సబ్ ఫీచర్
నిస్వార్థ పాలకులే దేశ హితైషులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కాంగ్రెస్ పార్టీ ‘లోగో’ గురించి తెలియనివారు, దాన్ని చూడనివారు కూడా ఈ దేశానికి ఆ పార్టీయే స్వాతంత్య్రం తెచ్చింది, ఆర్.ఎస్. ఎస్. వారు చేసిందేమీ లేదని ఆరోపిస్తుంటారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ పుట్టకముందు దేశం కోసం బలిదానాలు చేసినవారు ఎందరో ఉన్నారు కదా? అర్బన్ నక్సలైట్లను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ‘క్రాంతికారులన్న’ట్లు- కాంగ్రెస్ పుట్టకముందు స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న వారిని దేశద్రోహులంటారా? తమది జాతీయపార్టీ అని చెప్పుకుంటున్న ప్రస్తుత కాంగ్రెస్ నేతలు ఇది ఇందిరాగాంధీ పెట్టిన ‘సొంత కుంపటి’ అని గుర్తించాలి. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీని ‘కాంగ్రెస్-ఐ’ (ఇందిర) అనాలి. ఇది స్వాతంత్రోద్యమ కాలం నాటి జాతీయ కాంగ్రెస్ పార్టీ కానే కాదు.
కాంగ్రెస్ సుదీర్ఘ పాలనలో దోపిడీదార్లకు తలుపులు బార్లా తెరచి ఎంతోమందిని దేశద్రోహులుగా, ఆర్థిక నేరస్థులుగా తయారుచేశారు. పలు కుంభకోణాల్లో నిందితులైన వారిలో ప్రస్తుతం అనేకమంది బెయిల్‌పై ఉన్నారు. అందులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, పి.చిదంబరం, ఆయన కొడుకు కార్తీ చిదంబరం తదితరులున్నారు. అనేకమంది ఏళ్ల తరబడి కేసులను ఎదుర్కొంటూనే ఉన్నారు. బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లాంటి ‘బడాబాబులు’ చేసిన పాపాలకు కాంగ్రెస్ పార్టీ అండదండలే కారణం.
కాగా, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కమల్‌నాథ్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందితే దేశంలో ఆరెస్సెస్ లేకుండా చేస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులెవరూ ఆరెస్సెస్ కార్యక్రమాలలో పాల్గొనకుండా చేస్తానని ఆయన ప్రకటించారు. జాతీయ భావాలతో దేశహితం కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సేవాసంస్థ ఆరెస్సెస్. అదేమైనా నిషేధించబడిన సంస్థనా? ఆరెస్సెస్‌పై ఆంక్షలు పెడతామని కమల్‌నాథ్ చేసిన ప్రకటన ముస్లింల సంతుష్టీకరణ కాదా?
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ గెలిస్తే- క్రైస్తవులకు ప్రతి గ్రామంలో చర్చి కట్టుకోవడానికి స్థలం, నిధులు ఇస్తానంటాడు, ముస్లింలకు రక్షణ కల్పిస్తానంటాడు. కాంగ్రెస్ పరిపాలనలో అనేక పర్యాయాలు మతకలహాల సందర్భంగా హైదరాబాద్‌లో కర్ఫ్యూ విధించేవారు. గత నాలుగున్నర సంవత్సరాలుగా దేశంలోగాని, తెలంగాణలో గాని ఎక్కడా మతకలహాలు లేవు, కర్ఫ్యూలు లేవనేది దేశ ప్రజలకు తెలియనిదా? జనసంఖ్య కంటే చర్చీల సంఖ్య ఇప్పటికే అధికంగా ఉంది. ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి హిందూ ఓట్లతో పనిలేదు. అందుకే ఆయన ‘మైనారిటీ మంత్రం’ జపిస్తున్నాడు. తెలంగాణలో భాజాపా అధికారంలోకి వస్తే దేశమంతా హిందూ మయవౌతుందని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోస్యం చెప్పాడు. అంటే కాంగ్రెస్ నాయకులకు 85 శాతం హిందువులు ఓటర్లుగా కనిపించరు. దేశవ్యాప్తంగా ఉన్న 14 శాతం ముస్లింలే ఓటర్లుగా కనిపిస్తారు. మత ప్రాతిపదికనే పాకిస్తాన్, హిందుస్థాన్‌గా భారతదేశం ముక్కలైందన్న విషయం దేశ ప్రజలకు తెలియనిదా?
