సబ్ ఫీచర్

నైపుణ్యంతోనే భారత్ అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దార్శకునిలు మరియు స్ఫూర్తిప్రదాత అయినటువంటి మన మాజీ రాష్టప్రతి డా.ఎ.పి.జె.అబ్దుల్‌కలాం ‘‘మన దేశానికున్న గొప్ప వనరులు మానవ వనరులే’’ అని తరచుగా అంటుండేవారు. జనాభాపరంగా, వాణిజ్యపరంగా, పారిశ్రామికంగా భారతదేశానికి మంచి అనుకూల వాతావర ణం ఏర్పడినా మన యువతకు ఉపాధి అవకాశాలను కల్పించలేక పోతున్నాం. దానికి కారణం ఉపాధి అవకాశాలు లేకపోవ డం కాదు. ప్రభుత్వ అంచనాల ప్రకారం ఇప్పటికిప్పుడు భవన నిర్మాణాలు, వౌలిక సదుపాయాల కల్పన, టెక్స్‌టైల్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటో, ట్రాన్స్‌పోర్టు మరియు లాజిస్టిక్స్, హెల్త్‌కేర్ తదితర రంగాలలో 20 కోట్ల మంది వృత్తి నిపుణుల అవసరం వుంది. అయినా మన యువత ఉపాధిని పొందలేకపోతున్నా రు. ఉపాధి అవకాశాలు ఉన్నా ఉద్యోగాలకు కావాల్సిన నైపు ణ్యం లేకపోవడమే అసలు సమస్య. గోద్రెజ్ సంస్థల ఛైర్మన్ ఆది గోద్రెజ్ తరుచుగా చెబుతుంటారు..‘‘సమస్య ఉపాధి అవకాశాలు లేకపోవడం కాదు, ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యత లేకపోవడ’’మని. ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోలేకపోవడానికి మూల కారణం మన విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలే. అందుకే వృత్తి నైపుణ్యతపై దృష్టి సారించాల్సి ఉంది.
వృత్తి నైపుణ్యత అవసరాలను గుర్తించి గత ప్రభుత్వం వృత్తి నైపుణ్యత పై చర్యలు చేపట్టింది. 2009లో (ఎన్.ఎస్.డి.సి.) నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను ప్రారంభించి దాని ద్వారా నైపుణ్యత లోటును పూరించడానికి ప్రయత్నం చేసింది. కానీ, పదేళ్ళు నిరాటంకంగా పాలన కొనసాగించిన మన్మోహన్ సర్కార్ వృత్తి నైపుణ్య రంగాన్ని, ఈ రంగానికి ఎదురవుతున్న సవాళ్ళను అర్థం చేసుకోవడంలో విఫలం కావడంవల్ల వృత్తి నైపుణ్య శిక్షణల ద్వారా యువతకు ఉపాధిని కల్పించడంలో సర్కార్ విఫలమైంది. మన దేశంలో ప్రతి సంవత్సరం ఒక కోటి ఇరవై లక్షల మంది కొత్తగా ఉపాధి పొందుతుంటే దానిలో ఉపాధి శిక్షణ పొందిన వారు కనీసం నాలుగు శాతం కూడా లేరు. మన దేశంలోని 90 శాతం ఉద్యోగాలకు వృత్తి నైపుణ్యత అవసరం కానీ మన దేశంలోని 90 శాతం కళాశాలలు పాఠ్యపుస్తకాల చదువులకే పరిమితమవుతున్నాయి. ఆర్థికంగా, పారిశ్రామికంగా అగ్ర దేశాలైనటువంటి దక్షిణ కొరియాలో 96 శాతం, జపాన్‌లో 80 శాతం, జర్మనీలో 75 శాతం, యు.కె.లో 70 శాతం ఉద్యోగాల్లో వృత్తి నైపుణ్య శిక్షణ పొందిన వారున్నారు. కానీ, మన దేశంలో కనీసం 10% శాతం కూడా లేకపోవడం మన దీనస్థితికి అద్దం పడుతుంది. మన దేశంలో ప్రతి సంవత్సరం సగటున 35 లక్షల మంది వృత్తి నైపుణ్యత శిక్షణ పొందుతుంటే మన పొరుగు దేశం చైనాలో 9 కోట్ల మంది వృత్తి నైపు ణ్య శిక్షణను పొందుతున్నారు. ‘‘వర్క్ రెడీనెస్’’ అనగా సరైన నైపుణ్యతతో ఉద్యోగానికి సిద్ధంగా ఉండడం. దీనిలో మన దేశం ప్రపంచంలో చివర భాగాన ఉంది.
