సబ్ ఫీచర్

బడి చదువుకు జవాబుదారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి మీటింగ్‌లో మీరు ఎప్పుడూ ఫిన్లాండ్, సింగపూర్ విద్యనే ప్రస్తావిస్తారు. మనం వాళ్లకు సమానం కాలేమా? మన లోపాలు చెప్పకుండా విదేశాల విద్యాప్రగతిని పొగిడి ఇక్కడి మన విద్యా విధానాన్ని మీరు నీరుగార్చుతున్నారా?- అని ఓ విద్యార్థి నన్ను ప్రశ్నించాడు. ఆ దేశాల్లో ఉన్న ప్రత్యేకతలు ఏమిటి?
ఇతర దేశాల వలే మనం కూడా ప్రాథమిక విద్యను బాలలకు ఆరేళ్ల వయసు నుంచే ఆరంభిస్తాం. 11 ఏళ్లకు అది పూర్తవుతుంది. ఈ అయిదేళ్లు మానవ జీవితంలో చాలా ప్రధానమైనవి. విద్యార్థుల్లో ఉన్న జిజ్ఞాస పెరిగేకాలం ఇది. ఈ కాలాన్ని మనం మొక్కుబడిగానే గడుపుతాం. అక్షరాలు నేర్పటమే ప్రాథమికవిద్య లక్ష్యం, పిల్లల స్థాయి లక్షణం అనుకొంటాం. మిగతా దేశాల్లో ప్రాథమిక దశలో ఏమేమి సాధించాలో స్పష్టంగా చెబుతారు. తరగతి గదిలో ఆ విద్యార్థి పెన్సిల్ ఎలా పట్టుకున్నాడనే అంశం నుంచి అక్షరాలు ఏ విధంగా రాస్తాడనే వరకూ అన్నీ రికార్డు చేస్తారు. ఏటా విద్యార్థిలో ఎలాంటి పరిణామాలు వచ్చాయో కూడా నమోదు చేస్తారు. 5వ తరగతి పూర్తయ్యాక తల్లిదండ్రులను పిలిపించి విద్యార్థికి సంబంధించిన రికార్డు ఫైల్‌ను అప్పగిస్తారు. ప్రాథమిక స్థాయిలో చదవడం, రాయడం, సంఖ్యలు వేయడం, వాటిని పరిశీలించడం వంటి నైపుణ్యాలు విద్యార్థిలో ఎలా ఉన్నాయో తల్లిదండ్రులకు రికార్డుపరంగా చూపిస్తారు.
విదేశాల్లోని విద్యావిధానంలో ఇలాంటి జవాబుదారీతనం స్పష్టంగా కనిపిస్తుంది. స్వయంగా వర్జీనియాలోని ఒక తరగతి గదిలో కూర్చుని ఆసాంతం పరిశీలించగా నాకు ఈ విషయం ధ్రువపడింది. ప్రాథమిక స్థాయి ముగిసేనాటికి విద్యార్థిలో ప్రతిభ అంకురిస్తుంది. విద్యార్థి అలవాట్లు, జీవనశైలి, వ్యక్తిగత విషయాల గురించి తల్లిదండ్రులకు సమాచారం అందిస్తారు. మాధ్యమిక తరగతిలో తమ పిల్లలను ఏ స్కూల్‌లో చేర్పించదలచుకున్నారో తెలియజేయాలని స్కూల్ నిర్వాహకులు తల్లిదండ్రులను కోరుతారు. విద్యార్థి రికార్డు ఫైల్ కాపీని సంబంధిత విద్యార్థి చేరబోయే మాధ్యమిక స్కూల్‌కు పంపుతారు. హైస్కూల్ నుంచే విద్యార్థికి ‘చాయిస్ ఆఫ్ ది సబ్జెక్ట్’ ఉం టుంది. ప్రతి సబ్జెక్ట్‌లో సాధారణమైనది, ఆధునికమైనది రెండూ ఉంటాయి. ఈ రెండింటిలో విద్యార్థికి దేనిపై ఆసక్తి ఉందో గమనిస్తారు. మిడిల్ స్కూల్‌లో ‘ఆప్షన్’ (ఐచ్ఛికాలు) ఒప్పుకునే ముందు దాన్ని ఫైల్‌లో రికార్డు చేస్తున్నందున భవిష్యత్ చదువు నిర్ణయించబడుతుంది.
ప్రాథమిక దశలో అందరికీ ఒకే రకమైన కోర్సును పటిష్టంగా చెప్పడం, తర్వాత ఆప్షన్స్ ఇవ్వడం, దాన్ని అంగీకరించే ముందు సాక్ష్యాధారాలు వంటివన్నీ ఫైల్‌లో నమోదు చేస్తారు. సబ్జెక్ట్‌ను ఎంచుకునే చాయిస్ ఉంటుంది గనుక విద్యార్థిలో ప్రతిభ వికసిస్తుంది. ఒకే తరగతిలో కొన్ని సబ్జెక్టుల్లో అడ్వాన్స్‌లు, కొన్నింటిలో సాధారణంగా ఉండొచ్చు. లాంగ్వేజస్‌లో నార్మల్‌గా ఉండొచ్చు. అది విద్యార్థి స్థాయిని బట్టి ఉంటుంది. బయటిశక్తుల ఒత్తిడి కన్నా విద్యార్థి ప్రతిభకు ప్రాధాన్యం ఇస్తారు. తల్లిదండ్రులు కూడా దీన్ని అంగీకరిస్తారు. పిల్లలకు సబ్జెక్ట్ ఎంచుకునే స్వేచ్ఛ ఇవ్వడమే కాదు, దాన్ని గౌరవించడం ప్రధానం . ఇలా ప్రతి దశలో పిల్లలకు చాయిస్ ఇస్తూ, వాటికి తరగతి గదిలో ప్రాధాన్యం ఇవ్వాలి. చదువు విషయమై అన్ని పరిణామాలను రికార్డు చేస్తుండాలి. కొన్ని విదేశాల్లో పాఠశాల విద్య పటిష్టంగా ఉండడానికి ఇవే కారణాలు.

- చుక్కా రామయ్య