సబ్ ఫీచర్

వాస్తవాలను బయటపెట్టాలి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యూరి బెంజ్మెవోవ్ రష్యా గూఢచారి. శ్రీమతి ఇందిరాగాంధీ హయాంలో భారతదేశంలో పనిచేయడానికి అతడిని రష్యన్ గూఢచర్య సంస్థ కెజిబి పంపించింది. కమ్యూనిజం సిద్ధాంతాన్ని వొంటబట్టించడం ద్వారా భారతదేశంలో తమకు అనుకూలంగా పనిచేసే ‘మూర్ఖ మేధావుల’ బృందాన్ని తయారుచేయడానికి తన బృందానికి ఆదేశాలు అందాయని ఒక అమెరికా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో యూరి అన్నారు. ఏ మాత్రం నైతిక విలువలు లేని సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన వాళ్ళు, పత్రికాధిపతులు, మీడియా ప్రముఖులు, సంపన్న సినీ నిర్మాతలు, విద్యారంగ మేధావులు, సమాజాన్ని ద్వేషించేవాళ్ళు, అహంకారులు ఈ ‘మూర్ఖ మేధావుల’ బృందంలో వున్నారు.
‘‘్భరతదేశంలో రష్యా కొత్తగా ప్రవేశపెట్టిన వలసవాదం బ్రిటీష్‌వారి వలసవాదం, సామ్రాజ్యవాదాలకంటే వెయ్యి రెట్లు ప్రమాదకరమైనది’’ అని యూరి బెంజ్మెనోవ్ అంటాడు. స్థూలంగా చెప్పాలంటే మన దేశంలోని కమ్యూనిస్టులను రెండు వర్గాలుగా పేర్కొనవచ్చు. రష్యా పోషించే కమ్యూనిస్టులు, జిహాదీ సంస్థ ఐఎస్‌ఐ పోషించే కమ్యూనిస్టులు, రష్యా పోషించిన భారతీయ కమ్యూనిస్టుల తీరు ఎలా ఉందో చూద్దాం- యూరి బెంజ్మెనోవ్ మాటల్లో..
మేధావులను దాసులుగా.. ‘రాప్పొడీ టు లెనిన్’ అన్న పేరు పొందిన కవిత సుమిత్రా నందన్ పంత్ వ్రాసినదే. ఇది వ్రాసిన ఈయనని సోవియెట్ రష్యా గౌరవార్థం ఆహ్వానించింది. ఆయన ప్రయాణానికి, ఇతర అవసరాలకు అయ్యే ఖర్చును రష్యన్ ప్రభుత్వమే భరించింది. ఎవరినైనా తమ దేశానికి ఆహ్వానించినపుడు రష్యన్ ప్రభుత్వం వారికి చేసే మర్యాదల తీరు ఎలా వుంటుందో యూరి మాటల్లో... ‘‘వచ్చిన అతిథుల ఆసక్తి ఇతర విషయాలపైకి వెళ్లకుండా మేము చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. ముందుగా వచ్చినవారి శ్రద్ధ అంతా మద్యంమీద ఉండేట్టు చేయడానికి ముందున్న టేబిల్‌పై వోడ్కా సీసాలు ఉంచుతాం. దెబ్బకి విదేశీ జర్నలిస్టులు రష్యా గురించి ఎలాంటి రాతలు రాస్తారో తెలుసుకోవాలన్న ఆలోచనలు వారిలో పూర్తిగా చచ్చిపోతాయి. విదేశీ అతిథులను మత్తులో ముంచెత్తి పూర్తిగా వశపరచుకోవడం రష్యన్ గూఢచారి సంస్థ కెజిబి ముఖ్యమైన పనుల్లో ఒకటి.
‘‘విదేశీ అతిథుల్ని ప్రముఖుల కోసం ఏర్పాటుచేయబడ్డ విలాస గృహాలలోకి తీసుకుపోతాం. అక్కడ వారిని స్నేహితుల్లా మచ్చిక చేసుకుంటాం. ఆ తరువాత అంతర్జాతీయ వ్యవహారాలూ, ప్రపంచ దేశాల గురించి వారికి మేం ఏం చెప్తే అదే వేదం. అలా మాట్లాడుతూనే వోడ్కా పట్టిస్తాం. వాళ్ళు సంతోషంలో మునిగితేలుతూ మేం చెప్పినట్టల్లా ఆడే స్థితికి రావడానికి ఎంతో సమయం పట్టదు. ఇదీ వచ్చిన అతిథులకు మేం బ్రెయిన్‌వాష్ చేసే పద్ధతి’’- ఇదీ ప్రసిద్ధ హిందీ రచయిత సుమిత్రా నందన్ పంత్ రష్యన్ గూడఛారి సంస్థ కెజిబి చేతిలో కీలుబొమ్మ అయిన తీరు.
