సబ్ ఫీచర్

శశిథరూర్ ద్రోహచింత - అతి తెలివి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేరళ తిరువనంతపురం నుంచి లోక్‌సభకు ఎన్నికైన వాచాలుడు అని ఈయన గూర్చి చెపితే సులభంగా అర్థమవుతుంది. స్ఫురద్రూపి, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ విద్వాంసుడు. సునందాపుష్కర్ బలవన్మరణానికి కారకుడు, ప్రేరకుడు అని ఈయనగూర్చి లోకం వాకొంటున్నది. ఈ ‘కేసు’ ఏమైందో తెలియదు. ఇంగ్లీషులో చాలా గొప్ప పండితుడిని తాను అని ఈయన అతిశయం. ఈ విషయాన్ని సందర్భం ఉన్నా, లేకపోయినా ప్రగల్భంగా ప్రకటించుకుంటూ ఉంటాడు కూడాను.
ఈ సంవత్సరం థరూర్‌గారికి సృజన సాహిత్యేతర ప్రక్రియకు గాను కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార ప్రదానం చేసింది. ఇంగ్లీషు భాషా వైదుష్యపు గుర్తింపునకు ఆనవాలుగా ఈ పురస్కారం వీరికి దక్కింది.
మా అమ్మ ఒక సామెత చెపుతూ ఉండేది. ‘విడిచినవాడు, విడిచినవాడు వియ్యమందుకుంటూ ఉంటే, అంతకంటె విడిచినవాడు వచ్చి హారతి పట్టాడు’ అని.
ఈ థరూర్‌ను గూర్చి ఇంత వైమనస్యానికి కారణం ఏమంటే ప్రధానమంత్రి మోడీని జిన్నాతో పోలిక తెచ్చి అధిక్షేపించాడీ ప్రబుద్ధుడు. జాతీయ ప్రయోజనాలకు వేరు పురుగులైన ఇంగ్లీషు దైనికలు, చూశారా, చూశారా? ప్రధానమంత్రిని ఎంత బాగా శశిధరూర్ అభిశంసించాడో అని రోజుల తరబడి ఈ వార్తను చిలవలుపలువలుగా బాకా ఊదుతూ, అనుబంధ విభాగాలలో ప్రచురిస్తూనే ఉండటం గమనించవచ్చు.
మహమ్మదాలీ జిన్నాగారు దేనినైతే సాధించాడో దానిని మోడీ మహాశయుడు ఇంకా ముందుకు తీసుకునిపోతున్నాడని పౌరసత్వ సవరణ చట్టం గూర్చి, ఇంకా ఊహాజనిత (రూపొందని) నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ షిప్ గూర్చి థరూర్‌గారి వావదూకత (అంటే అతివాగుడు, మరియు నోటి జిల) పైత్యించి మోడీ మహాశయుణ్ణి అభినవ జిన్నాగా వెటకరించటం ఉన్మాద మేధా విలసనం కింద జమకాదా?
కాంగ్రెసువారు అవినీతిపరులు. ఆదర్శం, ఆచరణ శూన్యమై అతిడాంభికత, ఆత్మద్రోహమూ ఒంటపట్టినవారు. ఈ కాంగ్రెస్ ప్రముఖుడైన అభిషేక్‌సింగ్ మన్వి (ఈయన లాయరు కూడానట!) తన వ్యాపార లావాదేవీలలో, అవకతవకలలో ఆదాయపు పన్ను శాఖవారు రసీదులు చూపవలసిందని కోరితే అవి చెదలు తినిపోయినవి. నేను చూపలేను అన్నట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో చాలారోజుల కిందట బహుకాలమ్ (కాలమ్) వార్తోదంతం ఈ అవక్ర విక్రమ అవినీతి పరాక్రముణ్ణిగూర్చి వెలువరించింది. ఈ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికే శరద్‌పవార్‌గారి అవినీతి చిద్వాలాస చిట్టాలను టీకాటిప్పణులతో సహా కొంతకాలం కిందట విశదపరచింది. వీరే మన జాతీయ ప్రముఖ నేతలు.
సహస్రాబ్దంగా మాతృదేశానికి ఎన్నో అన్యాయాలు, దురాక్రమణలు, జాతిజీవనం ఛిన్నాభిన్నం చేసే ప్రయత్నాలు. ఎందుకు? ‘ఏ విధంగా సంభవించాయి? ఈ దేశ మూల వాసులు, సామాన్య ప్రజలు ఎన్ని కష్టాలు, కడగండ్లు అనుభవించారు? డెబ్భై రెండు సంవత్సరాల కిందట దేశ విభజన ఎందుకు జరిగింది? జరగకుండా గాంధీ మహాత్ముడు ఎందుకు నిరోధించలేకపొయినాడు?
కొత్త సహస్రాబ్దంలోనైనా దేశ పౌరులు, స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో ఊపిరి పీల్చుకుంటారనుకుంటే మళ్ళీ కాంగ్రెస్‌వారి కుట్రలు, కుతంత్రాలు, కూహకాలు సమసిపోవటం లేదు ఎందుకని! ఇప్పుడు ఒక చిన్న ధర్మసూక్ష్మం పరిశీలిద్దాం. వచ్చే జనవరి 22నుంచి నెల రోజుల కిందట పార్లమెంటు ఉభయ సభలలో నెగ్గిన పౌరసత్వ సవరణ మంచి చెడ్డల విచారణ ప్రారంభిస్తాము అనీ సుప్రీంకోర్టు ఈవరకే ప్రకటన వెలువరించింది కదా?