ఈ పరిస్థితికి కారణం ఉపాధి శిక్షణకు కావాల్సిన వనరులను వెచ్చించకపోవడం కాదు. వృత్తి నైపుణ్యత రంగాన్ని సరిగా అర్థం చేసుకోకపోవడం, మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా ఈ రంగాన్ని తీర్చిదిద్దకపోవడం, ఉపాధి శిక్షణలో భాగస్వా మ్యం పంచుకుంటున్న వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కొరవడడం, వృత్తి నైపుణ్య శిక్షణలో ప్రావీణ్యం కల్గిన సంస్థలను భాగస్వామ్యం చేయలేకపోవడం, శిక్షణలో నాణ్యత లోపించడం వంటివి ప్రధాన కారణాలు. శిక్షణపైనే తప్ప ఉపా ధిపై దృష్టి సారించకపోవడం వల్ల శిక్షణా సంస్థలు డబ్బులు దం డుకోవడం మీదే దృష్టి పెట్టాయి తప్ప ఉపాధి కల్పించలేకపోయాయి. అందువల్లే కిరణ్‌కుమార్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ కిరణాలు కూడా ఒక విఫలయత్నంగా మిగిలిపోయింది.
మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు మాసాలలోనే ఈ వృత్తి నైపుణ్యత శిక్షణలో భాగస్వామ్యం కలిగిన 18 కేంద్ర మంత్రిత్వశాఖలను, 33 సెక్టార్ స్కిల్ కౌన్సిల్స్‌ను, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను సమన్వయ పరచి, వృత్తి నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు సరైన ప్రణాళిక సిద్ధం చేసింది. దాన్ని అమలుపరిచే విధంగా ప్రభుత్వం జూలై 2014లో వృత్తి నైపుణ్యత మరియు ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ ప్రభుత్వ శాఖను ప్రారంభించి, నవంబర్ 2014లో పూర్తిస్థాయి మంత్రిత్వశాఖను ఏర్పాటుచేసింది. సమర్థుడిగా పేరున్న రాజీవ్ ప్రతాప్ రూఢీని ఈ శాఖకు మంత్రిగా నియమించింది. నైపుణ్యత శిక్షణకై గ్రామీణ్ కౌశల్ యోజన ద్వారా రూ.1500 కోట్లు, గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు నెలకొల్పడానికి ముందుకొచ్చే యువతకోసం రూ.100 కోట్లు, ఎంటర్‌ప్రెన్యూర్ షిప్ ఫండ్ క్రింద రూ.1000 కోట్లు, చిన్న వ్యాపారులను ప్రోత్సహించడానికి ముద్రా బ్యాం కు ద్వారా రూ.20,000 కోట్లు, అదే విధంగా వివిధ మంత్రిత్వశాఖల ఆధ్వర్యంలో నడిచే ఉపాధి శిక్షణకు మరికొన్ని వేల కోట్లు కేటాయించి వృత్తి నైపుణ్యం మరియు స్వయం ఉపాధికి పెద్దపీట వేసింది ప్రభుత్వం.
