సబ్ ఫీచర్

ప్రగతి సాధించినా తప్పని వివక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెహ్రూ అన్నట్టు 1947 ఆగస్టు 15న రాత్రి ప్రపంచమంతా నిద్రపోతుండగా భారతదేశం స్వాతంత్రంతో మేల్కొ నింది. స్వాతంత్య్రంతోపాటే భారతీయ మహిళ కూడా మేల్కొన్నదనే చెప్పాలి. స్వాతంత్య్రానికి ముందు కళాశాల స్థాయిలో వున్న విద్యార్థులను వేళ్లపై లెక్కించే స్థాయలో ఉండేది. ఉన్నత కుటుంబాలలోని స్ర్తిలు తప్ప సాధారణ కుటుంబాలలోని స్ర్తిలకు విద్యావకాశాలు, వసతులు సౌకర్యాలు అందని ద్రాక్షపండ్లే. ఇక విదేశాలకు చదువునిమిత్తం వెళ్లే మహిళల సంఖ్య పూజ్యమనే చెప్పాలి. నాటి ఇండో ఇరానియనుల వలస, హుణుల శకుల దండయాత్రలు, ముసల్మానుల దాడులు, ముసల్మానుల రాజ్యస్థాపన, పాశ్చాత్యదేశ ప్రవేశం, స్వాతంత్య్ర పోరాటం ఇవన్నీ కూడా హిందూ సమాజంపై తీవ్ర ప్రభావం చూపాయి. ముఖ్యంగా స్ర్తి విద్య, హోదాలో అనేకానేక మార్పుల్ని కలగచేసాయి. బౌద్ధ, జైన మతాలు కూడా కొంతలో కొంత హిందూ సమాజాన్ని మలిచాయి.
భరతమాత బంధ విముక్తి కోసం పాశ్చాత్యుల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్య్ర సముపార్జన కోసం గాంధీజీ స్పూర్తితో ఎంతోమంది భారతీయ మహిళలు ప్రాణాలను పణంగా పెట్టి పోరాటం చేసారు. ఇల్లే స్వర్గమని భావించిన మహిళలు గడప దాటి బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టారు. శాంతి, సత్యం, అహింస, ఆత్మనిగ్రహాలే రక్షణ కవచంగా కారాగారాల్లో మగ్గారు. చైతన్యంతో స్వాతంత్య్ర సముపార్జనలో తమవంతు పాత్రను పోషించి బ్రిటిష్ నియంత పాలకులను దేశంనుంచి తరిమికొట్టారు. అదే స్పూర్తితో తమదైన పద్ధతిలో అన్ని రంగాల్లో ముందుకు పోవడానికి ప్రయత్నాలు కొనసాగించారు. విద్యారంగంలో కూడా వినూత్న పద్ధతిలో ప్రగతిని సాధించారు. దానికి గాంధీజీ, నెహ్రూ, రవీంద్రనాధ్ ఠాగూరు, రాజారాంమోహనరాయ్, ఈశ్వర చంద్ర విద్యాసాగర్, గురజాడ అప్పారావు, రఘుపతి వెంకటరత్నం నాయుడు, కందుకూరి వీరేశలింగం పంతులు మొదలైన విద్యావేత్తలు, సంఘ సేవకుల, సంఘ సంస్కర్తల ఊతమెంతగానో తోడ్పడింది. తెలంగాణలో స్ర్తివిద్య, బాలికల విద్యకోసం నిరంతరం శ్రమించిన విద్యాశ్రామికుడు మాడపాటి హనుమంతరావు చరిత్ర ప్రసిద్ధులు. ఆనాటి బుల్లి పంతులమ్మ దుర్గాబాయి స్ర్తివిద్య, బాలికల విద్య, వృత్తి విద్యావ్యాప్తికోసం చేసిన సేవలు చిరస్మరణీయం. సాంఘిక సేవానురక్తులు, దేశభక్తులు, చైతన్య మూర్తులైన ఎందరో ప్రతిభాన్వితుల కృషి ఫలితంగా బాలారిష్టాలను ఎన్నింటినో దాటుకుని సంధియుగంలో సతమతమైన స్ర్తిమూర్తి నేడు స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో అన్ని రంగాల్లో ముఖ్యంగా విద్యారంగంలో పురోగతిని సాధించడం ముదావహం. స్వాతంత్య్రం తరువాత ప్రత్యేక మహిళా కళాశాలలు ఏర్పడడం, వివిధరంగాల్లో విద్యార్థినుల ప్రవేశం, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, విద్యావైజ్ఞానిక సంస్థల్లో రానురాను అత్యధిక మహిళా విద్యార్థులుపోటీపడి స్థానం సంపాదించడం చివరకు నేడు నిర్వహిస్తున్న ఎమ్‌సెట్‌లో బాలికలు ప్రథమ ర్యాంకులను సంపాదించడం వారి ఉత్తమ ప్రగతికి నిదర్శనం.