ఈనెల రోజులలో ఏమి ప్రళయం ముంచుకొని వస్తుందని ఈ హింస, దౌర్జన్యం, సాంక్రామిక వ్యాధి చెలరేగుతున్నట్లు! అంటు వ్యాధి (ప్లేగు, కలరా వంటివి) పనిగట్టుకొని ప్రతిపక్షాలవారు వ్యాపింపజేస్తున్నట్లు?
వారి సరళికోసం ఊహిద్దాము. సుప్రీంకోర్టువారే పౌరసత్వ సవరణ చట్టాన్ని (బిల్లు) చిన్నసవరణలతో, సలహాలతో, సూచనలతో, ఆమోదిస్తే (తథాస్తు దేవతలు దీవించెదరుగాక!) ఇప్పుడీ అంటువ్యాధి ప్రయత్న పూర్వక దుశ్చర్యలు కోర్ట్ధుక్కార నేరం కిందికి వచ్చినట్లేకదా?
నవభారత ప్రేమాస్ఫద నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పినట్లు పౌరసత్వ చట్టం శాసనం అమలు ఇంకా మొదలుకూడాకాలేదు కదా! అస్సాంలో సుప్రీంకోర్టువారి ఉత్తర్వుమేరకు వారి అజమాయిషీ కింద పౌరసత్వ చట్టం అమలుచేయటం కాంగ్రెసువారికి ఆవాలు నమిలినట్లు వెలపరం పుట్టడం ఎందుకు?
అస్సాం విషయం ప్రస్తావనకు వచ్చింది కాబట్టి ఆనాటి వృద్ధతరం కాంగ్రెసు నాయకుడు, ఆత్మగుణ సంపన్నుడు, గాంధీజీ సిద్ధాంత భాస్తుకారుడు, జైలులో ఉండి అన్యత్ర ఎటువంటి సహాయమూ లేక రెండు నెలల వ్యవధిలో 1500 పేజీల స్వాతంత్య్రోద్యమం ఇతిహాసం సంధానించినవాడు డా.పట్ట్భా సీతారామయ్య ఆనాటి దేశ విభజన పరిణామాలను ఏవిధంగా వ్యాఖ్యానించారో చూద్దాం.
సమకాలీన భారతదేశ చరిత్రను ఆయన వెయ్యిప్రశ్నలు- వెయ్యి సమాధానాలుగా (ఇందులో ప్రాసంగికంగా ఆయన స్వీయ చరిత్ర కూడా చేరింది) 1946, 47లలో వెలువరించాడు. ఇది కొలకత్తానుంచి వెలువడింది. బృహద్గ్రంథం. ఆయన దేశమంతా పర్యటించాడు. 17 సంవత్సరాలు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. ఆయన పర్యటనలలో ఎవరో ఆయనను అడిగారు. మహమ్మదలీ జిన్నాగారు అస్సాంను పాకిస్తాన్‌తో కలపాలని ఎటువంటి కుట్రకు, మోసానికి, వంచనకు, కపటానికి తెర ఎత్తుతున్నారు? అని ఆయనను అడిగినప్పుడు, ఆయన సమాధాన వ్యాఖ్యానం ఇట్లా ఉంది. అస్సాంను పాకిస్తాన్‌లో కలపాలని జిన్నా ఎందుకు అర్రులు చాస్తున్నాడో పట్ట్భా ఆ కూహకం ఇట్లా వివరించాడు.
‘ఇందులో అర్థంకానిదేముంది? భారతదేశపు ఈశాన్య సరిహద్దు, వాయువ్య సరిహద్దులను పూర్తిగా తన అధికార నియంత్రణలోకి తెచ్చుకోవాలని జిన్నా ఆశయం. దీనితో భారతదేశమంతటిపై తన ఆధిపత్యం (దౌర్జన్యం) చలాయించవచ్చు. అప్పుడు పాకిస్తాన్ చెప్పుచేతలలో హిందూస్తాన్ ఉంటుంది. హిందూస్తాన్ తన నియంత్రణదారుడి దయాదాక్షిణ్యాలపై ఆధారపడవలసి ఉంటుంది. ఇదీ మహమ్మదాలీ జిన్నా గొంతెమ్మ కోరిక. అందరికీ తెలిసిన విషయమేమంటే అసామ్ జన సంఖ్యలో మూడోవంతు హిందువులు, మూడోవంతు ఆదివాసులు (గిరిజన, వనజనులు) తక్కిన మూడో వంతు ముస్లిములు. ఆదివాసి గిరిజనులను స్వాధీనపరచుకొని ముస్లిమ్ లీగ్‌కు అనుకూలంగా జనాభా నిష్పత్తిని మార్చివేయగలిగితే తన పన్నాగం ఫలిస్తుందని. ఆ దుష్టప్రయత్నం కొంత జరుగుతున్నది. (వర్తమాన భారత దేశ చరిత్ర- పుట 53).
అసలు విషయం ఇది కాగా మోడీజీని జిన్నాతో పోల్చి నోరు పారేసుకోవటం కాంగ్రెసువారి విష సంస్కృతికి నిదర్శనం. పూర్వపు కామరూప దేశమే అస్సాము. గువాహతియే ప్రాగ్యోజితషపురం అంటారు చారిత్రకులు. కాంగ్రెసు వారికివేమీ అక్కరలేదు. అంతేకాదు ముస్లిములు అధిక సంఖ్యాకులైనచోటల్లో ఆక్రమణలు, దుశ్యంతులు, దుర్మార్గాలు తప్పవు అని మహమ్మదాలీ జిన్నా నిరూపిస్తున్నాడు కదా!

- అక్కిరాజు రమాపతిరావు