సబ్ ఫీచర్

ప్రమాణాలు లేని వృత్తి విద్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు రాష్ట్రాల్లో ఫీజు రియంబర్స్‌మెంట్ స్కీంకోసం ప్రైవేట్ వృత్తి విద్యాకాలేజీలు వౌలిక వసతులు శూన్యమై విజిలెన్స్, తనిఖీలతో బెంబేలెత్తిపోయారు. ఎంబీఏ, ఫార్మసీ, బిఇడీ, ఎంఈడీ, బీపిఈడి, ఎం.్ఫర్మసీ, లా, ఇంజనీరింగ్ పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ కాలేజీల్లో ప్రభుత్వాలు నిర్దేశించిన నిబంధనలు లేవు. భావితరాలకు బోధించే గురువులను తీర్చిదిద్దే వృత్తి విద్యా కళాశాలలు అసౌకర్యాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. అక్కడ వౌలిక వసతులకంటే.. బోధనా సిబ్బందికే అధిక ప్రాధాన్యం.. ఐతే తెలంగాణ రాష్ట్రంలో పని చేస్తున్న సిబ్బంది వివరాలను చూసి తెలంగాణ ప్రభుత్వం నియమించిన తనిఖీ బృందం ఆలోచనలో పడింది. దస్త్రాల్లో ఒకరు ఉంటారు. పని చేసేది ఇంకొకరు. అనుభవం లేకున్నా కాగితాల్లో చూపించారు. ప్రధానాచార్యులకు డాక్టరేట్ ఉండాలనే నిబంధనలను తెలుగు రాష్ట్రాల్లోని ప్రైవేట్ వృత్తివిద్యాసంస్థలు గాలికి వదిలేశాయ. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో బిఈడీ కళాశాలల్లో, అర్హులైన అధ్యాపకులు లేరని తనిఖీ బృందాలు తేల్చి చెప్పాయ. తెలంగాణలోని ఎంబీఏ, ఫార్మసీ కళాశాలల్లో అర్హత, అనుభవం ఉన్న అధ్యాపకులు లేరు. అధ్యాపకుల కొరతవల్ల ఇంజనీరింగ్, ఫార్మసీ విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. తెలంగాణలోని వృత్తి విద్యాకళాశాలల్లో విజిలెన్స్ తనిఖీల్లో ప్రైవేట్ సంస్థల మోసాలు బయటపడటంతో తనిఖీ అధికారులే ఆశ్చర్యం వ్యక్తంచేసినట్లు సమాచారం. నిన్న మొన్న పీజీ చేసిన వారే బినామీ పేర్ల మీద అధ్యాపకులుగా అవతారం ఎత్తుతున్నారు. కోర్సు ఏదైనా నాణ్యమైన విద్య అందించాలి. విద్యాప్రమాణాలు పెంచాలి. ఫీజుల కోసమే పుట్టిన, పెట్టిన కాలేజీలను మూసివేయాలి. ఈ లక్ష్యాలతో తెలంగాణ సర్కారు వృత్తి విద్యాకళాశాలల్లో ఆ తనిఖీలకు శ్రీకారం చుట్టింది. విజయం సాధించింది.
