సబ్ ఫీచర్

మేధావులూ... మేల్కోండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుత్వాల ద్వంద్వ వైఖరులను అర్ధం చేసుకొని అర్ధమేధావులు, మూర్ఖ మేధావులు, అసలు ఎలాంటి మేధస్సు లేని మేతావులు ఇవ్వవలసిన వారికి సలహాలు ఇవ్వడంలో మిన్నకుండి కేవలం ఉపాధ్యయులకు సలహాలిస్తున్నారు. తాము పనిచేసే గ్రామాలలోనే వారు నివాసముండేలా చర్యలు తీసుకుంటూ విద్యార్థులకు అందుబాటులో ఉంటే విద్యావ్యవస్థ మెరుగుపడుతుందనేది ఉవాచ. అసలు 1990 ఆర్థిక సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ అనే పిచ్చి బూటకపు, అబద్ధపు, మోసపు అభివృద్ధి సంస్కరణలే అన్ని ప్రభుత్వరంగ సంస్థల విధ్వంసానికి మూలకారణమనే నగ్న సత్యాన్ని పాతరేసి మాట్లాడడం నయ వంచన, ఆత్మవంచనగాక మరేంటి? ఇకనైనా సలహాలివ్వదల్చుకుంటే మూలాల్లోకి వెళ్ళి, ఆలోచించి అర్ధవంతమైన సామూహిక సామాజిక ప్రయోజనమొనగూర్చే దేశ ప్రయోజనాలకు తోడ్పడే అసలైన దేశభక్త సలహాలివ్వడానికి ముందుకు రావాలి. ప్రైవేటీకరణ ఎవరి ప్రయోజనాలను నెరవేరుస్తుందో, ఆర్థిక సరళీకరణ విధానాలు ఏవిధంగా అవినీతి సరళీకరణ విధానాలుగా మారి వ్యవస్థీకృత అవినీతిని పెంచి పోషించిన రీతిని ఎండగట్టాల్సిన బృహత్తర కార్యక్రమానికి మేధావులనేవారు చొరవ తీసుకుపోవడంలో వైఫల్యమెందుకో? ఆలోచించాలి. ధనం వలన, ధనం చేత, ధనం కొరకుగా మారిన మన ప్రజాస్వామ్యవ్యవస్థను పునరుద్ధరించడానికి అనేకమంది ఒక దశాబ్దకాలంగా ఎన్నికల సంస్కరణలకై అనేక వ్యాసాలను వివిధ పత్రికల ద్వారా అందించినప్పటికీ మన నాయకులు స్వీకరించడం లేదుగదా? ప్రశ్నించరెందుకు? ప్రజలకొరకు ఎన్నుకోబడ్డ నాయకమ్మణులు నగరాలలో పాతుకపోయి దేశ ప్రజలకు అన్నంపెట్టే గ్రామ జీవన విధానాన్ని, గ్రామీణ వ్యవసాయాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థ షరతుల కోరలకు బలిగావించి, లక్షలాది అన్నదాతల అప్పుల బాధల ఆత్మహత్యలకు స్పందించే ఉపాధ్యాయ, ఉద్యోగ మేధావులెందరు? ఆచరణలో ఆదుకునే నాధులెక్కడ? శుష్క రచనలతో, ఒరిగేదేమిటి? వస్తు వ్యామోహంలో, ధన వ్యామోహంతో, భౌతిక సుఖాలకు వెంపర్లాడే విధంగా నేటి సమాజాన్ని మల్చిన పాపం ఆధునిక ఎలక్ట్రానిక్, ప్రింటు మీడియాది గాదా? మీడియా కుహనత్వ ధోరణిని చీల్చిచెండాల్సిన అవసరం మేధావులపై లేదా? సాగదీసిన సీరియళ్ళచే ఇంటింటిని మానసిక దౌర్భల్యులుగా టీవిలకే అతుక్కపోయి అసలైన ప్రజాజీవనానికి దూరమైన తీరుకు కారణమెవరో ఆలోచించరెందుకు?
మన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఎఎస్‌లు, ఐపిఎస్‌లు ఆచరణలో ప్రజలకు ఆదర్శంగా ఉండే ప్రజాస్వామిక వ్యవస్థకు పునాదివేయడానికి తమ తమ సొంత పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో చదివించేలా మొత్తంగా సగటు సమాజం తిరుగుబాటు చేసే కాలమెప్పుడో? అప్పుడే బూటకపు ఇంగ్లీష్ మీడియం ఒత్తిడి తగ్గి మాతృభాష మాధ్యమం ద్వారానే బోధన చిత్తశుద్ధితో జరుగుతుంది. మానవీయ విద్యద్వారా మంచి సమాజానికి దారితీస్తుంది. వ్యాపార విద్యద్వారా జరిగే అన్ని అనర్ధాలకు స్వస్తిచెప్పినట్లవుతుంది. పాలక, ప్రతిపక్షాలు స్వార్ధరహితులైతేనే ఇది సాధ్యమవుతుంది. అటువైపుగా ప్రజాచైతన్యాన్ని తీసుకురావాల్సిన బాధ్యత నిఖార్సైన మేధావులదే.

- గడీల సుధాకర్‌రెడ్డి