అయితే వృత్తి నైపుణ్యం, ఉపాధి శిక్షణా రంగం ఈరోజు అనేక సవాళ్ళను, సమస్యలను ఎదుర్కొంటున్నదనడంలో ఎం తమాత్రం సందేహం లేదు. అందులో ముఖ్యమైనది శిక్షణ కోరుకునే వారి, శిక్షణ అవసరమున్న వారి వివరాల జాబితా లేకపోవడం. శిక్షణ ఇవ్వడానికి అనేక సంస్థలు ముందుకొస్తున్నా శిక్షణ అవసరమున్న వారి వివరాలు లేక సంస్థలు సతమతమవుతున్నాయి. ప్రభుత్వం గ్రామాల వారిగా శిక్షణ అవసరమయ్యే వారి మరియు శిక్షణ కోరుకునే వారి వివరాలను సేకరించడం ఎంతో అవసరం. జిల్లా మేజిస్ట్రేట్ ఆధ్వర్యంలో నెలకొకసారైనా సంబంధిత ప్రభుత్వ శాఖలను సమావేశపరిచి సమన్వయ పరిస్తే స్కిల్ ఇండియాకు చాలా మేలు చేకూరుతుందని ఇటీవల వృత్తినైపుణ్య శిక్షణపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన సదస్సుకు వరంగల్ విచ్చేసిన, ఐక్యరాజ్యసమితి వృత్తి నైపుణ్యత శాఖ సలహా దారు మీరా శెనాయ్ లాంటి వారు స్పష్టం చేస్తున్నారు. మార్కెట్ అవసరాలను సరిగా అధ్యయనం చేయక ఎప్పటికప్పుడు శిక్షణల్లో మార్పులు చేయకపోవడంవల్ల కూడా ఉపాధి కల్పనలో మనం సఫలం కావడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని శిక్షణా సంస్థలను ఉత్పత్తి, సేవా రంగ సంస్థలతో అనుసంధానించడం లో ప్రభుత్వం మరింత బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఉపాధి శిక్షణను కోరుకునే పేద, దిగువ మధ్యతరగతి కు టుంబాల్లోని యువకులు శిక్షణా కాలంలో వారి కూలీని కోల్పోవడం వలన వారి ఖర్చులకు అనేక ఇబ్బందులు పడుతుంటారు. వారి నివాసాల నుండి శిక్షణ కేంద్రాలకు వెళ్ళేందుకు రవాణా చార్జీలకు కావాల్సిన డబ్బులు లేక కూడా అనేక మంది శిక్షణను పొందలేక పోతున్నారు. ప్రభుత్వం, శిక్షణ పొందే ప్రతి వ్యక్తిపై సుమారుగా 8వేల నుండి 15వేల వరకు ఖర్చు చేస్తున్నది. దీనికి తోడుగా ఇంకో రెండు వేల రూపాయలు శిక్షణ పొందే వ్యక్తి స్ట్ఫైండ్ రూపంగా ఇస్తే మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొంతమంది యువకులు మాత్రం ఉపాధి శిక్షణ తర్వాత లభిం చే ఉద్యోగం ద్వారా వచ్చే 7వేల రూపాయల జీత భత్యాలు తమకు సరిపోవనే ఉద్దేశ్యంతో శిక్షణకు అంతగా ఆసక్తి చూప డం లేదు. అయితే తగిన అనుభవం సంపాదించి, నైపుణ్యాన్ని వృద్ధి చేసుకున్న తర్వాత భవిష్యత్తులో మంచి కెరీర్ లభిస్తుందన్న నమ్మకం, అవగాహన కల్పించాల్సి ఉంది. ఆవిధంగా తమ భవిష్యత్తుపై వారికి నమ్మకం ఏర్పడితే ఈ శిక్షణలో చేరేవారి సంఖ్య గణనీయంగా పెరగక మానదు. పెరుగుతున్న ఖర్చుల కు అనుగుణంగా వీరి ఆదాయం ఉంటుందన్న హామీ లభిం చడం ఇక్కడ కీలకం. సరైన ఆదాయాన్ని, భవిష్యత్తును ఇవ్వని శిక్షణవల్ల ప్రయోజనమేంటని, వారు అపోహపడే అవకాశాలే ఎక్కువ. అందువల్ల జీవితంలో క్రమాభివృద్ధి సాధనకు నైపుణ్యం ముఖ్యమనేదానిపై యువతకు అవగాహన కల్పిం చాలి.

- ఏనుగుల రాకేష్‌రెడ్డి సెల్: 9000522400