పదిహేను నిమిషాలు పోలీసులు గమ్మున ఉంటే ఈ దేశంలో హిందువులు లేకుండా చేస్తామని ప్రకటించిన ఎమ్‌ఐఎమ్ పార్టీతో తెలంగాణలో టిఆర్‌ఎస్ పార్టీ అంటకాగుతుంది. తెలంగాణ విమోచన దినాన్ని కూడా నిర్వహించలేని టిఆర్‌ఎస్ పార్టీ నేతలు దేశ విదేశాలలో మాత్రం ‘బతుకమ్మ’ ఆడిస్తారు. బతుకమ్మ ఆడే స్ర్తిలు తమ పార్టీకి చెందినవారు కాదని అనుమానం వచ్చిన వారిని అరెస్టు చేయిస్తారు. ఇదెక్కడి న్యాయం?
సైనిక దళం, పోలీసు విభాగం, రిజర్వ్ బ్యాంకు, ఎన్నికల కమిషన్, న్యాయవ్యవస్థ ఇలా అనేక సంస్థలు దేశహితం కోసం పనిచేస్తున్నప్పటికీ ఈ సంస్థలలో పనిచేసేవారూ మానవమాత్రులే. ఈ సంస్థలలో కూడా అప్పుడప్పుడు అక్కడక్కడ ఒకరిద్దరి వల్ల తప్పులు జరుగుతాయి. తప్పుచేసిన వారిని శిక్షించడం మినహా ఆ సంస్థలను రద్దుచేయరు కదా? మన దేశంలో జైలు జీవితం గడిపిన, గడుపుతున్న ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు కదా? అంతమాత్రాన ముఖ్యమంత్రి వ్యవస్థను రద్దుచేయలేదు కదా? ఇంట్లో ఎలుకలున్నాయని ఇంటిని తగులబెట్టిన చందంగా ఉన్నది కొందరి వాదన. సీబీఐ తమ రాష్ట్రంలో అడుగుపెట్టడానికి వీలు లేదని జీవో తెచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయు డి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఎందుకూ కొరగాకుండా పోతోంది. అధికార దాహంతో రాష్ట్ర ప్రజలను అంధకారంలోనికి నెట్టడానికైనా వెనుకాడని కసితో పనిచేసేలా ఆయన వ్యవహరిస్తున్నారు.
నిరంతరం 85 శాతం హిందువులను విస్మరించి ఇస్లాం, క్రైస్తవ మతాల కొమ్ముకాయడం సెక్యులర్ పార్టీలని చెప్పుకునే కాంగ్రెస్, కమ్యూనిస్టులతోపాటు చంద్రబాబు లాంటి వారు ఆధిపత్యం వహిస్తున్న ప్రాంతీయ పార్టీల రాజకీయ క్రీడలు దేశాన్ని నిర్వీర్యం చేస్తున్నాయి. ప్రజల సంక్షేమం పేరుతో వారు అమలుపరుస్తున్న షాదీ ముబారక్, చర్చిల నిర్మాణాలకు భూములు, మసీదులకు మరమ్మతులు, ముస్లిం ముల్లాల వేతనాలకు కోట్లు కేటాయించడం సెక్యులర్ పార్టీల దమననీతి. ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి ముసుగులో కూలగొట్టిన హిందూ దేవాలయాలను పునఃనిర్మాణం చేస్తామని చేసిన హామీలు గాలిలో కలిసిపోయాయి. ఇది హిందూ వ్యతిరేక ప్రవృత్తి కాదా? అని సామాన్యప్రజల ప్రశ్న.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న భూకబ్జాలు, చిట్‌ఫండ్ కంపెనీలు, డొల్ల కంపెనీలు, కాంట్రాక్టుల పేరుతో కమీషన్‌ల దోపిడి, ఇసుక మాఫియాలతో సామాన్య ప్రజల నడ్డి విరగగొట్టడం జరుగుతున్నది. ఇది చాలాదన్నట్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని హస్తగతం చేసుకొనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ జత కట్టడం తెలుగు ప్రజలను విస్మయానికి గురిచేసింది. సిద్ధాంతం లేని కుటుంబ పాలనను కొనసాగించాలనే దుష్టరాజకీయ వేత్తలు ప్రజలను అమాయకులుగా భావిస్తున్నారు. ఇలాంటి పార్టీలకు, అధినాయకులకు ఓటు అనే ప్రజాస్వామ్య ఆయుధంతో శాంతియుతంగా తెలుగుప్రజలు రెండు రాష్ట్రాలలో మట్టికరిపించడం ఖాయం. 1983, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లినట్లుగానే ఇకముందు తెలుగుదేశం పార్టీకి కూడా అదే గతి పడుతుందనేది బుద్ధిజీవుల హెచ్చరిక. కుల, మతాలకు అతీతంగా ‘సబ్ కా సాత్ సబ్‌కా వికాస్’ చేసే పార్టీల కోసం దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారు. దేశ ప్రజలు విజ్ఞతతో ఓటును ఉపయోగిస్తారని మేధావుల అంచానా.