సబ్ ఫీచర్

రిజర్వేషన్లను సమీక్షించాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా రిజర్వేషన్‌లపై విస్తృతమైన చర్చ జరుగుతున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగం నుంచి క్రమక్రమంగా తప్పుకొంటూ కార్పొరేట్ విద్యను ప్రోత్సహిస్తూండటంతో పలు కులాలు తమకు కూడ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. నాడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఏ లక్ష్యంతోనైనా రిజర్వేషన్ విధానాన్ని ప్రవేశపెట్టారో, సదరు విధానంకు తూట్లు పొడిచేలా ప్రస్తు తం పలు ఉద్యమాలు సాగుతున్నాయి. ఆ కోవలోదే గుజరాత్ రాష్ట్రంలో హార్దిక్‌పటేల్ ఆధ్వర్యంలో జరుగుతున్న పటేళ్ళ ఉద్యమం. పటేళ్ళ ఉద్యమం వెనుక ఆర్. ఎస్.ఎస్. ఉందని ఆరోపణలు వస్తున్నాయి. ఆర్.ఎస్.ఎస్. చీఫ్ మోహన్‌భగవత్ రిజర్వేషన్లను సమీక్షించాలంటూ చేసిన ప్రకటన దేశంలో పెద్ద దుమారానాన్ని సృష్టిం చాయి. అయతే ప్రస్తుతం మన దేశంలో అమలులో వున్న రిజర్వేషన్ విధానాన్ని పునఃసమీక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రపంచీకరణ విధానాలు మన దేశంలో ధనవంతులు కోటీశ్వర్లు అవ్వడానికి, కోటీశ్వరులు బిలియనీర్లు అవడానికి దోహదపడ్డాయి. అదే సమయంలో కుటీర, చిన్న తరహా పరిశ్రమలు కనుమరుగయి పేదలు నిరుపేదలుగా మారారు. ప్రస్తుతం మన దేశంలో అమలులో ఉన్న రిజర్వేషన్లకు, ప్రపంచీకరణ విధానాలకు మధ్య అవినాభావ సంబంధం ఉంది. రిజర్వేషన్లు ఒకసారి వినియోగించుకొని, లబ్ధిపొందిన వారే పదే పదే వాటిని వినియోగించుకొంటూ లాభిస్తున్నారు. రిజర్వేషన్‌లను వినియోగించుకోని వారు ఇంకా పేదరికంలోనే మ్రగ్గుతున్నారు. అందువల్లనే, రిజర్వేషన్లు అమలులోకి వచ్చి ఆరున్నర దశాబ్ధాల కాలం దాటినా ఎస్.సి., ఎస్.టి.లు ఇప్పటికే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారు. రిజర్వేషన్ విధానాన్ని పునఃసమీక్షించాలని కోరే వారిని దళితుల అభివృద్ధికి వ్యతిరేకులుగా భావించడం సరికాదు. రిజర్వేషన్లు అమలుచేస్తున్నది సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన ఎస్.సి, ఎస్.టిల అభివృద్ధికోసం. కాని, వాస్తవంగా జరుగుతున్నది అందుకు భిన్నం. ఎస్.సి, ఎస్.టి.లలో రిజర్వేషన్లు వినియోగించుకొని లబ్ధిపొందిన వారి కుటుంబాలే, తరతరాలుగా రిజర్వేషన్లను వినియోగించుకొంటున్నాయి. రిజర్వేషన్లకు వినియోగించుకోని వారి పరిస్థితి ‘ఎక్కడ ఉంది గొంగళి అంటే వేసిన కాడే కంబళి’ అన్న చందాన ఉంది. దీనివలన రిజర్వేషన్ల అమలు లక్ష్యం నీరుకారిపోతున్నది.
విద్యారంగం నుంచి పాలక పక్షాలు క్రమంగా తప్పుకోవడంతో, ఉన్నత విద్య అభ్యసించడం ఖర్చుతో కూడుకొంది. దీంతో రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా బలమైన స్థితిలో ఉన్న పటేళ్ళు (గుజరాత్) జాట్స్ (హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్), మరాఠాలు (మహారాష్ట్ర), గైక్వాడ్స్ (బరోడా), ఏవార్లు, చవాన్‌లు (మహారాష్ట్ర)లు తమకు కూడ రిజర్వేషన్లను అమలుచేయాలని డిమాండ్ చేస్తున్నారు. వీరందరూ అగ్ర వర్ణాలకు చెందినవారే. త్వరలో మరిన్ని అగ్రవర్ణాలు తమకు కూడ రిజర్వేషన్ వర్తింపచేయాలని డిమాండ్ చేసే అవకాశాలు లేకపోలేదు.
