సబ్ ఫీచర్

మూల కారణం ఏమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పివి.సింధుకి ఒ లింపిక్స్‌లో రజత పతకం ల భించింది. రెండు రాష్ట్రాల చంద్రులూ ఆమెపై వరాల వెనె్నలను పోటీపడి అమృతవర్షంలా కురిపించారు. (పనిలో పనిగా సైనానెహ్వాల్‌ను చాలామంది మర్చిపోయారు. కొందరు తిట్టారు.) సింధుతోపాటుగా ఇంకొక క్రీడాకారిణి మాత్రమే పతకాన్ని సాధించిన విషయం దుమారాన్ని రేపింది. క్రీడా నిర్వహణలోని లోపాలను అందరూ దుమ్మెత్తిపోశారు. ఇంతకీ ప్రపంచంలో జనాభా విషయంలో రెండవ స్థానంలో ఉన్న దేశానికి రెండే పతకాలు రావడానికి కారణమేమిటి?
మన దేశంలో చదువుకీ, పోటీ పరీక్షలకూ ఉన్న స్థానం క్రీడలకు లేకపోవడమే ముఖ్యకారణమంటున్నారు. 1960లలో ఇంజనీరింగ్, మెడిసన్‌లకు ప్రస్తుతమున్నంత క్రేజ్ లేదు. సాధారణ విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలలో, ఎయిడ్ స్కూళ్ళలో సైతం గేమ్స్‌కీ, క్రాఫ్ట్‌కీ, డ్రాయింగ్‌కీ ప్రత్యేకంగా తరగతులుండేవి. ఆ మూడింటికీ కేటాయించబడిన తరగతులలో లెక్కలూ, సైన్సూ చెప్పేవారు కాదు. రాజకీయ స్వాతంత్య్రం వచ్చిన కొత్తవల్ల చేనేతపై అభిమానముండేది. స్కూ ళ్ళల్లో తక్లీలూ, రాట్నా లూ, మగ్గాలూ ఉండే వి. క్రీడా ప్రాంగణముంటే కానీ స్కూళ్ళ కు గుర్తింపు లేదు. (నేటివలె డాబాపై రెం డు జారుడుబండలు చూపించడం కాదు.) కాలేజిలలో సైతం గేమ్స్ క్లాసులకు అటెండెన్స్ కంపల్సరీ. హాజరు తక్కువైన వారిని యూనివర్శిటీ పరీక్షలకు అనుమతించేవారు కాదు. అయినప్పటికీ మన దేశానికి 1952లో కె.డి.జాదవ్ సాధించిన పతకం తప్ప మరో వ్యక్తిగత పతకం రాలేదు. కారణమేమంటే ఏం చెప్పాలి?
పిల్లలను చదువుమీదనే దృష్టిసారించమంటున్నారన్న మాట నిజమే అనుకుంటే విద్యకు సంబంధించిన విషయాలలో బహుమతులు ఎక్కువ వచ్చి ఉండాలి. భారతీయులకు వచ్చిన నోబెల్ ప్రైజులలో రెండు బ్రిటిష్‌వారి పాలనలో వచ్చినవి. నాలుగు విదేశాలలో పరిశోధనలకు వచ్చినవి. దీనికి ఏమనగలం?
పి.వి.సింధుకి రజత పతకం వచ్చిన తరువాతా, స్వర్ణం వస్తుందన్న ఆశ ఉన్నప్పుడూ అందరి మనస్సులో మెదిలిన ప్రశ్నలు రెండు. ఆమె కులమేమిటి? (ఈ ప్రశ్న వేసుకున్నారన్న దానికి గూగుల్ సాక్ష్యం.) ఆమె ఏ ప్రాంతానికి చెందినది? ఇవే ప్రశ్నలు ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నప్పుడూ వేసుకోవడం అలవాటు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఆలోచించ లేకపోవడమే మనం అన్ని రంగాలలో వెనుకంజ వెయ్యడానికి కారణమా? ‘్భరతవర్షే, భరతఖండే’అన్నది మొక్కుబడిగా నోటి చివరనుంచి చెప్పుకునే సంకల్పమా?

- పాలంకి సత్య