సబ్ ఫీచర్

ఆడపిల్లలపై వివక్ష తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామాజికపరంగా నైతిక దృష్టి కొరవడి అత్యాధునికత పేరిట సృష్టికే ఆటంకం కలిగించే దృష్ట పరిణామాలు చోటుచేసుకోవడం సమాజ దుస్థితికి అద్దంపడుతోంది. విద్యావంతులు, పామరులు, ఏజెన్సీ ప్రాంత గిరిజనులు సైతం లింగ వివక్షతను పాటిస్తూ, సృష్టిక్రమానికి అడ్డువేయాలని భ్రమించడం నైతిక పతనానికి పరాకాష్ఠ. సామాజికపరంగా ఆడపిల్లలంటే వీరందరికి ఎందుకు అలుసో సిద్ధాంతపరంగా తేల్చిచెప్పలేని వి షయమైనా, తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులకు ఆడపిల్ల పుట్టిందంటే, అదేదో అపశకునంగా, పిడుగుపాటుకు గురైనట్లు ఆక్రోశించడం అదో అలవాటుగా పెట్టుకోవడం సమాజానికి హితం కాదు. కుటుంబాలకు కూడా అనర్థం వాటిల్లే ప్రమాదంతో పాటు, రాష్ట్ర, దేశ జనాభా ఉత్పత్తికి అదో చెడు సందేశాన్ని పంపుతుంది. సంస్కృతికి భిన్నం గా వ్యవహరించడం భావితరాలకు అనర్థం తెచ్చిపెడుతుందని, ఈ ఆడపిల్లల పుట్టుకకు వ్యతిరేకులు ఎందుకు భావించడం లేదో ఒక్కసారి తాత్విక, భౌతిక దృష్టితో ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రకృతిపరమైన విధానాల్ని కూడా ఆధునిక శాస్ర్తియ వైజ్ఞానికపరంగా అడ్డుతగిలితే ముందుముందు గడ్డు పరిస్థితుల్ని భరించాల్సి ఉంటుందని, విద్యాసంస్కారం ఉన్న కుటుంబాలువారు కూడా బరితెగించి భ్రూణహత్యలకు పాల్పడడం ప్రకృతికి విరుద్ధమైందని ఎందుకు తెలుసుకోరో అవగతం కావడంలేదు. ఆడపిల్ల అంటేనే ఆమడ దూరం వరకు పరుగులెత్తి, ఆలోచించే ఈ సమాజం, తమవల్ల ఆడపిల్లలకు కలుగుతున్న కష్టనష్టలేమిటో ఒక్కసారి మననం చేసుకోవాలి.
ఈ అత్యాధునిక సమాజంలో మగ పిల్లల్ని కనే తల్లిదండ్రులు కుటుంబపరంగా పడే మానసిక వేదనలు, వారి దుష్ప్రవర్తనతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఆకళింపుచేసుకోవాలి. అలాకాకుండా మగ పిల్లలయితే ఏదో వెలగబెడతారనే మానసిక స్థితిని మార్చుకొని ఆడయినా, మగైనా అందిన ఫలాల్ని సజావుగా, క్రమశిక్షణాయుతంగా పెంచి విద్యా, బుద్ధులు నేర్పిస్తే వారు కుటుంబంలోని తల్లిదండ్రులకే కాకుండా ఉన్నత విద్యావంతులైన తర్వాత సమాజానికి కూడా సేవలందిస్తారని తల్లిదండ్రులు ఆశించాలి కానీ, ఆడబిడ్డను ఎప్పుడో ఒకప్పుడు ఒక అయ్య చేతిలోపెట్టి కట్నకానుకలు ఇవ్వాల్సిన పరిస్థితి ఎదురవుతున్నదనే దురాలోచనను విరమించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మగపిల్లల్ని పెంచి పెద్దచేసి చదువులకోసం పరాయి పట్టణాలకో, నగరాలకో పంపినప్పుడు వారు సక్రమంగా చదువు వెలగబెడుతున్నారో, సంస్కార హీనులైన