సబ్ ఫీచర్

సేంద్రీయ సేద్యమే శరణ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరిత విప్లవం వల్ల మనం తీవ్ర కరవులను నివారించినా, మన వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఈ రంగంలో ప్రభుత్వ పెట్టుబడి తగ్గుతూ వస్తున్నది. ఆహార ధాన్యాల పెరుగుదలలో స్థిరత్వం లేదు. ఉత్పత్తి పెరగటం, మరల తగ్గటం సాధారణమై పోయింది. వివిధ ధాన్యాల ప్రగతిలో వ్యత్యాసాలు బాగా వున్నాయి. వరి, గోధుమలలో ప్రగతి బాగున్నా, తృణ ధాన్యాలు, పప్పు ధాన్యాల విషయంలో ఆశించిన ప్రగతి లేదు. 30 శాతం సాగుభూమికే నీటి పారుదల సౌకర్యాలు వున్నాయి. ఎరువుల వాడకం పెరిగినా దీనిలో శాస్ర్తియత లేదు. ధరలు పెరిగినా రైతుకు వచ్చేది తక్కువే. దళారులే రాజ్యమేలుతున్నారు. రైతులు శాస్ర్తియ సాగుపై శ్రద్ధ చూపాలి. ఏక రీతి పంటలు వేయడంవల్ల రైతులు నష్టపోతున్నారు. ఉత్పాదకతలో మనం ప్రపంచ దేశాలతో పోలిస్తే చాలా వెనకబడి వున్నాం. ఎరువుల వినియోగం సరిగా లేనందున పెట్టుబడులు పెరిగినా దిగుబడులు ఆశించిన స్థాయిలో లేవు. వరి విషయంలో మన దిగుబడి హెక్టారుకి 3.38 టన్నులు వున్నది. చైనాలో ఇది 6.54 టన్నులు, గోధుమ దిగుబడి మన దేశంలో 3.12 టన్నులు, చైనాలో 4.2 టన్నులు, చిన్న, సన్నకారు రైతులు ప్రయోజనం పొందాలంటే ఉత్పాదకతను బాగా పెంచాలి. ఇంకొక విషయం. మన దేశానికి అధిక దిగుబడి సాధించే శక్తి వుంది. దీనిని మనం పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం లేదు. ఉదాహరణకు, వరి విషయంలో మన దిగుబడి 5 టన్నుల వరకు పెంచవచ్చు. ఈ నేపథ్యంలో సేంద్రీయ సేద్యమే ఉత్తమం. దీనివలన అనేక ప్రయోజనాలు పొందవచ్చు. రైతులు ప్రకృతి సేద్యంపై మొగ్గు చూపవలసిన సమయం వచ్చింది. ప్రత్యేకమైన వానపాముల్ని సేంద్రియ వ్యర్థ పదార్థం మీద వదిలినప్పుడు, అవి తిని విసర్జించిన గుళికలనే ‘వర్మికంపోస్టు’ అంటారు. కిలో వానపాములు రోజుకు 5 కిలోల చెత్తను కంపోస్టుగా మార్చగలవు. వర్మికంపోస్టు వాడినప్పుడు రసాయనిక ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. వర్మి కంపోస్టు తయారుచేసే రైతులకు ప్రభుత్వంనుండి ప్రోత్సాహకాలు వుండాలి.
చీడ పీడలు అధికంగా ఆశించడంవల్ల పంట నాణ్యత తగ్గుతోంది. చీడ నివారణకు వేప గింజల కషాయం, పచ్చి మిరప- వెల్లుల్లి ద్రావణం వాడవచ్చు. పొగాకు కషాయం, పశువుల పేడ, మూత్రంతో ద్రావణం కూడా వాడవచ్చు. అయితే, జీవన ఎరువులను పురుగుల మందులతోను, రసాయనిక ఎరువులతోను కలిపి వాడకూడదు. పంట భూముల్లో రసాయన ఎరువులను విస్తారంగా వాడటంవల్ల భూ ములు అనేకచోట్ల నిస్సారమవుతున్నాయి. జీవన ఎరువులవల్ల వాతావరణ కాలు ష్యం తక్కువ. మొక్కలు వాటికి అందుబాటులో లేని పోషకాలను కూడా అందుబాటులోకి తెచ్చుకోగలవు. నేల భౌతిక లక్షణాలు బాగుపడి భూసారం అభివృద్ధి చెందుతుంది. సాధారణ దిగుబడులు 10 శాతం పెరిగి, రసాయన ఎరువుల వాడకం 20 శాతం తగ్గించుకోవచ్చు. అంతర పంటల విధానంవల్ల రైతులకు ఆర్థిక నష్టం తగ్గి వ్యవసాయం గిట్టుబాటు అవుతుంది. ఆరోగ్య సమస్యలపై అవగాహన పెరిగిన అభివృద్ధి చెందిన దేశాలలో సేంద్రియ ఉత్పత్తులకు మంచి గిరాకి వుంది. అధిక ధర చెల్లించడానికి వినియోగదారులు వెనకాడటం లేదు. సేంద్రీయ ఉత్పత్తులలో రసాయన అవశేషాలు, కాలుష్యాలు వుండవు. అందువల్ల సేంద్రియ వస్తువులు ఆరోగ్యకరమైనవి.
మన దేశంలోనూ సేంద్రీయ ఉత్పత్తులు ఎప్పటినుండో జరుగుతున్నాయి. ఉదాహరణకు, గిరిజన ప్రాంతాల్లో పండించే తిండి గింజలు, దుంపలు, చింతపండు, తేనె, పండ్లు, కూరగాయలు ఇవన్నీ సేంద్రీయ ఉత్పత్తులే. వర్షాధారపు ఆహార పంటలు కూడా అధిక భాగం సేంద్రీయ ఉత్పత్తులే. అయితే ఇవి, ఒక ప్రణాళిక ప్రకారం ఉత్పత్తి చేసినవి కావు. అందువల్ల వీటి ఉత్పత్తి తక్కువ స్థాయిలో వుంది. మన దేశంలో సేంద్రీయ సాగు పుంజుకుంటున్నది. ప్రస్తుతం 7.23 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో, సర్టిఫైడ్ సేంద్రియ సేద్యం సాగుతున్నది. ప్రపంచం మొత్తం మీద 130 దేశాల్లో 4.3 కోట్ల హెక్టార్లలో సేంద్రీయ వ్యవసాయం జరుగుతున్నది. సేంద్రీయ వస్తువులకు ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్ అమెరికా. ఆ తర్వాత స్థానాల్లో ఫ్రాన్స్, జర్మనీ, కెనడాలున్నాయి. చైనాలో కూడా ఈ వస్తువులకు మంచి గిరాకీ వుంది.

- డాక్టర్ ఇమ్మానేని సత్యసుందరం