సబ్ ఫీచర్

చవితి వేళ వినాయక విహారం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినాయక చవితి సందర్భంగా తనకు అత్యంత ఇష్టమైన భారతదేశ యాత్ర చెయ్యడానికి మూషిక వాహనంపై కైలాసం వీడాడు గణపతి. ‘అక్కడి విషయాలేమిటి?’- అంటూ ముందుగానే నందిని వాకబు చేశాడు గణేశుడు. ‘మీరు అక్కడి పరిణామాలను సరిగ్గా గమనించడం లేదని నా అనుమానం.. ఏదీ మూడు ప్రశ్నలడుగుతాను.. జవాబులు చెప్పండి..’ అన్నాడు నంది. ‘ఏమిటి ఈ నస’ అన్న మూషికాన్ని ‘మూసుకో నోరు’ అని గదమాయించి, మొదటి ప్రశ్నను సంధించాడు నంది- గణపతి అనుమతి కోసం చూడకుండానే.
‘‘్భరతదేశంలో అతి చవక ఏమిటి?’’
‘‘మనిషి ప్రాణం..! రోడ్ల పరిస్థితి చూడు..’’ అన్నాడు గణపతి.
‘‘మీ జవాబు తప్పు.. ఇప్పుడంతకన్నా చవక అయినది- ‘రూపాయి’. మార్కెట్ పరిస్థితి చూడండి..’’.
‘‘రెండో ప్రశ్న- క్షణక్షణానికీ పెరిగేది ఏమిటి?’’
‘‘మనిషి వయస్సు’’
‘‘తప్పు.. పెట్రోల్, డీజిల్ ధర’’
‘‘మూడో ప్రశ్న. పార్టీలతో సంబంధం లేకుండా నేతలందరూ పలికే స్లోగన్?’’
‘‘వందేమాతరం’’
‘‘కాదు. వందేళ్లు మాదే అధికారం.’’
‘‘చూశావా గణపతీ, అక్కడి మార్పులు మీరు గమనించడం లేదు. ఎన్నికలొస్తేనే ధరలు తగ్గించే ప్రభుత్వాల్లా, చవితి వస్తేనే కదులుతున్నావు. కొంచెం వారిని పట్టించుకో స్వామీ’’. నందికి తలూపి గణపతి కిందకు వచ్చేసాడు- మొదట రాహుల్ గాంధీని పలకరిద్దామనుకొంటూ.
ఎంతైనా రాహుల్ ఈ మధ్య తన శివభక్తిని ‘ట్వీట్’ చెయ్యడమే కాకుండా, మానస సరోవరం కూడా వెళ్ళొచ్చాడు కదా. కొంచెం లైక్. గణపతిని పలకరించి కౌగిలించి, మూషికానికి కన్ను కొట్టాడు రాహుల్.
‘‘రాహుల్.. కొంచెం సేపు.. క్రియేటివ్‌గా ఆలోచించు’’- తన తండ్రికి భక్తుడన్న మురిపెంతో సలహా ఇచ్చాడు గణనాథుడు.
‘‘బిల్‌కుల్ కరేంగే జీ’’ అంటూ రాహుల్ వెంటనే మూషికాన్ని కౌగిలించుకొని, గణనాథుడికి కన్నుకొట్టాడు.
ఇక మోదీని చూద్దామని వెళ్లాడాయన మూషిక వాహనంతో పాటు. ఆయన మోదకులు, ఉండ్రాళ్ళు ఎలా చేస్తే మంచిదో, అలా చేయడం ఎంత అవసరమో, ప్రతిపక్షాలకు వాటిమీద అజ్ఞానం ఎంత ఉందో లెక్కలేసి, వెక్కిరించి చెప్పాడు తప్ప- ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రసాదంగా పెట్టలేదు. పైగా తనకొచ్చిన కొత్త ఐడియా చెప్పాడు.
‘‘గణపతి జీ.. సంవత్సరంలో ఇన్నిసార్లు పండుగలెందుకు, దండగ. అందరు దేవుళ్లకు కలిపి ఒక్కసారి జమిలి పండుగ చేసేస్తే కైసే హోగా?’’
‘‘హమ్ భాగ్ గయా’’ అంటూ గణపతి బయటపడ్డాడు.
తెలుగు రాష్ట్రాల్లో మొదలైన ఎన్నికల జ్వరాలు చూసి అటువైపు వెళ్లకపోవడమే మేలని భావించాడు గణపతి. లేకపోతే మరేమిటి? కేసిఆర్ కూడికలు, తీసివేతలు, కొత్తరకం తిట్లూ ప్రాక్టీసుతో బిజీ బిజీ..
చంద్రబాబు కొత్త పథకాలు, వాటికి కొత్త నామకరణాలూ, కేంద్రంపై కారాలు, మిరియాలు తరహా పనులతో బిజీ.
‘నవరాత్రులు.. నవరాత్రులు’ అని వినబడుతున్నాయేమిటా? అని ఆశగా జగన్‌వైపు వెళ్తే, అవి నవరాత్రులు కావు, ‘నవరత్నాలు.. నవరత్నాలు’ అన్న కలవరింతలని తెలిశాయి. పవన్‌కళ్యాణ్ ఎదురుపడినా తనను చూసి ఎగ్జైట్ అవ్వలేదు, ఏమిటా? అని అడిగితే- ‘చూడప్పా, గణపతి బప్పా, నువ్వంటే గౌరవమే కానీ నువ్వు నా దేవుడివి కావు.. ప్రజలే నా దేవుళ్ళు’. అది విని వినాయకుడే ఫ్లాట్ అయ్యాడు.. ‘ఎప్పుడు తగ్గాలో తెలియడం కాదు.. ఎప్పడే డైలాగు ఒగ్గాలో తెలిసినోడే స్టార్’ అనుకొంటూ. ఇక లాభం లేదని మూషికుణ్ణి తట్టి లేపి కైలాసం వైపునకే దారితీశాడు గణపతి.

- డా డి.వి.జి.శంకర్‌రావు 94408 36931