స్నేహితుల దరిజేసి దురలవాట్లకు, తలవంపులు తెచ్చే ఘనకార్యాలకు పూనుకొని, చట్టరీత్యా నిందితులైనపుడు ఆ కుటుంబంలోని తల్లిదండ్రులు పడే మానసిక ఆవేదన, దుస్థితిని గురించి కూడా సమాజంలోని ప్రజలు ఆలోచించాలి. అయితే ఆడపిల్లలు కూడా అలాంటి తలవంపులుతెచ్చే సంఘటనలు లేవని ప్రశ్నించుకొంటే అలాంటి సం ఘటనలు మగ పిల్లలకంటే, ఆడ పిల్లల్లో అతి తక్కువని సామాజిక విశే్లషకులు భావించడం జరుగుతోంది. సమాజంలో ఆడ, మగ నిష్పత్తి సమపాళ్లలో ఉంటేనే సజావుగా సామాజికంగా ముందుకెళ్ళే దారి సుగమంగా ఉంటుంది. ఇటీవల భారత్‌లో నిర్వహించిన జనాభా గణాంకాల పరంగా ఆడపిల్లల జనాభా మగవారికంటే తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. ఇలాంటి పరిణామాలు మున్ముందు ఇదే క్రమంలో కొనసాగితే మహిళాపరంగా క్షీణ దశకు చేరుకోవడం ఖాయమని మనోవిశే్లషకుల ఉవాచ.
పనికిరాని జడ పదార్థాల లాగా జీవమున్న ఆడ పసికందుల్ని పారవేయడం అమానుషం. ఆడ పసి గుడ్డును గర్భస్థంగా ఉన్నట్లే చిదిమి వేసేందుకు డబ్బులకు కక్కుర్తి పడ్డ స్కానింగ్ సెంటర్లు సాంకేతికపరమైన సంకేతాన్ని ఇచ్చి ఆడపిల్లని నిర్ధారణ చేయగానే ఎంత డబ్బయినా ఖర్చుచేసి ఆ పసిగుడ్డును చిదిమివేయడానికి పూనుకుంటారు. అలాంటివారిలో ఉన్నత విద్యావంతుల కు టుంబాలు వారు కూడా ఉండడం దురదృష్టకరం. పేదసాదలు ఆడపిల్లలు పుట్టగానే వారిని ఎలాగోలాగా అదో పీడలాగా భావించి నిర్దాక్షిణ్యంగా గొంతు నులిమి, చెత్తకుప్పల్లోనో, మురికి కాల్వలలోనో, ముళ్ళపొదల్లోనో గిరాటేసే రాక్షస సాంప్రదాయానికి విజ్ఞులైన ప్రజలు ఇకముందయినా స్వస్తిచెప్పి భావి భారత సంతతిని సముద్ధరించే బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సమాయత్తం కావాలి.
ఈనాడు ఆడ మగ తేడాలేకుండా ఉన్నత చదువులు చదివి, విజ్ఞాన శాస్ర్తియరంగాలలో సైతం ఆడ పిల్లలు పట్టుదలతో తమకు అప్పగించిన పనుల్ని సజావుగా నిర్వహిస్తున్నారు. అన్ని రంగాల్లో ప్రగతి సాధించిన మహిళా లోకమే ముందుంది. రోదసీ ప్రయాణం, విమానాలు నడపడం, సైనికులుగా దేశరక్షణ రంగంలో తమ ప్రతిభావంతమైన సేవల్ని అందించి ప్రశంసలు అందుకొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మూఢ నమ్మకాలతో ఆడపిల్ల అరిష్టమనే పాత భావనలు విడనాడి ఆడయినా, మగైనా కుటుంబానికి తల్లిదండ్రులకు రెండుకళ్ళుగా భావించి భావితరాల ప్రగతికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించి దేశాన్ని ప్రగతిపథంలోకి తీసుకువెళ్ళాల్సిన గురుతర బాధ్యత మనందరిపై ఉంది. ఆదిశగా మార్పు రావాలి. అప్పుడు మాత్రమే మన సమాజం మరింత ముందుకెళుతుంది.

- దాసరి కృష్ణారెడ్డి