సబ్ ఫీచర్

ఆదరణ కరవైన ‘ఒగ్గుకథ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ రాష్ట్రంలో ‘ఒగ్గుకథ’కు ఒక విశిష్ఠమైన స్థానం ఉంది. కాని నేడు ఆదరణ కరవైన ఈ ఒగ్గుకథ కాలగర్భంలో కలిసిపోయే దశకు చేరుకుంది. కొంతమంది ఈ కథలను నేర్చుకొని ఇప్పటికీ అక్కడక్కడ ప్రదర్శనలు ఇస్తూనే ఉన్నారు. నేటి ఆధునిక యువత ‘సెల్’ ప్రపంచంలో మునిగిపోతోంది. గతంలో లాగా ఒగ్గుకథలు, బుర్రకథలు చిరుతల రామాయణం నేడు చూచేవారు కరవయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ‘ఒగ్గుకథ’లో పేరుగాంచిన తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలోని హన్మాజీపేటకు చెందిన ‘మిద్దెరాములు’ ప్రసిద్ధుడు. ఆయన ఎంతోమంది శిష్యులను తయారుచేశాడు. ఒకప్పుడు ‘మిద్దెరాములు’ కథ వినడానికి ప్రజలు ఎడ్లబళ్ళు కట్టుకొని తండోపతండాలుగా వచ్చేవారు. ‘మిద్దెరాములు’ గురించి ‘ఒగ్గుకథ’ గురించి తెలుగు పాఠ్యపుస్తకాల్లో ఒక పాఠ్యాంశంగా చేర్చారు. కాని గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో గతంలో ఉన్న వైభవం ఇప్పుడు లేదు.
పాశ్చాత్య సంస్కృతి వ్యాపించడంతో ప్రస్తుతం ఒగ్గుకథలకు ఆదరణ తగ్గిపోయింది. దీంతో ఉపాధి కరవై ఆర్థిక ఇబ్బందులతో ఒగ్గుకథ కళాకారులు దుర్భర జీవితం గడుపుతున్నారు. కొంతమంది కళాకారులు కళలకు స్వస్తిచెప్పి ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటున్నారు. ఎలాంటి ఉపాధి దొరకని వారు కూలీలుగా మారి జీవనం కొనసాగిస్తున్నారు. ఇటీవలి కాలంలో సినిమాలు, కంప్యూటర్లు, టీవీలు, సెల్‌ఫోన్లు, ఇంటర్నెట్ వ్యవస్థ మరింత విస్తరించడంతో ఒగ్గుకథకు కాలం చెల్లిపోయింది. దీనికితోడు పాశ్చాత్య ధోరణుల నేపథ్యంలో పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉరుకుల పరుగుల జీవితం మొదలైంది. గతంలో పొద్దంతా పనిచేసి వచ్చిన ప్రజలు కాలక్షేపం కోసం కథలు వినేవారు. ఆ కాలంలో నాటకాలు, కథలకు ఎంతో ప్రాధాన్యత ఉండేది. ఇటీవలి కాలంలో సినిమాలు, టీవీలు, కంప్యూటర్లు, ఇంటర్నెట్, సెల్‌ఫోన్ వ్యవస్థ వ్యాప్తి చెందడంతో కథలను వినేవారు కరువయ్యారు. దీనికితోడు వాట్సాప్, ఫేస్‌బుక్‌లు రావడంతో సినిమాలకు కూడా ఆదరణ తగ్గుతోంది.
ప్రస్తుతం సెల్ యుగం నడుస్తోంది. ఆండ్రాయిడ్ ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచం చేతుల్లోనే కనిపిస్తుంది. గతంలో మాదిరిగా థియేటర్‌కు వెళ్ళి, టీవీల ముందు కూర్చొని సినిమాలు చూడాల్సిన అవసరం లేదు. నచ్చిన సినిమా క్షణాల్లో నెట్ ద్వారా కంప్యూటర్ లేదా సెల్‌లో చూసే రోజులు వచ్చేశాయి. ఈ నేపథ్యంలో కాలక్షేపంకోసం కథలు వినేందుకు ఎవరూ ఆసక్తి కనపరచడం లేదు. దశదినకర్మలు, మాసికాల క్రతువు వంటి కార్యక్రమాల సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో కథలు చెప్పించేవారు. ఇప్పుడు వాటి స్థానంలో టీవీలు వచ్చేశాయి. ఇప్పుడు చెప్పించే వారున్నా వినేందుకు ఎవరూ రాకపోవడంతో కథలపై ఆసక్తి లేకుండాపోయింది. దీనితో తరతరాలుగా ఎన్నో ‘వీరగాథలు’ మోసుకువస్తున్న కథకులు నేడు అంతరించిపోతున్నారు. ఒక జాతి వైభవం, దాని పటిష్టమైన సాంస్కృతిక పునాదిపై నిలి చి వెలుగుతుంది. తన సంస్కృతీ నేపథ్యాన్ని కోల్పోయన జాతీ పరాయా కరణకు గురవుతుంది. ఈ పరాయాకరణ మన నేపథ్యాన్ని పూర్తిగా కను మరుగు చేస్తుంది. ఒగ్గుకథతో పాటు వెనకటికాలం నాటి అనేక జానపద కళారూపాలు కొడిగట్టి పోవడానికి ప్రధాన కారణం సాంస్కృతిక ధోర ణుల్లో వేగంగా వస్తున్న మార్పులే కారణం. కొత్తదనంలోని వేగం, ఆకర్షణ, సౌలభ్యం, అనుసంధానశీలత వంటివి ప్రాచీన సంస్కృతిని దెబ్బతీస్తున్నా య. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మన కథలను, కథకులను కాలగర్భంలో కలిసిపోకుండా కాపాడుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవసరమైతే వాటిని వర్తమానానికి అనుగుణంగా మార్పులు చేసి సజీవంగా నిలపాలి.

- గుండు రమణయ్య