ఎర వేసి మచ్చిక.. రష్యన్ కమ్యూనిజాన్ని భారతదేశంలో విస్తృతంగా ప్రచారం చేయడానికి ఢిల్లీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లకు, కమ్యూనిస్టు పార్టీలకు, వామపక్ష మేధావుల, మీడియా పత్రికా రచయితలకు, కవులకు, నక్సలైట్లకు, మావోయిస్టులకు పెద్ద మొత్తంలో రష్యానుండి డబ్బులు అందుతుంటాయని యూరి అంటాడు. రష్యన్ గూఢచారి సంస్థ కెజిబి సంస్థ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యూ), ఢిల్లీ విశ్వవిద్యాలయాలకు చెందిన ప్రొఫెసర్లతో స్నేహం చేస్తారు. తరువాత ఇండో -సోవియెట్ ఫ్రెండ్‌షిప్ సొసైటీతో పేరుతో ఏర్పాటైన సమావేశాలకు ఆ ప్రొఫెసర్లను ఆహ్వానిస్తారు. వీటికయ్యే ఖర్చంతా రష్యా ప్రభుత్వమే భరిస్తుంది. కొంతకాలం గడిచాక ఆ ప్రొఫెసర్లను రష్యాకు ఆహ్వానిస్తారు. తమ ప్రతిభా పాటవాల, మేధాపరమైన ఆలోచనల కారణంగానే తమకీ గౌరవం దక్కిందని ఆ ప్రొఫెసర్లు గట్టిగా నమ్ముతారు. కానీ ఇదంతా శుద్ధ అబద్ధం. తమకు పనికివచ్చే మూర్ఖులు కాబట్టే ప్రొఫెసర్లను ఆహ్వానిస్తోంది రష్యా ప్రభుత్వం. స్వదేశానికి తిరిగి వచ్చాక తమ విశ్వవిద్యాలయాల్లో ఆ ప్రొఫెసర్లు సోవియెట్ కమ్యూనిజం యొక్క గొప్పదనాన్ని గురించి ఏళ్ళ తరబడి పాఠాలు బోధిస్తారు.
భారతీయ మేధావుల గురించి యూరీ.. ‘‘్భరతదేశంలో మేధావులలో స్థూలంగా రెండు వర్గాలున్నాయి. ఎప్పుడూ రష్యా విదేశాంగ విధానాలను ఆకాశానికెత్తేసే భజనపరులు మొదటి వర్గంవారు. వీళ్లకి పత్రికలు విశేష ప్రచారం కల్పించడం ద్వారా ప్రజాభిప్రాయాన్ని వారికనుకూలంగా మలచి రాజకీయాధికారంలోకి వచ్చేందుకు దోహదం చేస్తాయి. ఇక రెండో వర్గంవారు రష్యా విధానాలతో విభేదిస్తారు. వీరిపై స్వంత దేశంలోనే భౌతిక దాడులు జరుగుతాయి. తిరోగమనవాదులుగా ముద్రవేసి వీరి వ్యక్తిత్వాన్ని నీచంగా దూషిస్తూ పత్రికలు బోలెడు వ్యాసాలు కుమ్మరిస్తాయి.’’
భారతదేశం గురించి.. భారతదేశం అంటే నాకు చెప్పలేనంత ప్రేమ. ఎన్నో వైవిధ్యాలున్నప్పటికీ ఈ దేశంలో మానవత్వం పరిమళిస్తూ ఉంటుంది. ఈ దేశంలో గల తాత్విక, మేధాపరమైన స్వేచ్ఛ, సహిష్ణుత నన్ను ఆకట్టుకున్నాయి. భారతదేశంలో కనీసం ఆరువేల సంవత్సరాల క్రితమే నాగరిత వికసించింది. కాబట్టి సైద్ధాంతికంగా గానీ, మరే విధంగా కానీ ఇంత గొప్ప దేశంపై రష్యా ఆధిపత్యం చెలాయించాలనే ఆలోచనతో నేను ఏకీభవించను.
