సబ్ ఫీచర్

సనాతన ధర్మమే శ్రేయస్కరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశం ఒక మట్టిముద్దకాదు. ‘్భరతమాత’ అని పిలవబడే దేవత. అనాదిగా అనేక ఆధ్యాత్మిక ఆవిష్కరణలకు, ఉన్నత ఆధ్యాత్మిక సాక్షాత్కారాలకు జన్మస్థానంగా ఉంది. ఈ దేశం ఒక కోటలాగా సుస్థిరంగా తన ఆధ్యాత్మిక ఉన్నత ఆదర్శాన్ని అత్యంత సంపూర్ణమైన స్వచ్ఛతతో నిలుపుకోగలదు. భారతదేశం ప్రపంచానికి గురువు. ప్రపంచం తన మంచికోసం భారతదేశాన్ని రక్షించుకోవాలి. ఎందుకంటే ఈ దేశం మాత్రమే ప్రపంచాన్ని ఒక నూతన క్రమంవైపు, శాంతివైపు నడిపించగలదు. శ్రీ అరవిందులు పైవిధంగా భారతదేశాన్ని భారతమాతను ఆవిష్కరించారు.
ఎన్ని అక్రమాలు జరిగినా, మత ధర్మాన్ని విసర్జించకుండా, పరమాత్మతో విశ్వాసాన్ని విడనాడక పోవడం వల్లనే భారతజాతి మనుగడ సాగించగలిగింది. శ్రీకృష్ణుని అభయహస్తం ఈ జాతికి నిరంతరం రక్షణ కల్పించింది. ‘సర్వప్రాణికోటికి నేను మిత్రుడనని తెలిసినవాడు శాం తిని పొందుతాడు’ అనేది శ్రీకృష్ణ వచనం. ఈ మాటలో ఒక విశేషం నిక్షిప్తమై ఉంది. ఇక్కడ శ్రీకృష్ణుడు అంటే సాక్షాత్తు భగవంతుడు. ‘నన్ను మిత్రుడిగా పొందినవా డు’ అని అనకుండా ‘నేను మిత్రుడినని తెలిసినవాడు’ అంటాడు. అంటే భగవంతునికి మనతో మిత్రత్వం స్వాభావికం, శాశ్వతం దానిని గుర్తించినవాడే నిజమైన జ్ఞాని.
మనుషులలో మూడురకాల జీవులున్నారు. కొందరు భగవంతుడున్నాడు అన్న ప్రగాఢ విశ్వాసంతో, స్పృహతో ఆనందంగా కాలం గడుపుతారు. మిత్రరూపుడైన ఆ పరమేశ్వరుడు తమకు సరియైనమార్గం చూపుతాడని, ధర్మపధంనుంచి వైదొలగనీయడన్నది వీరి నమ్మకం. వీరు ఉత్తమశ్రేణికి చెందినవారు. అందుకే ఫలాపేక్ష నాశించక కర్మలను ధర్మబద్ధంగా చేసుకుపోతారు. భగవద్గీతలో ఈ విషయానే్న మరింత వివరంగా శ్రీకృష్ణపరమాత్మ చెప్పివున్నాడు. ‘నిష్కామకర్మ యోగంలో ఎట్టి ప్రయత్నం విఫలంకాదు. మంత్రాదుల్లో కీడు కలుగుతుంది. కాని దీనికట్టి దోషం లేదు. ఈ నిష్కామకర్మయోగమొకింత ఆచరించినా జననమరణ సంసార భయం నుండి రక్షిస్తుంది ‘‘ఇక రెండవ రకం, వీరికి అహంకారం పాలు ఎక్కువ. వీరికి శాంతి ఉండదు. ఏ కర్మలను సరిగా ఆచరించలేరు. వీరు మధ్యమశ్రేణికి చెందుతారు. మూడవరకం వారు నిత్య ఆందోళనాపరులు. ఏ పని చేస్తే భగవంతుని కృప కలుగుతుంది, ఏ పని చేస్తే భగవంతుడు కినుక చెందుతాడు అనే నిత్య శంకలతోనుంటారు. భగవంతుడు తమకు అండగా ఉండడేమోనన్న ఆందోళనతో వీరు కృశించిపోతారు. వీరు అధమశ్రేణికి చెందినవారు. భారతదేశం ధర్మప్రధానమైన దేశం. ధర్మాన్ని ఆచరించమనేదే శ్రీకృష్ణుని ఉపదేశం.
