సబ్ ఫీచర్

వ్యక్తికన్నా సమూహం ఫ్రధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇరవయ్యవ శతాబ్దంలో తరగతి గది చుట్టుపక్కల వున్న సమాజానికి ప్రతిబింబం. కానీ 21వ శతాబ్దంలో వచ్చిన సాంకేతిక పరిణామాలు తరగతి గది మొత్తం వసుదైక కుటుంబానే్న ప్రతిబింబించే స్థాయికి ఎదిగింది. సమస్త మానవ కోటి, జీవరాశి తరగతి గదికి వచ్చేసింది. తరగతి గది బోధనా పద్ధతులైనా, నేర్చుకునే పద్ధతుల్లో కూడా మార్పురావటం సహజం. తరగతి గదిలో కెమెరాలు, సాంకేతిక పరికరాలను అమర్చటం ఉపాధ్యాయులు పిల్లలపై నిఘాకోసం కాదు, మొత్తం ప్రపంచాన్ని తరగతి గదితో అనుసంధానం చేయటానికి అదొక సాధనం.
ఈనాడు జపాన్‌లో తరగతి గది బోధన ఏ విధంగా జరుగుతున్నది? ఏ విధంగా సమస్యలు సాధిస్తున్నారు? అక్కడి తరగతి గదిని మనం కూ ర్చున్న తరగతి గదితో కనెక్ట్ చేస్తున్నది. ఈనాడు జర్మనీలో పిల్లలు లెక్కలు ఏ విధంగా నేర్చుకుంటున్నారు? అక్కడి తరగతి గదిలో ఉపాధ్యాయుల పాత్ర ఏమిటి? మనకు జర్మనీ తరగతి గది భేదాలు తెలుసుకోవటం కాకుం డా ఒకరితో ఒకరు పరస్పరం మాట్లాడుకుని విస్తరించేందుకు ఈ సాంకేతిక పరిజ్ఞానం ఎంతవరకు ఉపయోగపడుతున్నదీ అర్థం చేసుకోవాలి. దక్షిణ కొరియా పోలెండ్‌కు ఎంత దూరం ఉందో? రాజకీయంగా కూడా ఎంత దూరంగా ఉండేదో గమనించండి. ఈనాడు సాంకేతిక విప్లవాల ఫలితంగా రెండు దేశాలకు చెందిన ఇద్దరు కలిసి ఒకే సమస్యపైన దృష్టి కేంద్రీకరిస్తున్నారు. జీవిత సమస్యలు, సమాజ సమస్యల పరిష్కారానికి కలిసి ఆలోచిస్తున్నారు. చర్చిస్తున్నారు. భవిష్యత్‌కు గీతలు గీస్తున్నారు.
ఈనాడు కనపడని డిజిటల్ క్లాసులొచ్చాయి. తరగతి గదిని ఒక ప్రదేశం, ఒక ప్రాంతం, ఒక సంస్కృతితోనైనా జోడించే కాలంపోయింది. మార్కెట్ వ్యవస్థ ప్రపంచ ప్రజల మధ్యన పోటీ ఫలితాలను తీసుకువస్తే 25 సంవత్సరాలలోపే అదే సాంకేతిక పరిజ్ఞానం పోటీకన్నా సహకారం ఇవ్వాలని చెబుతోంది. బోధనలో అంతరాలను, గ్యాప్‌లను తక్కువ చేసే సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది. కో-ఆపరేటివ్ లెర్నింగ్ కూడా వచ్చింది. ఒకనాడు ఒక లెక్కచేస్తే పక్కవాడికి చూపించకుండా దాచుకునేది. కానీ నేడు పక్కవానితోనే కాదు ప్రపంచ పిల్లలందరితో చర్చించండని, కలిసి చదవండని, నేర్చుకోండనే నినాదం వచ్చింది. జ్ఞానానికి సరిసద్దులు లేవు. తరగతి గదికి కూడా సరిహద్దులు లేవని తేలిపోయింది. లెర్నింగ్‌లో, టీచింగ్‌లో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. తరగతి గదిలో 40 మంది ఉంటే చదువు ఎలా చెప్పాలో? తరగతి గదిని ఎలా నిర్వహించాలో అని ఒకప్పుడు చర్చించేవారు. ఈనాడు డిజిటల్ తరగతి గది ద్వారా లక్షా 60వేల మంది ఒకేసారి, ఒకే విషయాన్ని కలిసి నేర్చుకుంటున్నారు. 21వ శతాబ్దంలో కో-ఆపరేషన్‌కే ప్రాధాన్యత ఉన్నది. పక్క దేశంతోటి కక్షలు, జాతీయత లేక సంస్కృతి మధ్య కొట్లాటలు అన్నవి పాతకాలపు మాటలు. సరిహద్దు గీతలన్నింటిని ఈ డిజిటల్ యుగం చెరిపి వేస్తుంది. కోఆపరేటివ్ లెర్నింగ్ విద్యారంగంలోకి వచ్చేసింది. కోఆపరేటివ్ లెర్నింగ్ ఎలా జరుగుతున్నది? అన్నది తర్వాత తెలుసుకుందాం. కరెంట్ లెర్నింగ్ ఈజ్ కో-ఆపరేటివ్ లెర్నింగ్ (ఇపుడు చెలామణి అవుతున్న చదువున కలిపి సామూహికంగా నేర్చుకోవటం) ఇక్కడ వ్యక్తి ప్రధానం కాదు. వ్యక్తికన్నా సమూహం ప్రధానం. సమూహ సంభాషణే డిజిటల్ యుగంలో కోఆపరేటివ్ లెర్నింగ్. ఎప్పటి కప్పుడు వస్తున్న ఆధునిక మార్పులను అవగాహన చేసుకొని అందుకు అనుగుణంగా మనం కూడా మారినప్పుడే ప్రపంచ ప్రమాణాలను అందు కోగలుగుతాం. గట్టి పోటీ ఇవ్వగలుగుతాం. అంతేకాదు సామూహిక అభ్యసరం విద్య నేర్చుకునే విధానాల్లో తేడాలను చెరిపేస్తుంది. భవిష్య త్తులో ప్రపంచంలో ఏ మూల అవకాశం వచ్చినా కొత్తదనం లేకుండా తేలిగ్గా ఇమిడిపోయే అవకాశం ఈ రకం అభ్యసనం వల్లనే సాధ్యం.

- చుక్కా రామయ్య