సబ్ ఫీచర్

మార్గదర్శి ప్రిన్సిపాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్కూల్ ప్రిన్సిపాల్ ప్రతిక్షణం సహచర అధ్యాపకులకు నీడగా ఉండాలి. ‘బీ విత్ ద స్ట్ఫా’ అంటే వారికి ప్రతి క్షణం అండగా ఉండాలని అర్థం. ప్రభుత్వం వైపునుంచి ఉపాధ్యాయులకు ప్రతి ఘడియలో వృత్తిపరమైన సలహాలివ్వటానికి ఏర్పడిన అధికారి ప్రిన్సిపాల్. తరగతి గదిలోనైనా ప్రిపరేషన్‌లోనైనా ఎన్నో వృత్తిపరమైన సమస్యలు రావొచ్చును. ప్రిన్సిపాల్ అయినవారు సహచర అధ్యాపకులకు ఆచరణ యోగ్యమైన సలహాలు ఇస్తూ ఉండాలి. ప్రిన్సిపాల్ అంటే నడిచే గ్రంథాలయం. పాఠం చెప్పటానికి ఏ పుస్తకాలు చదివితే తగిన సమాచారం దొరుకుతుందో ప్రిన్సిపాల్ మార్గదర్శకుడిలా ఉండాలి. తరగతి గదిలో టీచర్లు ఊహించని ప్రశ్నలు పిల్లలు అడగవచ్చు. అట్లాంటి సమయంలో ఉపాధ్యాయులు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా వారికి ప్రిన్సిపాల్ అందుబాటులో ఉండాలి. కొంతమంది ఉపాధ్యాయులు కొత్తప్రయోగాలకు శ్రీకారం చుట్టేందుకు ప్రయత్నిస్తే అలాంటి వారిని ప్రోత్సహించాలి. ఉపాధ్యాయులకు వృత్తిపరమైన సలహాలు ఇచ్చేందుకు ఓపికతో ఉండాలి. తనతోటి సహచరులు చేసిన తప్పులకు బాధ్యత వహించాలి. సమర్థులైన ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులలో సహకార లక్షణాన్ని కలిగించాలి. పిల్లల్లో కాల్పనిక శక్తిని పెంచటానికై అవసరమైన నిధులు సమకూర్చవలసి ఉంటుంది. పరిశోధనాతత్వాన్ని తనతోటి ఉపాధ్యాయులలో రగిలిస్తే తరగతి గది సమర్థవంతంగా నడిచే అవకాశం ఉంటుంది. వారి శ్రమే స్కూల్‌కు కీర్తి. స్కూలు భవిష్యత్తు అనేది- న్సిపాల్‌కు, టీచర్లకు ఉండే సంబంధాలపైనే ఆధారపడి ఉంటుంది.
మార్నింగ్ అసెంబ్లీ...
ప్రిన్సిపాల్ ప్రతిరోజూ ‘అసెంబ్లీ’ (సమావేశానికి)కి వెళితే విద్యారంగానికి ఒక జ్యోతిలా ప్రకాశిస్తాడు. ప్రిన్సిపాల్ ఒక దార్శనికుడు. తన సహచరులలో, విద్యార్థులలో తరగతి అనే వేదిక ద్వారా ఆసక్తిని కలిగించి వారిని మిషనరీగా మార్చుతాడు. అప్పుడు విజన్ అన్నది మిషనరీగా మారుతుంది. తల్లిదండ్రుల ఆశలను ఆచరణలోకి తీసుకరావటానికై ప్రభుత్వంతో ఏర్పాటు చేయబడిన మిషనరీలు ఉపాధ్యాయులు. విద్యార్థులకు మిషనరీ అయిన ఉపాధ్యాయులు ముందుకు నడిపించే దారి చూపుతారు. చదువుకోని తల్లిదండ్రుల పిల్లలకు స్కూల్లో ఉపాధ్యాయులే మార్గదర్శకులు సాధనాకర్తలు. ప్రిన్సిపాల్ స్కూల్ అసెంబ్లీలో ప్రతిరోజు పిల్లల కాంక్షలకు అద్దంపడతారు. ఆ ఉపాధ్యాయులకు బోధనలో కొత్త ఆవిష్కరణలు చేయటానికై ప్రిన్సిపాల్ పురిగొల్పుతాడు. విద్యార్థులలో కొత్త సంకల్పబలాన్ని నింపుతాడు. సమావేశం కేవలం జాతీయ గీతాన్ని పునశ్చరణ చేయటమేగాకుండా విద్యార్థులు కొత్త ఛాలెంజ్‌లను ఎదుర్కొనేలా సన్నద్ధం చేస్తాడు. ఇదే ప్రిన్సిపాల్ కర్తవ్యం. ప్రతిరోజూ తన విజన్‌ను పునరుద్ఘాటిస్తూ అన్ని తరగతులకు కొత్త బాటలు ఏర్పరిచే ప్రణాళికలు ‘మార్నింగ్ అసెంబ్లీ’లో ప్రవేశపెడతారు. ప్రిన్సిపాల్ స్కూలుకంతా ఒక వ్యక్తిగా కనపడతాడు. అంతా ఒకే వ్యక్తిగా మారి కదం తొక్కే సైనికులుగా తయారు కావడమే ప్రిన్సిపాల్ లక్ష్యం. ప్రిన్సిపాల్ తన విజన్ అమలు జరపటమే కర్తవ్యంగా భావిస్తాడు.