ప్రతి ఏటా వౌలిక వసతులు, భవనాలు, గ్రంథాలయాలు, ప్రయోగశాలలు అంటూ విశ్వవిద్యాలయాలు పట్టు పట్టడంతో వాటిని కష్టంమీద సమకూర్చుకున్నారు. చాలా ఇంజనీరింగ్ కాలేజీల్లో నిబంధనల మేరకు ఉండాల్సిన అధ్యాపకులు లేరు. అనేది విజిలెన్స్ నివేదిక సారం. తమ ఆటలు సాగినన్ని రోజులు సాగించుకున్నారు. సాగని పరిస్థితుల్లో ‘సీట్లు’ కుదించుకున్నారు. పీహెచ్‌డీ అర్హతల అధ్యాపకులు దొరకడం లేదని చాలా యాజమాన్యాలు వాపోయాయి. కొందరు ఎక్కువ జీతాలు వెచ్చించి పీహెచ్‌డీ వారిని నియమించలేక ఎంటెక్ కోర్సులు ఎత్తివేయడానికి నడుం బిగించాయి. ఏటా భారీ లాభాలు వస్తున్న ప్రైవేట్ వృత్తి విద్యాకళాశాలలు అర్హత, అనుభవం ఉన్న వారికి ఎఐసిటిఇ నిబంధనల మేరకు జీతాలు ఇవ్వడం లేదు. ప్రతి నెల జీతాలు ఇవ్వరు. ప్రతి సంవత్సరం జీతం పెంచరు. ప్రతి ఏటా 6 నెలలు జీతాలే ఇస్తారు. మంచి అకాడమిక్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారు ఇరుగు పొరుగు రాష్ట్రాలకు వలస పోతున్నారు. నాలుగేళ్ళ అధ్యాపకుల హాజరు పట్టికలను వేతనాల వివరాలు సమర్పించాలని జెఎన్‌టీయుహెచ్ ఇంజనీరింగ్ కాలేజీలకు ఇటీవల ఆదేశాలు జారీచేసింది. ఇదేం ఆదేశాలు బాబోయ్ అంటూ ఇంజనీరింగ్ కాలేజీలు షాక్ తిన్నాయి. బీఈడీ కాలేజీ ప్రిన్సిపాళ్ళకు డాక్టరేట్ ఉండాలనే నిబంధన వచ్చింది. ఈ నిబంధనలను రెండు తెలుగు రాష్ట్రాల్లోని ‘బీఈడీ’ కాలేజీలు అమలుచేయటం లేదు. విజిలెన్స్ తనిఖీల్లో ఈ విషయం బయటపడిన సదరు కాలేజీల్లోని సీట్లను రద్దు చేయటం లేదు. పీజీ కళాశాలల్లో తెలుగు రాష్ట్రాల్లో విద్యాప్రమాణాలు అడుగంటిపోతున్నాయి. అడ్మిషన్ పొంది పరీక్షల్లో ‘కాపీ’కొట్టి ‘పట్టాలు’ పొందుతుండగా, ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు సర్కారు ఫీజు రియంబర్సుమెంట్ పుణ్యమా అని లక్షాధికారులుగా మారుతున్నారు. డిగ్రీ కాలేజీ యాజమాన్యాలే పీజీ కోర్సులను నిర్వహిస్తున్నాయి. డిగ్రీ కాలేజీల్లోనే సరైన బోధన సిబ్బంది, తగిన వౌలిక సౌకర్యాలు లేవు. విశ్వవిద్యాలయాలు వాటిని పర్యవేక్షించటం లేదు.
ఈ విద్యాసంవత్సరం డిగ్రీలో ఆన్‌లైన్ ప్రవేశాలు సెమిస్టర్ విధానం సిబిసిఎస్ వంటి నూతన పద్ధతులను డిగ్రీ కాలేజీల్లో ప్రవేశపెట్టడం సంతోషం. ఇప్పటికే ఉన్నత విద్యామండలి, విశ్వవిద్యాలయాల తనిఖీలు పూర్తయతే బాగుండేది. కాని కార్యరూపం దాల్చలేదు. ప్రవేశాలు, ఆపై పరీక్ష ఫీజు సెమిస్టర్ పరీక్షలు. ఇక తనిఖీలు ఎప్పుడు? ఎక్కడ? సమయం ఏది? డిగ్రీ కాలేజీ బోధన సిబ్బంది అర్హతలు, అనుభవం మీద ఎన్నో సందేహాలు పేరెంట్స్‌కి కల్గుతున్నాయి. విశ్వవిద్యాలయాల అధికారులు నాణ్యమైన విద్య అందేటట్లు చూడాలి.

- రావుల రాజేశం