స్వాతంత్య్రం వచ్చిన తరువాత స్ర్తి హోదాను పెంపొందించడానికి విద్య ఒక ముఖ్య సాధనమని గుర్తించడమైంది. లింగ వివక్ష లేని విద్యాసముపార్జన, బాలికల వివాహ వయసును పెంచడం మొదలైన చర్యలవల్ల స్ర్తివిద్య బహుముఖంగా వ్యాప్తి చెందింది. జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అక్షరాస్యుల సంఖ్య పురుషులకన్నా తక్కువ స్థాయిలో వున్నా స్ర్తి విద్యా ప్రగతి మాత్రం గణనీయంగా పెరిగిందని చెప్పవచ్చు. అయతే తెలుగు రాష్ట్రాల్లో మహిళలల్లోనే నిరక్షరాస్యులు అధికంగా ఉన్నట్టు ప్రభుత్వ గణాంకాలు తెలుపుతున్నాయ. అదే పట్టణ ప్రాంత మహిళలు విద్యతో పాటు అన్ని రంగాల్లో ముందంజలో ఉండగా, గ్రామీణ ప్రాంత మహిళలు మరింత చైతన్యం రావాల్సి ఉంది.
స్వాతంత్య్రానికి పూర్వం మహిళా కళాశాలలు, బహుతక్కువగా వుండేవి. 1857లో కలకత్తాలో రెండు, 1897లో త్రివేండ్రంలో ఒకటి వుండగా 1970 సంవత్సరంలో 543 మహిళా కళాశాలలు వుండేవి. 1990నాటికి మరో 83 వెలిసాయి. అయితే మొత్తం కాలేజీలు 6300లో ఇది చాలా తక్కువనే చెప్పాలి. అయినా మొత్తం కళాశాలల్లో చేరిన మొత్తం విద్యార్థినుల సంఖ్య గణనీయంగా పెరగడం మహిళా ప్రగతికి చిహ్నం. స్వాతంత్య్రం రాకముందు స్ర్తికి విద్య అవసరమా, అనవసరమా అనే చర్చలు జరుగుతుండేవి. ప్రస్తుతం స్ర్తికి సమాన విద్యావకాశాలు, సమాన హక్కులు కావాలనే నినాదం ఎల్లెడలా వినిపిస్తుంటే పార్లమెంటులో 33 శాతం రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టబడింది. అంగట్లో అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు దానిపై చర్చ ప్రారంభించకుండానే అభ్యంతరాలు లేవనెత్తుతున్నారు. మహిళా స్వేచ్ఛగురించి మాట్లాటే రాజకీయ నేతలు ఈ బిల్లుకు తమ మద్దతు తెలపాలి. నిజానికి జనాభాలో సగం మంది మహిళలే కాబట్టి వారికి అన్ని రంగాల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి.
స్వాతంత్య్రానంతరం ప్రాథమిక దశనుంచే బాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అమలు చేస్తున్నారు. వెనుకబడిన వర్గాల వారికి, ఎస్‌టి జాతులు, తెగల బాలికలకు ప్రోత్సాహకాలిచ్చి ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ, మధ్యాహ్న భోజన పథకం మొదలైన వాటిని నిర్వహిస్తున్నారు. నేడు కళాశాల స్థాయిలో కూడా మునుపెన్నడూ లేనంతమంది విద్యార్థినులు మహిళా కళాశాలల్లోనే కాక సహవిద్య కళాశాలల్లో మగపిల్లలతో సమానంగా ప్రవేశిస్తూ ఉన్నత ఫలితాలను సాధిస్తున్నారు. విశ్వవిద్యాలయాల్లో మహిళల విద్యలో ఎంతో అభ్యున్నతి కనిపిస్తున్నది. భారతదేశంలో ఏకైక మహిళా విశ్వవిద్యాలయం తిరుపతిలో స్థాపించబడింది. రాష్ట్ర విద్యార్థినులనేకాక దేశంలో అంతర్జాతీయ మహిళా విద్యార్థినుల దృష్టినాకర్షించిన ఆ విశ్వవిద్యాలయంలో అన్నిరకాల కోర్సులు నిర్వహించడం ముదావహం.
