సబ్ ఫీచర్

రాచరికపు పోకడలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ ఒలింపిక్ పోటీలలో బాడ్మిమింటన్‌లో రజతాన్ని పి.వి. సింధు, జిమ్నాస్టిక్‌లో కాంస్య పతకాన్ని దీపాకర్మాక్, రెజ్లింగ్‌లో సాక్షి కాంస్య పతకాన్ని సాధించి మన దేశ గౌరవాన్ని ఇనుమడింపజేసారు. అందుకు వారు అభినందనీయులు- సన్మాన సత్కారార్హులు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు- ఇదే రీతిలో మిగతా రంగాలపట్ల మనం చూపిస్తున్నామా?- బాడ్మిమింటన్, క్రికెట్ వంటి ఆటల పట్ల చూపిస్తున్న తమకం- పోత్సాహం- హాకీ, ఫుట్‌బాల్, కబడ్డీ వంటి క్రీడల పట్ల చూపిస్తున్నామా?- లోతుగా ఆలోచిస్తే క్రికెట్, బాడ్మిమింటన్ వంటివి బ్రిటిష్ రాజరికంలో అంతఃపుర క్రీడలు- మరి హాకీ, ఫుట్‌బాల్, కబడ్డీ- మల్లయుద్ధం, కర్రసాము, కత్తిసాము- ముఖ్యంగా కేరళ యుద్ధ విద్య ‘కలరిపయట్టు’ విలువిద్యల పట్ల చూపిస్తున్నామా? ‘కలరిపయట్టు’ కత్తి- కర్రయుద్ధంలో డెబ్భై ఏండ్ల వయసుగల మీనాక్షమ్మ గురించి ఇటీవల తెలుసుకున్నాం. రాజమండ్రిలో ఒక వాచ్‌మెన్ ఉద్యోగం చేసే ఒక సామాన్యుడు అపర ద్రోణాచార్యుడిగా పేరు పొందాడు- పాదాలతో బాణాలు వేసే వాడట- బాణంతో నుదుట గాయం ఏమాత్రం కాకుండా బొట్టుపెట్టేవాడట- మరి అతని గురిం చి పత్రికలు ఎన్నడైనా ఇంత ఆర్భాటంగా రాసాయా?-
ఇకపోతే మరొక ప్రధాన రంగాన్ని విస్మరిస్తున్నాం. అదే దేశరక్షణ రంగం- కార్గిల్ రంగంలో దేశ రక్షణలో ప్రాణాలర్పించిన వీర కుటుంబాలకు మనం చేసిందేమిటి- క్రికెట్ వీరులకు బి.ఎమ్.డబ్ల్యూ కార్లు. నగదు బహుమతులు- అభినందనల వెల్లువలు. సత్కార పురస్కారాలు- హిమాలయాల సరిహద్దుల్లో సియాచిన్ ప్రాంతంలో ఇంచుమించు ఐదువేల ఏడువందల యాభై మీటర్ల ఎత్తున (అడుగులు కాదు) భయంకరమైన మం చులో సంవత్సరాల తరబడి కుటుంబాలకు దూరమై- ఒక్కొక్కప్పుడు మంచు లోయల్లో పడి జాడ కూడా తెలియకుండా మృత్యువాత పడిన సైనిక సోదరులకు మనం ఇస్తున్న గౌరవమేమిటి- అంతగా అయితే బిరుదులూ- వీరచక్రాలు. వారి కుటుంబాల గురించి ఎన్నడైనా ఆలోచిస్తున్నామా? బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో ప్రధాన వ్యూహకర్త ఐన డెబ్బయి యుద్ధాలు చేసిన దివంగత జనరల్ మానెక్షాను మనం ఎన్నడైనా స్మరిస్తున్నామా?- రజాకార్ల నుండి హైదరాబాద్‌ను తెలంగాణాను విముక్తం చేసిన జనరల్ చౌదరిని ఎన్నడైనా మర్యాదకోసమైనా స్మరిస్తున్నామా? 1962లో చైనాతో యుద్ధంలోనూ, 1965లో పాకిస్తాన్ యుద్ధంలో పఠాన్ టాంకులను నుగ్గుచేసిన యుద్ధ వీరులను- విమాన యోధుడైన అహ్మద్‌ను గుర్తుపెట్టుకున్నామా?అసలు వీరి గురించి నేటి యువతరానికి తెలియజేస్తున్నామా? ఇంకా ప్రధానమైన విషయం శ్రీహరికోట రక్షణశాఖ నిపుణులు- ఇస్రో అంతరిక్ష పరిశోధకులు- పోఖ్రాన్‌లో అణ్వస్త్ర పరీక్షలు చేసి దేశాన్ని అత్యున్నత స్థాయిలో నిలిపిన శాస్తజ్ఞ్రులు వీరికెన్నడైనా బి.ఎమ్.డబ్ల్యూ. కార్లు కోట్ల రూపాయల బహుమతులు- విశాలమైన నివాస స్థలాలు కేటాయించామా? లేదు- జై జవాన్- జైకిసాన్‌లకు మనం ఇస్తున్న ప్రోత్సాహమేమిటి?- ఏమీ లేదు- ‘‘శుష్క ప్రియాలు శూన్యహస్తాలు’’- మరి దేశానికి అవసరమైన రంగాలను నిరాదరణ చేస్తూ- ఆకర్షణ- ఆడంబర రంగాలకు పెద్దపీట వేస్తున్నాం- క్రికెట్ మీద చూపిన వ్యామోహం- బాడ్మిమింటన్ క్రీ డాకారులకు ఇస్తున్న పురస్కారాలు- బహుమతులు- కోట్లాది రూపాయ లు- ఇతర రంగాలతో తులనాత్మకంగా చూస్తే వివేకవంతుని గుండె తరుక్కుపోతుంది- ఐదు కోట్ల రూపాయలు తెలంగాణ సర్కారు, మూడు కోట్ల రూపాయలు, వెయ్యి గజాలు అమరావతిలో నివాస స్థలం బహుమతిగా ప్రకటించేశారు మన తెలుగు ముఖ్యమంత్రులు.ప్రజాస్వామ్యంలో ప్రజాధనాన్ని రాచరికపు పోకడలతో పంచటం న్యాయమేనా?- అసలు ఇలాంటి సత్కారాలకు సన్మాన నిర్ణయాలకు అధికారికమైన ప్రాతిపదిక ఏమీ లేదా?కేవలం ముఖ్యమంత్రుల ఇష్టాయిష్టాలేనా?- ఇది అధికార దుర్వినియోగం కాదా? ముఖ్యమంత్రులు రాచరికపు పోకడలు పోతున్నట్టు కా దా?
సంస్కృతంలో ఒక నానుడి ఉంది-
యదకృత్యం- తత్కృత్యం
ఎత్‌కృత్యం- తదకృత్యం- అని
ఏది చెయ్యాలో అది చెయ్యకపోవటం-
ఏది చెయ్యకూడదో అది చెయ్యటం- అలవాటుగా మారిపోయింది.

- ఉమాపతి బి.శర్మ సెల్: 9246171342