సబ్ ఫీచర్

కానె్సప్ట్ అభివృద్ధే ముఖ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉపాధ్యాయుడు తరగతి గదిలో కాలుపెట్టక ముందే తరగతి గది స్వరూపం ఆయన మేధస్సులోనే ఏర్పడుతుంది. అది ఒక్క ఉపాధ్యాయునికే కనిపిస్తుంది. ఇతరులకు కనిపించదు. ఆ పుస్తకంలో వున్న సమాచారంలో కీలకభావన ఏమిటిది? హంస బురదలోనుంచి తన ఆహారాన్ని ఏరుకున్నట్టే ఉఫాధ్యాయుడు పాఠంలో మూలం ఏమిటి అని వెతుక్కుంటాడు. దానినే కానె్సప్ట్ అంటారు. ఉపాధ్యాయుడు తరగతి గదికి పోకముందు ఇవాళ జామెట్రీ చెప్పాలని పుస్తకం చూసేవాడ్ని. దానిలో ఒక త్రిభుజంలో కోణాలు మూడు మొత్తం 180 డిగ్రీలు. దీనిలో మూల విషయం ఏమిటి? ఆకారాలకున్న మూలానికున్న సంబంధాన్ని ఆలోచించాలి. ఆకారం చిన్న భుజం కావచ్చు. మధ్య భుజం కావచ్చు. ఆరు భుజాలుగల ఆకారం కావచ్చును. ఆ భుజాలు ప్రతి రెండు భుజాల మధ్యన ఒక కోణం ఏర్పడుతుంది కదా అనుకున్నాను. ఉదాహరణకు ఐదు వేళ్లున్నాయి. ప్రతి రెండు వేళ్ల మధ్యన ఒక కోణం ఏర్పడుతుంది. అంటే 4 కోణాలు ఏర్పడతాయి కదా అనుకుంటాను. దానే్న కానె్సప్ట్ అంటాం.
ప్రాచీన గణిత శాస్తవ్రేత్త లూక్లేనియన్ భుజాలకు కోణాలకు మధ్య వుండే సంబంధం కనిపెట్టాడు. ఎన్నో త్రిభుజాలు గీసాడు కదా! ప్రతిసారి కోణాలను కొలమానం చేసాడు. అది 180 డిగ్రీలే వచ్చింది. ఈ సమాచారానే్న డేటా అంటారు. కొత్త విషయం తెలుసుకునే ముందు డేటా కావాలి. 180 డిగ్రీలే ఎందుకొస్తుంది. అదే లూక్లేనియన్ మెదడులో తిరుగుతుంది. దానికే తార్కికమైనటువంటి ప్రూఫ్ (ఉత్పత్తి) ఏమిటి? అనగా ప్రయోగాన్ని గణిత భాషలో మార్చుతారు. ఇదే మాదిరిగా 180 డిగ్రీలయ్యే సిద్ధాంతం గణితంలో ఇంకేదైనా ఉందా అని ఆలోచిస్తాడు. ఒక సరళ రేఖ మరో సరళ రేఖతో కలిస్తే ఆసన్న కోణాలు ఏర్పడతాయి కదా! దాని మొత్తం కూడా 180కదా! ఈ త్రిభుజంలో కూడా ఆసన్న కోణాలు ఏమైనా వుంటాయా? అని ఆలోచిస్తాడు. ఏదైనా ఒక భుజాన్ని పొడిగిస్తే ప్రతి కోణానికి ఒక ఆసన్నకోణం వస్తుంది. వాటి ప్లాన్ కూడా 180 డిగ్రీలే కదా అన్న ఆలోచన తీసుకుంటాడు. భుజంను పొడిగించే విషయానే్న నిర్మాణం అంటారు. లూక్లేనియన్ మెదడులో ఒక నిర్మాణం జరిగింది. మేధావి చేసే పని అదే. కొత్తగా నిర్మాణం చేయడమే.
1927 మూసీ వరదలతో హైదరాబాద్ నగరం దాదాపుగా మునిగిపోయింది. నగరం అల్లకల్లోలం అయింది. అందరూ ఆలోచించారు. ఈ విధమైన ఉపద్రవాలనుంచి నగరాన్ని ఎలా కాపాడుకోవాలి? ఎవరికీ ఆలోచన తట్టలేదు. మోక్షగుండం విశే్వశ్వరయ్య దగ్గరకు వెళ్లారు. నగరం బొమ్మ మూసీనది ప్రవాహం బొమ్మ వేసుకుని రమ్మన్నాడు. ఈ నీరువల్ల ఈ నగరం కొట్టుకుపోయిందన్నది సమస్య. ఈ నీరు ఈ నగరంలోకి రాకుండా చూడాలి. ఇప్పుడున్న సెక్రటేరియట్ పక్కన హుస్సేన్‌సాగర్ నిర్మించమన్నాడు. ఆ చెరువు నిండితే ఆ నీరు పోవడానికి కాలువలు నిర్మించమన్నాడు. అదే చిక్కడపల్లి. ఇంజనీర్ చేసే పని ఏమిటంటే మూసీ నీరుతో నగరం మునగకుండా చూడడమే మూల విషయం. అదే కానె్సప్ట్. నగరాన్ని ముప్పునుంచి బైటపడేసాడు కాబట్టే విశే్వశ్వరయ్య విగ్రహాన్ని ఖైరతాబాద్‌లో వేసారు. తరగతి గదిలో చెప్పబోయే పాఠానికి మూలం ఎక్కడుందని ఉపాధ్యాయుడు ఆలోచిస్తాడు. దానికోసం కొత్త నిర్మాణాలను వెతుకుతాడు.
చెప్పబోయే పాఠానికి మూలం ఎక్కడున్నదని ఉపాధ్యాయుడు ఆలో చించడం మొదలుపెట్టడమే ఒక ప్రధానమైన మెట్టు. అప్పుడు మాత్రమే విద్యార్థుల్లో కూడా సరికొత్త ఆలోచనలు పదును తేలుతాయ. ఆవిధంగా వారికి చిన్నతనం నుంచే కానె్సప్ట్ అభివృద్ధి చెందుతుంది. అదే విద్యకు అసలైన పునాది.

- చుక్కా రామయ్య