సబ్ ఫీచర్

అంతా ‘ప్రైవేటు’మయమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో న్యాయవ్యవస్థ (కాలేజీ విద్య మినహా) ఒక్క టి మాత్రమే ప్రైవేటీకరణ దిశగా ఆచరణకి నోచుకోవడం జరగడం లేదు. న్యాయవాదులు న్యాయమూర్తులు ఈ అత్యవసర విషయాన్ని ఆలోచించక పోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రభుత్వాలకి అన్నిరంగాల్లోనూ పని సక్రమంగా వేగవంతంగా చేయడమన్నది తమతమ రాజకీయాల దృష్ట్యా చేతగానిదని తేలిపోయింది. అన్ని రంగాలని శాఖలని ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వాలు మళ్లిస్తున్నప్పుడు న్యాయవ్యవస్థనూ ప్రైవేటీకరించడంలో తప్పేంటి? న్యాయవ్యవస్థని ప్రైవేటీకరించకుండా అల సత్వం వహించడం వల్ల దేశం ఆర్థిక సామాజిక తదితర అన్నిరంగాల్లోనూ వెయ్యేళ్ళు వెనుకబడే ప్రమాదముంది. అన్ని విషయాల్లోనూ న్యాయస్థానాల్ని ‘చివరగా’ ఆశ్రయిస్తున్నందున దేశం భారీగా నష్టపోవడం జరుగుతోంది.
దేశంలోని ప్రభుత్వాలు ప్రతి రంగాన్నీ ప్రైవేటీకరణ దిశగా మళ్ళించడం జరిగిపోయిందన్న విషయం మనకందరికీ తెలుస్తూనే వుంది. ప్రైవేటీకరణ దిశలో ప్రభుత్వం నడుస్తున్నదనే వాస్తవాన్ని ప్రతి పార్టీ, పార్టీలోని రాజకీయ నాయకులు బహిరంగంగానే వెల్లడిస్తున్నారు. ప్రభుత్వరంగంలోని తంతి తపాలాశాఖకి పోటీగా ప్రైవేటు కొరియర్ సర్వీసులు దేశమంతానేగాక విదేశాలకీ విస్తరించడం జరిగింది. ప్రభుత్వరంగంలోని తంతి తపాలాశాఖకన్నా ప్రైవేటురంగ కొరియర్ సంస్థలు సత్వర చర్యలతో అతివేగంగా ఉత్తరాలను, పార్సిల్స్‌ను చేరవేస్తూ దాదాపు ఎనభై శాతం ఆదాయాన్ని సంపాదిస్తున్నాయని తెలుస్తూనే వుంది. ప్రభుత్వరంగంలో ప్రయాణికులను చేరవేసే రవాణాసంస్థ వుండగా ప్రైవేటు బస్సులు నడిపించాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి జిల్లా మునిసిపాలిటీ కేంద్రాలనుంచి ప్రతిరోజూ రాష్ట్ర, దేశ స్థాయలో బస్సులు నడుస్తున్నాయ. దీనివల్ల కోట్ల రూపాయలు ప్రైవేటు వ్యక్తులకి, పన్నుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం అందుతోందన్న విషయమూ అవాస్తవం కాదు. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలను ప్రైవేటు రంగంలో దేశ వ్యాప్తంగా నడపడానికి అనుమతినివ్వడం అందరికీ తెలిసిన విషయమే. కమ్యూనికేషన్ రంగాన్ని ప్రైవేటు సంస్థలు నిర్వహించడంవలన వచ్చే ఆదాయం అనూహ్యంగా వుంటుందన్న విషయంలో సందేహం లేదు. దేశ విదేశాలకువెళ్ళే మన ఇంజనీర్లు స్వదేశంలోనే సేవలందించి దేశాన్ని ఆర్థికంగా పరిపుష్టం చేయడం ఆచరణ సాధ్యమవుతోంది.
