడుకు పని వార లు, 75 మంది నేత పనివారు ఉన్నారు. ప్రభుత్వం పెం చిన ఈ మజూరీల ఫలితంగా పరిశ్రమ కొంతమేరకైనా నిలదొక్కుకొనే అవకాశాలున్నాయి.
హెరిటేజ్ క్లస్టర్
ఖాదీ పరిశ్రమకు పర్యాయపదంగా ఉన్న పొందూరులో రూ.5 కోట్లతో హెరిటేజ్ క్లస్టర్‌ను ఏర్పాటుచేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మొత్తాలతో వివిధ రకాల చరఖాలు, మగ్గాలు కొనుగోలుకు, అవసరమైన నైపుణ్య శిక్షణలు వినియోగించుకోవచ్చు. అయితే ఈ మొత్తాల్లో ఖాదీ సంస్థ సొంతంగా గాని, బ్యాంకు రుణం ద్వారా గాని 25 శాతం మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన 75 శాతం మొత్తాన్ని ఖాదీగ్రామోద్యోగ కమిషన్ ఉదారంగా అందజేస్తుంది. ఖాదీ సంస్థ ఆవరణలోని శిథిలమైన 8 కార్యగృహాలను (వర్కుషెడ్లు) పునరుద్ధరించేందుకు ఖాదీగ్రామోద్యోగ కమిషన్ నిర్ణయించింది. అలాగే మరో 30 కార్యగృహాలను నిర్మించేందుకు చర్యలుతీసుకోవడం మరో మంచి పరిణామం.
వెంటాడుతున్న ముడిసరకు కొరత
కేంద్ర ప్రభుత్వం ఆలస్యంగానైనా చొరవ తీసుకోవడం వల్ల మంచి జరుగుతున్నప్పటికీ పత్తి సమస్య ఇంకా వెంటాడుతునే ఉంది. ఈ పరిశ్రమకు ఎంతో అవసరమైన కొండ పత్తి, ఎర్ర పత్తి, పునాసపత్తి లభ్యంకావడం కష్టమవుతోంది. ఏటా 20వేల కిలోల పత్తిని వాడుతున్నారు. ఈ పంట తమకు గిట్టుబాటు కావడంలేదని, కిలోకు కనీసం రూ.250 మొత్తాన్ని చెల్లించాలని రైతులు డిమాండు చేస్తున్నారు. ఏవో తంటాలుపడి అతికష్టంమీద ఎంతోకొంత మొత్తాన్ని రైతులకు చెల్లిస్తున్నారు. రైతులకు నీటి పారుదల సౌకర్యం, ఎరువులను, సస్యరక్షణ మందులను ఉచితంగా కల్పిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది.
వినియోగంలోకి తెచ్చిన స్ఫూర్తి పథకాన్ని ఈ సంస్థ సద్వినియోగం చేసుకోవాలి. 2009లో ఈ సంస్థకు కేంద్ర ప్రభుత్వం స్ఫూర్తి పథకాన్ని మంజూరు చేసింది. ఇందుకోసం రూ.42 లక్షలు కేటాయించారు. అయితే అమలులో ఎన్నో అడ్డంకులురావడం విచారకరం. ఇకనైనా ఈ పథకంకింద కేటాయించిన సంప్రదాయ మగ్గాలను, యంత్రాలను వినియోగంలోకి తేవాలి.
రెడిమెడ్ దుస్తులు
ఈ సంస్థ పరిమితంగా రెడిమెడ్ దుస్తులను తయారుచేస్తోంది. అలా కాకుండా గ్రాహకుల, వినియోగదారుల అభిరుచులను దృష్టిలో ఉంచుకొని ఎక్కువగా రెడిమెడ్ దుస్తులను తయారుచేసేందుకు చర్యలు తీసుకోవాలి. ఈ సూచనలను గమనంలోకి తీసుకోవాలి. ఖాదీకి అనుబంధంగా కొన్ని గ్రామీణ పరిశ్రమలను చేపడితే ఖాదీ పరిశ్రమ మూడు పువ్వులు, ఆరుకాయలుగా వర్ధిల్లుతుంది.

చిత్రం... వస్త్రాలు నేస్తున్న దృశ్యం

- వాండ్రంగి కొండలరావు