బడి బయటి బాధ్యతలు...
ప్రిన్సిపాల్ తన స్కూలు, కాలేజీ ఆవరణే కాదు. తమ విద్యార్థులు వారి చదువును పూర్తి చేసిన తరువాత ఏ విద్యాలయాలకు పోతారో వాటితో ప్రిన్సిపాల్ సంబంధం పెట్టుకుంటాడు. మా సంస్థ ‘రామయ్య ఐఐటి కోచింగ్ సెంటర్’లో శిక్షణ పొంది, వివిధ ఐఐటిల్లో చదువుకునేందుకు ఎందరో విద్యార్థులు వెళ్లేవారు. నేను కూడా ఏడు ఐఐటీలకు వెళ్లి అక్కడ అధ్యాపక వర్గంతో కలిసి, చదువులో మా పిల్లల స్థితిగతులు, వారి అభివృద్ధి ఎలా ఉందని కనుక్కునేందుకు ప్రయత్నించాను. దాంతో మా సంస్థలో చదువును పెంచుకునేందుకు ఎంతోమందికి ఎన్నో అవకాశాలు కలిగాయి. అదే మాదిరిగా గ్రామాల నుంచి వచ్చే పిల్లలు ఎన్నో కాలేజీలకు వెళతారు. గ్రామాల్లో పనిచేస్తున్న హెడ్ మాస్టర్లు పట్టణాల్లోని కాలేజీలకు వెళ్లి, తమ పిల్లలు ఎలా చదువుతున్నారని ఆరా తీస్తారు. ప్రిన్సిపాళ్ల సలహాలను దృష్టిలో పెట్టుకుని తమ స్కూల్ బోధనలో అధ్యాపక వర్గానికి కొన్ని సూచనలు చేస్తారు. ఇలా చేయడం వల్ల స్కూలులో విద్యాప్రమాణాలు పెరుగుతాయి. నృపతుంగ కాలేజీ ప్రిన్సిపల్ కృపాచారి విశ్వవిద్యాలయానికి సైతం వెళ్లి అన్ని శాఖల దగ్గర ప్రొఫెసర్లు, అధ్యాపకవర్గాన్ని కలిసి తమ పాఠశాలల్లో ఏ మార్పులు చేసినట్లయితే మెరుగైన విద్యార్థులు తయారవుతారో కనుక్కునేవారు. స్కూలు వెలుపల జరిగే కార్యక్రమాల ప్రభావం చదువుమీద ఉంటుంది. అదే మాదిరిగా రాత్రిపూట పిల్లల తల్లిదండ్రులను కలిసి, విద్యార్థులు తల్లిదండ్రులతో స్కూలు కార్యక్రమాలపై పిల్లలు ఏమి చెబుతున్నారో కనుక్కునేవారు. ఇలా చేయడం గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ప్రిన్సిపాళ్లు, హెడ్ మాస్టర్లకు ఎంతో ఉపయోగపడుతుంది.
గ్రామీణ ప్రాంతాలలో కొందరి ఇళ్ళల్లో చదువుకునే అవకాశం ఉండదు. అట్లాంటి పిల్లలకు స్కూల్లోనే తగిన వసతి కలిగించవచ్చు. ప్రతిరోజూ ఉపాధ్యాయుడు పిల్లలు చదువుకునేటప్పుడు పర్యవేక్షణ చేస్తే సరిపోతుంది. అలాంటి ప్రయత్నం తెలంగాణ స్కూళ్లల్లో కొందరు ప్రిన్సిపాళ్లు చేస్తున్నారు. స్కూలు వేళల తర్వాత కూడా ఉపాధ్యాయులు పిల్లలతో సంబంధం పెట్టుకుంటే పాఠశాలపై తల్లిదండ్రులకు కూడా అభిమానం పెరుగుతుంది. ప్రిన్సిపాల్ కొన్ని విధులను మాత్రమే చేయాలనే నిబంధనలు లేవు. స్కూలు వెలుపల కూడా ప్రిన్సిపాల్ చేయవలసిన పనులుంటాయి. సమాజానికి, విద్యాలయాలకు మధ్యనున్న సంధానకర్త ప్రిన్సిపాల్. ఇలా పనిచేసిన వారే సమర్థులైన ప్రిన్సిపాళ్లు. ఇలాంటి వాతావరణం మొగిలిచర్ల స్కూలులో చూశాను.

-చుక్కా రామయ్య