సబ్ ఫీచర్

ఎంపి నిధులు సద్వినియోగం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకపక్క ఏటా ఐదు కోట్లుగా ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాల అభివృద్ధి నిధులను రూ.15కోట్లకు పెంచమని కోరటం, మరొక పక్క కేటాయించిన నిధులనే 50 శాతం మంది సకాలంలో ఖర్చుచేయలేక పోవటంతో మరొక్కసారి ‘యం.పి.లాడ్స్’ అంశం వార్తలకెక్కింది. తమతమ నియోజకవర్గాలలో ప్రజలతో పరోక్ష సంబంధాలనే కలిగివున్న పార్లమెంట్ సభ్యులను ప్రజలకు దగ్గరచేయాలనే ఉన్నత లక్ష్యంతో 1993-94 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా ‘యం.పి.లాడ్స్’ పథకం మొదలైంది. ఈ దశలో ఉభయ తారకంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం కూడ మొదట్లో యం.పిలతోపాటు రాజ్యసభ సభ్యులకు సంవత్సరానికి కోటి రూపాయలు కేటాయించారు. ఈ నిధులతో ఒక్కొక్క పనికి పది లక్షల రూపాయలకు మించకుండా ఖర్చుచేయాలని షరతు విధించింది.
ఈ పథకంవల్ల యం.పి.లవద్దకు ప్రజలు రావటం మొదలు కావటంతో వారు యం.పి. నిధులను కోటినుండి రెండు కోట్లకు పెంచమని పట్టుబట్టి సాధించుకున్నారు. నియోజకవర్గాలలో యం.పి. నిధుల పనులు ఊపందుకున్నాయి. అయితే ఈ నిధులను పర్సంటేజీలకు అమ్ముకుంటున్నారంటూ ఉభయ సభల యం.పి.ల పైనా దుమారం రేగింది.ఒక దశలో ఈ పథకాన్ని రద్దుచేయాలని జాతీయస్థాయిలో మేధావి వర్గాలు ఉద్యమం చేశా యి. అయినా కేంద్రం పట్టించుకోలేదు. పార్లమెంట్ సభ్యులు 10 లక్షలు మినహా మిగిలిన సొమ్మునంతా తమ నియోజకవర్గ పరిధిలోనే ఖర్చుచేయాలి. అదే రాజ్యసభ సభ్యులైతే దేశంలో ఎక్కడైనా కేటాయించవచ్చు. ఎన్ని విమర్శలు వచ్చినా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగించటమే కాకుండా 2011లో ఏకంగా ఈ నిధులను రూ.5 కోట్లకు పెంచింది.
కోట్లకు అధిపతులైన కొందరు పార్లమెంట్ సభ్యులు ఈ నిధుల కేటాయింపులో నిర్లక్ష్యధోరణి ప్రదర్శించగా చిన్నస్థాయి పార్లమెంట్ సభ్యులు ఈ నిధులను పూర్తిగా తమ వందిమాగదులు చెప్పినట్లు ఎడాపెడా కేటాయించివేశారు. గ్రామాల్లో వౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా పుట్టి న ఈ పథకం ఆ లక్ష్యాన్ని సాధించటంలో పూర్తిగా విఫలమైంది. అదే విధంగా ఇరిగేషన్ పనుల విషయంలో కూడా పెద్దగా కేటాయింపులు జరగలేదు. కొన్ని రోడ్లుమాత్రం కొత్తగా ఏర్పాటయ్యాయి. మంచినీళ్ళు పథకాలను కూడా నామమాత్ర నిధులతో సరిపుచ్చారు. ఈ పథకం పుట్టిన తర్వాత ఇంతవరకు యం.పి.లకు 24998 కోట్ల రూపాయలు కేటాయించారు. అయితే అందులో 22178 కోట్ల రూపాయలు మాత్రమే యం.పి.లు వినియోగించుకో గలిగారు.
యు.పి.పాలనలో అడ్డగోలు పథకంగా మారిపోయిన ఈ పథకాన్ని ఎన్.డి.ఎ. ప్రభుత్వం రద్దుచేస్తుందని అందరూ భావించారు. అయితే అందుకు భిన్నంగా మోదీ సర్కారు ఈ పథకాన్ని కొనసాగించటానికి నిర్ణయించుకొని కొన్ని మార్పులు ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ప్రతి పార్లమెంట్ సభ్యుడు తన పదవీకాలంలో మూడు గ్రామాలను ఎంపిక చేసుకొని (అవి స్వగ్రామం, అత్తవారి గ్రామం కాకూడదు) వాటిని సమగ్రంగా అభివృద్ధిచేయాలి. ఈ పథకానికి స్వర్ణగ్రామయోజన అని పేరుపెట్టారు. పార్లమెంట్ సన్యులు నిధులు ఖర్చుచేయలేక పోతున్నారనే అపవాదును తప్పించుకోవటానికి ఇబ్బడిముబ్బడిగా సామాజిక భవనాల నిర్మాణానికి అనుమతులు ఇవ్వటం ప్రారంభించారు. అయితే సామాజిక భవనాల ముసుగులో మతపరమైన ఆలయాల నిర్మాణం సాగటంతో ప్రభుత్వం విచారణ జరిపి నిజమని తేలటంతో 2015 ఏప్రిల్‌నుండి అటు భవనాలకు అనుమతులు నిరాకరించింది. అయితే గ్రామ పంచాయితీ పరిధిలో ఇప్పటివరకు ఒక సామాజిక భవనం లేనిచోట వెసులుబాటు కల్పించారు. యం.పి.లు తమ నిధులను వ్యవసాయం విద్య, ఆరోగ్యంకోసం పెద్దఎత్తున ఖర్చుచేస్తే మంచిదని సామాజిక కార్యకర్తలు సూచిస్తున్నారు.

- పుట్టా సోమన్నచౌదరి సెల్- 9440339682