సబ్ ఫీచర్

మింగుడు పడని సంగతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాదు బిర్యాని తినిపిస్తానని చెప్పి తీరా తినేవేళకు కాకరకాయ కూరతో భోజనం వడ్డిస్తే ఎవరికైనా ఎలా వుంటుంది? కాకరకాయ ఆరోగ్యానికి పనికొస్తుందని తెలిసినా ఎక్కువ సందర్భాల్లో జనానికి నోరూరించేది బిర్యానీ అన్న విషయం ఎవరైనా ఎందుకు కాదంటారు? పలు రుచులకు అలవాటుపడిన వారికి అనుకున్న వాటికి ప్రతికూలంగా ఎన్నిదొరికినా ముద్ద మింగుడు పడదు. మండు టెండల్లో ప్రయాణం చేసే వారికి శీతల పానీయాలో, ఐస్‌క్రీమో బ్రహ్మాండంగా అనిపిస్తాయి తప్ప బిందెలోని నీళ్లు మింగుడు పడవు కదా! తిని తాగే విషయాల్లోనే కాదు జన జీవితంలో ప్రతినిత్యం మింగుడు పడని సంగతులెన్నింటినో తనకు ఇష్టమున్నా లేకున్నా మనిషి భరించవలసి వస్తుంది. వేద భూమిగా, కర్మభూమిగా ప్రతిక్షణం గర్వంగా పొంగిపోయే దేశంలో దేశవాసుల నడత అందుకు భిన్నంగా వుంది.
అనుక్షణం ప్రజలకోసం ప్రజల బాగుకోసం తపిస్తున్నట్లు కనిపించేవారు ప్రజలనుంచి వచ్చినవారే కాని ప్రజల పట్ల నిజంగా ప్రేమాభిమానాలు వున్నవారు కాదు. ఖచ్చితంగా చెప్పాలంటే తమ దేహం పట్ల వ్యామోహం వున్నవారు తప్ప తమ జీవితాన్ని మనసారా ప్రేమించేవారు ఎంతమాత్రం కాదు. ఎంతసేపూ వారు పదవిని ప్రేమిస్తారు. ఆ పదవితో చెయ్యగలిగే ప్రజాసేవకన్న కొన్ని కోట్ల రెట్లు ఆ పదవిని అడ్డం పెట్టుకొని మూటకట్టుకోగలిగే అక్రమార్జనను అమితంగా ప్రేమిస్తారు. డబ్బుముందు, అధికారం ముందు, పలు మత్తుల ముందు, బేరసారాల ముందు వారికి ప్రజలు పేపలంగానే కనిపిస్తారు. వచ్చిన చిక్కల్లా తాము పార్టీలు ఏ ప్రలోభాలకు లొంగి మారినా ప్రతి ఒక్కరు ప్రజలకు మరింత సేవ చెయ్యాలన్న సదుద్దేశంతోనేనని విసుగు విరామం లేకుండా చెబుతూనే వుంటారు. తాము చెప్పేది జనం నమ్మకపోవడమే కాదు అసహ్యించుకుంటున్నారని తెలిసి కూడా జనమంతా తమతోనే వున్నారని, తామున్నదే జనం కోసమని జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తూనే వుంటారు. నిజానికి నీతి, అవినీతి అనేవి ఒకే ఒరలో ఇమడలేని కత్తులని ఎవరికి మాత్రం తెలియదు?
తెలియనిది తెలిసినట్లు, తెలిసింది తెలియనట్లు జీవించడం చాలామందికి వెన్నతో పుట్టిన విద్య. తాము గందరగోళంలో మునిగి ఎదుటివారిని గందరగోళంలో వున్నట్లు తెగ ప్రచారం చేస్తుంటారు. బెల్లం చుట్టూ మూగే ఈగలకన్న అధికారం చుట్టూ తిరిగే నేతలనైనా వుద్యోగులనైనా చూసినకొద్ది ప్రేమాభిమానాలు పెరుగుతాయని ఎవరన్నా మింగలేని కక్కలేని విషయమే కదా! నిన్నటిదాకా లేని ప్రగతి ఒక్కసారిగా పరుగులు కాక ఎక్కడెక్కడికో ఎగురుతుందని ఎవరు భ్రమింపచేసినా అక్షరాలా ఆత్మవంచనే! ఫిరాయింపుదారులు రంకు నేర్చిన వాళ్ల బొంకులకన్న ఎక్కువగానే బొంకగలరు. అంతమాత్రాన వున్న జెండా వదిలేసి, మరో జెండా మోసేందుకు సిద్ధపడినా, వున్న కండువాని విసిరికొట్టి కొత్త కండువా కప్పించుకున్నా లేని గుర్తింపేదో వస్తుందని, అందని గౌరవమేదో అందుతుందని ఎవ్వరూ నమ్మరు.
ఏదో ఒక దారిలో అధికారంలో పాలుపంచుకోవాలన్న యావ తప్ప ప్రజాసేవ పట్ల మమకారం ఎందరిలో కనిపిస్తుంది? పొరపాటుకి అవకాశం లేని మానవ జీవితాన్ని వూహించలేం. పొరపాట్లని అలవాట్లుగా మార్చుకునేందుకు అలవాటుపడిన వారిని ఎవరు మాత్రం సరిదిద్దగలరు? ఎటొచ్చీ ఎవరో చేసే దౌర్భాగ్యపు పనులకు మరెవరో బలవడం న్యాయం కాదు. ప్రజా జీవితంలో ప్రతినిత్యం మింగుడు పడని సంగతులెన్ని ఎదురవుతున్నా ఎవరికి మింగుడు పడినా పడకపోయినా తమతమ పటాటోపాలకు అతీతంగా ఎవరి నేరాలకు వారు శిక్షలనుభవించక తప్పదు కాక తప్పదు.

- డా.కొల్లు రంగారావు