ప్రజల ఆరోగ్య విషయంలో ప్రైవేటు వైద్యశాలలో చేసిన చేస్తున్న చికిత్స నిమిత్తం ప్రభుత్వమే పైకం చెల్లించడం జరుగుతోంది. చివరకు రైల్వేని కూడా ప్రైవేటీకరం దిశగా మళ్ళిస్తుండటంతో ప్రభుత్వరంగంలోకంటే ప్రైవేటు రంగంలో ఆదాయం లభిస్తున్నదన్నది సత్యం. దేశంలో విద్య వైద్య రవాణా ఒక్కటేమిటి సర్వం సహా ప్రభుత్వమే ప్రైవేటుపరం చేస్తోందన్నది అక్షరాలా నిజం. ప్రైవేటీకరణ విషయంలో మనం ముఖ్యంగా గమనించాల్సిన విష యం, సత్యం మరొకటి వుంది. దేశంలో పార్టీలపరంగా వ్యక్తులు రాజకీయాల్లోకి రావడమన్నది ప్రైవేటీకరణ విధానంలో మూల అంశంగా మనం గమనించాల్సిందే! దేశంలో ఎవరైనా పార్టీ పెట్టొచ్చు అంటే, పార్టీ అన్నది ప్రైవేటీకరణ అయినట్టేనన్నది నిర్వివాదాంశం. పార్లమెంటు, అసెంబ్లీ తదితరాలన్నీ వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేసుకొన్న పార్టీల ద్వారా ప్రభుత్వాన్ని నడుపుతున్నాయన్న కఠోర సత్యాన్ని మనం గమనించడం లేదనిపిస్తోంది. కాంగ్రెసు, భారతీయ జనతా, తెలుగుదేశం, అన్నాడి.యం.కె., తృణమూల్ కాంగ్రెస్, బహుజన పార్టీ, కమ్యూనిస్టు ఒక్కటేమిటి ప్రైవేటు వ్యక్తులు నిర్మించుకున్న ఈ పార్టీలు ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నాయన్నది నగ్నసత్యం. ప్రజల అవసరాలకోసం ప్రజాసంక్షేమం కోసం నిర్మించామన్న ప్రతి పార్టీ నేడు వ్యక్తిగత ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలు అవసరాల నిమిత్తం ప్రభుత్వ ఖజానా నుంచే అవసరాన్ని మించి ఖర్చుచేస్తున్నాయ. ఇక ప్రజలచేత ఎన్నికైన ప్రజాప్రతినిధులు తమ జీత భత్యాలను, పింఛన్లను పార్లమెంటు, అసెంబ్లీల్లో తీర్మా నాలను ఆమోదించుకొని యదేచ్ఛగా పెంచుకుం టున్నారు. ఇందులో ప్రజల ప్రమేయం ఏమీ ఉండదు.
న్యాయ వ్యవస్థ ప్రైవేటీకరణ అనే విషయం ప్రజలకే గాక న్యాయవాదులకీ న్యాయమూర్తికీ మింగుడు పడని ఆశ్చర్యకరమైన విషయంగా అనిపిస్తుందనడంలో సందే హం లేదు. ఆలోచనకి అందని విశేషణగా నిలుస్తోందనడానికి సంశయమక్కర్లేదు. కానీ, దేశంలో వైద్య, విద్య రవాణా, కమ్యూనికేషన్ రంగాలు ఒక్కటేమిటి అన్నీ ప్రైవేటు మయమే. చివరకు మనల్ని పాలించే ప్రభుత్వా లను ఏర్పాటు చేసిన పార్టీలు ప్రైవేటు వ్యక్తులవే. అధికా రంలోకి వచ్చినప్పుడు ప్రభుత్వంగా పరిగణించ బడుతున్నాయ. అందువల్ల మన న్యాయ వ్యవస్థను కూడా ప్రైవేటీకరించే దిశగా ఆలోచన ఎందుకు చేయకూడదు?
దేశంలో ప్రస్తుతం సుప్రీంకోర్టు నుంచి, జిల్లా కోర్టువరకు కొన్ని కోట్ల కేసులు ఇరవై సంవత్సరాల పైబడి పెండింగ్ దశలో వున్నాయన్న విషయాన్ని కాదనలేం. కొన్ని కేసులు విచారణకు రాని దశలో అసలు వ్యక్తులు వున్నారో లేరో తెలియని వైనం మనకు కనిపిస్తుంది. రాజకీయ పార్టీలనుంచి వ్యక్తిగత విషయాలవరకు సర్వంసహా న్యాయస్థానమే తీర్పు ఇవ్వాల్సిన దశలో ప్రస్తుతమున్న కోర్టులు ఎట్టిపరిస్థితుల్లోనూ సరిపోవని, మోయలేని మోపలేని భారమవుతోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రధాని ఎదుట కంటతడి పెట్టడం మనకు తెలిసిందే.
మరి ఈ న్యాయవ్యస్థలో కుప్పలు తెప్పలుగా పెరిగిపో తున్న కేసుల పరిష్కారానికి తగిన చర్యలు ఎందుకు తీసుకోరో అర్థంకాని అంశం. కేసుల సత్వర పరిష్కారానికి న్యాయ వ్యవస్థలో నెలకొన్న ఖాళీలను భర్తీ చేస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కానీ ఆ దిశగా అడుగులు ముందుకు పడకపోవడమే అసలైన సమస్య. ఇదే న్యాయవ్యవస్థ ప్రైవేటురంగంలో ఉంటే ఇంతటి తాత్సారం జరిగేదా? ఈపాటికి పెండింగ్ కేసులన్నీ ఎప్పుడో పరిష్కారానికి నోచుకొని ఉండేవి.
దేశంలో ప్రస్తుతం విచారణ నిమిత్తమున్న కేసులన్నీ ప్రస్తుత న్యాయస్థానాలు పరిశీలించడానికి, న్యాయాధీశులు పరిష్కరించడానికి పట్టేకాలం బహుశా యాభై సంవత్సరాలు పైమాటేనన్నది వాస్తవం. మరి న్యాయ వ్యస్థను కూడా ప్రైవేటీకరించవచ్చు కదా!

- యక్కలూరి శ్రీరాములు