న్యాయ విద్యారంగంలో పూర్వం కోర్టులలో నల్ల కోటు ధరించి వాదించగలిగిన వారు పురుషులేనని భ్రమించే పరిస్థితిని అధిగమించి హైకోర్టు జడ్జీలుగా కూడా నేడు మహిళలు వృత్తి ధర్మాన్ని, విలువల్ని పాటిస్తూ నిలుస్తున్నారు. జస్టిస్ రోహిణి ఇందుకు ఉదాహరణ. పదవులను అలంకరించడం, ఏ కోర్టులలో చూసినా మహిళా న్యాయవాదులు కనిపించడం, పురుషులతో పోటీపడి ప్రవేశ అర్హతల్ని సాధించడం, ఉత్తమ ఫలితాలను కైవసం చేసుకోవడం ఇప్పుడు ఎవరికీ ఆశ్చర్యాన్ని కలిగించడంలేదు. అంటే దీన్ని సహజ పరిణామంగా అందరూ ఆమోదిస్తున్నారు. విద్యారంగంలో ఉద్భవించిన అధునాతన ప్రక్రియ కంప్యూటర్ విద్య, కంప్యూటర్ విద్య కళాశాలలకే కాక ఉన్నత ప్రాథమిక విద్యల్లో కూడా ప్రవేశించడం గమనార్హం. అందులో అత్యధికులు బాలికలు, మహిళలు. ప్రైవేటు సంస్థల కంప్యూటర్ కేంద్రంలోను విద్యార్థినులు, ఉపాధ్యాయినులు, అనేక మంది వుండడం మహిళల ప్రగతికి నిదర్శనం.
ఒకనాడు ఉపాధ్యాయినులు తక్కువగా వుండడంవల్ల బాలికల విద్య వెనుకబడింది అనే భావం వుండేది. అది యదార్ధం కూడా. కానీ నేడు ఎంతోమంది మహిళలు అనేక రంగాల్లో శిక్షణ పొంది ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. అంటే ఏ స్థాయిలోనైనా ఏరంగంలోనైనా స్ర్తిలు పురుషులతో పోటీగా సమాన స్థాయిలో నిలుస్తున్నారనే చెప్పవచ్చు. ఊయలు లూపిన చేతులే నేడు అంతరిక్షంలో విమాన చక్రాలను తిప్పుతూ విమాన చోదక విద్యలో అగ్రశ్రేణిలో నిలుస్తున్నాయి. ఇకపోతే రక్షణ రంగంలో రాష్టస్థ్రాయిలో రక్షక భటులుగానే కాక దేశ రక్షణ బాధ్యతలో కూడా ముందుగా నిలవడం మహిళల ఆత్మస్థయిర్యానికి ప్రతీక.
అన్ని రకాల బరువు బాధత్యలు కేవలం పురుషులవేనన్న రోజులు పోయాయ. ఇప్పడు మహిళలలు కూడా సమాన బా ధ్యతలు స్వీకరిస్తున్నారు. ఒకటేమిటి మహిళలు అన్నిరకాలైన విద్యలను సాధించగలరని డెబ్బైసంవత్సరాల ఈ ప్రగతి నిరూపిస్తున్నది. ఇదంతా సానుకూల కోణమైనప్పటికీ, ఇంకా పురుషాహంకార సమాజంలో కడగండ్లను ఎదుర్కొంటున్న మహిళల సంఖ్య తక్కు వేమీ కాదు. వేధింపులకు ధనం, విద్య అడ్డు కావడం లేదు. పేద, ధనిక అనే వ్యత్యాసం ఉండటం లేదు. సమాజంలోని అన్నివర్గాల్లోను మహిళలు ఇంకా వివక్షకు గురవుతున్న సందర్భాలు అనేకం.
తల్లిగా, భార్యగా, చెల్లిగా, కుటుంబం కోసం సర్వస్వం ధారబోసే సహనశీలిగా ఉంటే స్ర్తీలలో అధికసంఖ్యాకులు ఇం కా పరాధీనతతోనే కొట్టుమిట్టాడుతున్నారు. ఆర్థిక స్వాతంత్య్రం లేక, ఇంట్లో తన మాటకు విలువలేకపో వడం వంటి వివక్షకు గురవుతున్నారు. ఎంత తెలివితేటలున్నా, ఎంతటి మేధాసంపత్తి ఉన్నా అవి వెలుగులోకి రాక చీకటిలోనే బతుకువెళ్లదీసే మహి ళలు ఎందరో?

-డాక్టర్ సరోజన బండ (విశ్రాంతాచార్యులు, ప్రభుత్వ ఉన్నతస్థాయి విద్యా అధ్యయన సంస్థ)