రష్యా గురించి యూరీ... రష్యా ఏమీ భారతదేశానికి స్వాతంత్య్రం తెచ్చిపెట్టలేదు. రష్యావలన భారత్‌కి ఒరిగిందీ ఏమీ లేదు. ప్రపంచ దేశాలమధ్య స్నేహభావాన్ని నెలకొల్పడానికి రష్యా చేసింది ఏమీ లేదు. పైగా జాత్యహంకారాన్ని, దోపిడీని, బానిసత్వాన్ని, ముఖ్యంగా ఆర్థిక తిరోగమనాన్ని ప్రపంచానికి అందించింది రష్యా. తమ తోటివారిపట్ల మనుషులలో విశ్వాసాన్ని ధ్వంసం చేయడమే రష్యా ప్రపంచానికి నేర్పింది. భారతదేశంపట్ల నాలో అభిమానం మొదలైనప్పటినుంచి కెజిబి నన్నొక ప్రమాదకర వ్యక్తిగా పరిగణించడం మొదలుపెట్టింది.
వామపక్ష శక్తుల గురించి యూరీ... భారత్‌లోనూ, అమెరికాలోనూ గల వామపక్ష మేధావులు, విద్యావేత్తలు, అలాగే మానవ హక్కుల గురించి ఆందోళనలు చేసేవాళ్ళు- వీరంతా ఆయా దేశాలలో జాతి విచ్ఛిన్నకర శక్తుల ఉపకరణాలే. ఆయా దేశాలలో జాతి విధ్వంసం జరిగిపోయిన తరువాత ఇక అక్కడ వామపక్ష వర్గాల, కమ్యూనిస్టులకు పనే ఉండదు. భారతదేశంలో ఎప్పటికైనా తాము అధికారంలోకి వస్తామని కమ్యూనిస్టులు భావిస్తుంటారు కానీ అది జరగనిపని. వాళ్ళే కనుక అధికారంలోకి వస్తే మార్క్సిస్టు-లెనినిస్టు శక్తులకు బద్ధ వ్యతిరేకులౌతారు. వారి తూటాలకు అధికారంలో వున్న కమ్యూనిస్టులు బలికాక తప్పదు. నికరాగువాలో జరిగింది ఇదే కదా! అక్కడ కమ్యూనిస్టులు అధికారంలోకి రాగానే అంతకుముందు మార్క్సిస్టు లెనినిస్టు ఉద్యమాలలో పాల్గొన్న చాలామందిని జైళ్లలో పెట్టారు.
గ్రెనడాలో ఏం జరిగింది?... అక్కడ మార్క్సిస్టులు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఆప్ఘనిస్తాన్‌లోనూ ఇదే తంతు. బంగ్లాదేశ్‌లో అయితే సోవియట్ వామపక్ష అనుకూలవాది అయిన ముంగీ బరాక్మాన్, అతని అనుచరులైన మార్క్సిస్టు-లెనినిస్టు సాయుధ పోరాట దళాల చేతిలో కిరాతకంగా వధింపబడ్డారు. కమ్యూనిస్టుల ప్రాబల్యం వున్న ఎక్కడైనా ఇదే కథ. ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యమకారులందరినీ రూపుమాపడమో లేదా జైళ్ళల్లో బంధించడమో జరుగుతుంది.
కాబట్టి భారత్ అయినా అమెరికా అయినా మరెక్కడైనా సరే కమ్యూనిస్టులకు అనైతికతయే ప్రధాన భూమిక. కాబట్టి ఇప్పటికైనా భారత్, అమెరికాలలో పెద్దలు మేల్కొని రాబోయే తరాలవారికి వాస్తవాలను తెలిపి సరైన అవగాహన కల్పించకపోతే వారి తరువాతి తరం వరకూ ఎవరూ ఏమీ చేయలేరు.
కెజిబి కార్యకలాపాలకోసం భారత్‌లో అడుగుపెట్టిన యూరీ బెంజ్మెనోవ్ కమ్యూనిస్టు మార్క్సిస్టు భావజాలంతో పనిచేసిన ఒక విద్యార్థినిని వివాహమాడాడు. తరువాత కాలంలో యూరి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. కెనడాలో వున్న యూరి కొన్ని టీవీ ఇంటర్వ్యూలను, ఉపన్యాసాలను ఇచ్చాడు కానీ తరువాత కొంతకాలానికే కెజిబి చేతిలో కెనడాలో హతుడయ్యాడు.

-ప్రొ. దుగ్గిరాల రాజకిశోర్ 80082 64690