నాలుగు పురుషార్థాలను మన మునులు మనకందించారు. ఇందులో ధర్మానికి ప్రథమస్థానం ప్రాధాన్యతను ఇచ్చారు. ధర్మాచరణ హిందువుల జీవనశైలి. భారతదేశంలో రామాయణ కాలంనుంచి ఈనాటి ఒక ఉమ్మడి కుటుంబంవరకు ఏ తేడాలేకుండా అవిచ్ఛిన్నంగా సాగిపోతున్న ఒకానొక ధర్మస్రవంతి. శాశ్వతం అని పిలవబడే సనాతన ధర్మాన్ని హిందూజాతి మాత్రమే నిలిపి ఉంచగలదు. అందువలననే ఈ ఉన్నతమైన సంస్కృతి మన సనాతనధర్మంతో మతమనే పేరుగలిగిన ఒక జీవన విధానంతో అవినాభావంగా అల్లుకుపోయి నిలిచిపోయింది. కట్టుబొట్టులో వంటలో తిండిలో, తినడంలో పెట్టడంలో కుటుంబ సభ్యులలోని పరస్పర మన్ననలతో పెనవేసుకుపోయిన ఈ సంస్కృతి అనబడేది సనాతనధర్మమే కాని వేరొకటి కాదు. భర్తకు సేవచేయడం అనే అరుధతి పత్నీధర్మం వశిష్టుల కాలంనుంచి అలాగే కొనసాగుతోంది. గృహస్తులు నేటికి సాధువులకు సన్యాసులకు అతిథులకు ఇచ్చే ఆదర గౌరవాలతో ఎలాంటి హెచ్చుతగ్గులు లేవు. వృక్షాలను, నదులను, పర్వతాలను ఈశ్వర మయంగా చూడడం పురాతన కాలంనుంచి మార్పు చెందక అలాగే కొనసాగుతోంది. నీతి నియమాలు అందరికీ ఒక్కటే అనేది ఈ సనాతన ధర్మలక్షణం.
సనాతనం అంటే నిత్య నూతనం, శాశ్వతం, సత్యం. హిందూ మతం లేదా సనాతన మతానికి ఒక ప్రవక్త అంటూ లేడు. సనాతన మతం ఎప్పుడు పుట్టినది ఎవరూ తేల్చి చెప్పలేరు. వాస్తవానికి హిందూ మతం కాదు అది ధర్మం. ఈ సంస్కృతి అనేది సనాతన ధర్మమే కాని వేరొకటి కాదు. కులంతోను, విద్యతోను, సంబంధం లేకుండా నీతి నియమాలు అందరికీ సమానంగా అందరికీ ఒకే తీరులో గాఢంగా హృదయాలలో నాటిన ఈ సంస్కృతికి సనాతన ధర్మమని పేరుపెట్టడం యాదృచ్ఛికం కాదు. మనకు వేదాలు, శృతులు, స్మృతులు, ఉపనిషత్తులు ఉన్నాయి. ఇంకే మతానికి ఇంతటి మహత్తర గ్రంథాలులేవు. ఈ సనాతన ధర్మం వేదాలనాధారం చేసుకొని జన్మించింది. ఇది సర్వమతాలను ఆలింగనం చేసుకోగలిగిన విశ్వజనీయ మతం. భారతదేశం ప్రపంచానికి ఆధ్యాత్మికతను బహుమానంగా ప్రసాదిస్తుంది. సమస్త జీవరాశులలోనూ ఆత్మఉందని విశ్వసిస్తుంది. పిపిలికాది బ్రహ్మా ది పర్యంతంగల సమస్త్భూతాల్లోని ఆత్మ, తనలోని ఆత్మ ఒక్కటేనని తెలుసుకో అంటాడు శ్రీకృష్ణపరమాత్మ. ప్రకృతిని స్వార్థప్రయోజనాలకోసం దోచుకునే ప్రవృత్తిని నిరసిస్తుంది మన ధర్మం. హిందూ మతం ఉపాసనా పద్ధతి ఇలాగే ఉండాలని శాసించదు. ఎవరి ఇష్టంమేరకు ఎవరి పద్ధతినివారు అనుసరించవచ్చు. కాని ఇలాంటి వీలు ఇతర మతాలలో లేదు. వారు హద్దులను అతిక్రమించలేరు.
ఈ వ్యవస్థవలన భారత జాతి మానవ జాతిలో అత్యుత్తమమైన సంస్కృతి గలదిగా మన్నన పొందింది. శాంతి, సుహృద్భావం, గమ్యం, వీటితోకూడిన సమాజం వర్ధిల్లింది. అయితే అనేక శతాబ్దాలు గడవగా అప్పుడప్పుడే కొందరు వ్యక్తులవలన, అహంకారం వలన, స్వార్థంవలన అధర్మం చోటుచేసుకొని కొందరికి అన్యాయం జరగడం కద్దు. అయితే మహాపురుషులు అవతరించి సంస్కరణలుచేసి ఆ లోపాలను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి మేలిమైన సంస్కరణలు జరుగుతూ ఉండడం వలననే సనాతన ధర్మం నేటికి నిలిచి ఉంది.
భారతదేశం తన సనాతన ధర్మాన్ని విడనాడితే అది ఈ జాతి పతనానికే దారితీస్తుంది. జాతీయత అంటే ఆచా రం, మతం, విశ్వాసం కాదు. హిందూ సనాతన ధర్మమే మన జాతీయత.

- గుమ్మా ప్రసాదరావు