రిజర్వేషన్ ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంత దళితులు అభివృద్ధి చెందకపోవడానికి కారణం, సదరు రిజర్వేషన్లను పట్టణ ప్రాంతానికి చెందిన దళితులు హైజాక్ చేయడమే. పట్టణ, నగర ప్రాంతాలలోని దళిత విద్యార్థులు కార్పొరేట్ స్కూల్స్‌లో చదువుతున్నారు. గ్రామీణ ప్రాంతాలలోని దళిత విద్యార్థులు సౌకర్యాల లేమితో కునారిల్లుతున్న ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థి కార్పొరేటు విద్యాసంస్థల్లో చదివిన వారితో పోటీపడలేరు. దీనివలన పట్టణాలకి చెందిన దళిత విద్యార్థులకే రిజర్వేషన్లు ఉపయోగపడుతున్నాయి.
ఉన్నత విద్య, సివిల్ సర్వీసెస్ వంటి వాటిలో రిజర్వేషన్ల వలన లబ్ధిపొందుతున్న దళితులలో అధికారుల, రాజకీయ నాయకుల, ఆర్థికంగా స్థిరపడిన వారి పిల్లలే ఎక్కువ శాతం ఉంటున్నారు. అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న గ్రామీణ ప్రాంతదళిత విద్యార్థులకు ఈ రిజర్వేషన్లు అంతగా ఉపయోగపడటం లేదు. ఎస్.సి, ఎస్.టి రిజర్వేషన్‌ను కులాల వారీగా కాకుండా, ఆయా కుటుంబాలు రిజర్వేషన్‌ను వినియోగించుకొన్న క్రమం ఆధారంగా ఎ,బి,సి,డి గ్రూపులుగా విభజించాలి.
రాజకీయాలు, విద్య, ఉద్యోగపరంగా రిజర్వేషన్‌ను ఒక్కసారి కూడ వినియోగించుకోని కుటుంబాలను ఏ గ్రూపులో చేర్చాలి. కుటుంబంలో ఒకరు రిజర్వేషన్‌ను వినియోగించుకొంటే, వారిని బి గ్రూపులో చేర్చాలి. రెండు విధాలుగా రిజర్వేషన్‌ను వినియోగించుకొన్న వారిని సి గ్రూపులోను, రిజర్వేషన్‌ను అన్ని విధాలుగా వినియోగించుకొన్న వారిని ‘డి’ గ్రూపులో చేర్చాలి. ఎస్.సి, ఎస్.టి. రిజర్వేషన్‌ను కదల్చకుండా, పైన పేర్కొన్న ప్రాధాన్యత క్రమంలో అమలుచేసినప్పుడు, దేశంలో ఉన్న దళితులందరికీ రిజర్వేషన్లను వినియోగించుకొనే అవకాశం కలుగుతుంది. తద్వారా గ్రామీణ ప్రాంతాలలోని దళితులకు సైతం రిజర్వేషన్లు అందుబాటులోకి వచ్చి, వారు అభివృద్ధి చెందే అవకాశం ఏర్పడుతుంది.్భవిష్యత్ కాలంలో దేశంలో రిజర్వేషన్లను అమలుచేయాల్సిన అవసరం ఉండదు. అయితే, రిజర్వేషన్లను ఈ విధంగా అమలుచేయాలంటే దృఢ చిత్తం కావాలి. ఈ పద్ధతి పట్ల ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రభుత్వపరంగా తగిన కృషి జరగాలి. అప్పుడు ప్రజలు కూడ రిజర్వేషన్లు అమలును పునఃసమీక్షించాలన్న డిమాండ్‌కు మొగ్గుచూపే అవకాశం ఉంది. రిజర్వేషన్లను ప్రాధాన్యత క్రమంలో అమలుచేసినప్పుడే రిజర్వేషన్లు అమలు ద్వారా డాక్టర్ అంబేద్కర్ సాధించాలనుకొన్న లక్ష్యాలను చేరుకోవడం సాధ్యం అవుతుంది.

- పి.మస్తాన్‌రావు