సబ్ ఫీచర్

‘హిందూ జాతీయ వాదం’లో తప్పేంటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సిపిఎం ఎప్పుడూ భారత జాతీయవాదానికే మద్దతు పలుకుతుంది తప్ప, హిందూ జాతీయవాదానికి కాదు. హిందూత్వ ఎజెండాను పెద్దఎత్తున అమలుచేస్తున్నది వేరేవాళ్లు. పరిస్థితి ఎక్కడిదాకా వెళ్ళిందంటే- దేశభక్తికి ఆర్‌ఎస్‌ఎస్ వారు సర్ట్ఫికెట్లు జారీచేసే వరకూ వెళ్ళింది. హిందూత్వమే భారత జాతీయవాదం అనే రీతిలో వాళ్లు ప్రచారం చేస్తున్నారు.’
- సిపిఎం అగ్ర నాయకుడు సీతారాం ఏచూరి
( ఒక ప్రముఖ దినపత్రికలో 9 నవంబరు, 2016 నాటి ఉద్ఘాటన).
ఇంకో వార్త... చిత్తూరు జిల్లాలోని స్వయంభూ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని శుక్రవారం సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ దర్శించుకున్నారు. పిఇవో కేశవరావు ఆలయ మర్యాదలతో నారాయణను ఆహ్వానించి, మూషిక మండపంలో శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు అందచేశారు. (అదే పత్రిక 12 నవంబరు, 2016 వార్త- ఫొటో సహా)
తిరుమలలో నవంబరు 13న- దాదాపు 50 ఏళ్ల తరువాత తాను మళ్లీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నానని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ వెల్లడించారు. ఉదయం వేళ బ్రేక్ దర్శన సమయంలో ఆయన స్వామిని దర్శించుకున్నారు. నిజంగా దేవుడు ఉంటే- అవినీతిపరులను మంచిమార్గంలో నడిపించాలని కోరుకున్నట్లు నారాయణ విలేఖరులకు తెలిపారు.
తాను పదో తరగతి పాసయినప్పుడు తిరుమలకు వచ్చి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నానని కూడా నారాయణ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. తాను గొప్ప భక్తుడినైనా- కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని అధ్యయనం చేసిన తరువాత, ఏరోజూ పూజలు చేయలేదని వివరించారు. (14 నవంబరు, 2016 వార్త)
అదేరోజు.. అదే నారాయణ- ‘ఆర్‌బిఐ గవర్నరు అవినీతిపరుడు’అని చెప్పిన వార్తా వచ్చింది. ప్రస్తుతం ఆర్‌బిఐ గవర్నరుగా ఉన్న ఉర్జీత్ పటేల్ గతంలో నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అక్కడి పెట్రోలియం కెమికల్ ప్రాడక్ట్స్‌లో పనిచేస్తూ వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని, అలాంటి వ్యక్తి ఆర్‌బిఐ గవర్నర్‌గా ఉంటూ, కార్పొరేట్ కంపెనీలకు వ్యతిరేకంగా ఎలా నిర్ణయం తీసుకోగలరని నారాయణ తిరుమలేశుని సాక్షిగా ప్రశ్నించారు. ఇద్దరు ప్రముఖ కమ్యూనిస్టు నాయకుల నుంచి రెండు, మూడు రోజుల వ్యవధిలో వచ్చిన వార్తలివి. ఇరువురూ జాతీయ స్థాయి కార్యదర్శులే సుమా!
భారత జాతీయవాదం, హిందూ జాతీయవాదం
ఒక్కసారి ‘ఇండియా దట్ ఈజ్ భారత్’ గతాన్ని చూద్దాం. ఈ దేశానికి, వేదాలకు అవినాభావ సంబంధం ఉందనే విషయాన్ని ఎవ్వరూ కాదనలేరు. క్రీ.పూ.3వ శతాబ్ది నుంచి ఆసియా అంతా, ఇండోనేషియా వగైరా దేశాలలోనూ బౌద్ధం వ్యాపించింది.
కానీ- అంతకుముందే హిందూమతం పురాణ కాలం నాటి మతం, సంస్కృతి. అది ఆసియా ఖండంలో వ్యాపించింది. ఈ దేశం పట్ల మనకుగల భావన- ముఖ్యంగా మాతృదేశ భావన, దానికొక పవిత్రతను ఆపాదించుకుంటూ, కర్మకాండకు, ఈ దేశానికి ముడివేసి తమ భావాలకు సుస్థిరతను కల్పించుకున్నారు.
ఈ విషయాలనూ మనకు, పాశ్చాత్యులే తెలియచెప్పారనవచ్చు సుమా! ఉదాహరణలు..
కలకత్తా హైకోర్టు జడ్జి, సర్‌జాన్ ఉడ్రాఫ్ ‘నిఒ నిశజూజ్ఘ షజ్పజజచీళజూ’ అనే గ్రంథాన్ని రచించాడు. అందులో- ఇంకో రచయిత డికిన్‌సన్ వ్రాసిన విషయాన్ని వివరించాడు. వారేమన్నారు?
ప్రాగ్దేశాలకు, పశ్చిమ దేశాలకు గల భేదం కన్నా భారతదేశానికి, మిగతా ప్రపంచానికిగల భేదం గణనీయమైంది. మిగతా వారివలె దేశాన్ని భోగభూమిగా కాకుండా కర్మభూమిగా భావించారంటాడు డికిన్‌సన్.
1789లో మొదటిసారిగా విలియం జోన్స్ కాళిదాసు విరచిత ‘శాకుంతలం’ను ఆంగ్లభాషలోకి అనువదించటంతో, పండితుల దృష్టి సంస్కృతంపై పడింది. 1805లో ‘ఆసియాటిక్ రిసెర్చెస్’లో హెచ్.కోల్‌బ్రూక్ ‘్జశ ఆ్దళ పళజ్ఘూఒ, ఆ్దళ ఒ్ఘషూళజూ తీజఆజశఒ యఛి ఆ్దళ హజశజూఖఒ’ అన్న పత్రాన్ని ప్రచురించాడు.
1855 నుంచి సుమారు 1900 దాకా ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో సంస్కృతాచార్యుడుగా పనిచేసిన మాక్స్‌ముల్లర్, డ్ఘషూళజూ ఱ్య్యరీఒ యచి ఆ్దళ ఉ్ఘఒఆ కు సంపాదక బాధ్యత వహించి అమోఘమైన సేవ చేశాడు.
భాషాశాస్త్రం ఆధారంగా కాలనిర్ణయం చేయడానికీ మాక్స్‌ముల్లరే కారకుడు అయ్యాడు. వారు కేవలం ప్రయోగాత్మకంగా వేదాల వయస్సు క్రీ.శ.600 నుంచి 1200 అని నిర్ణయించారు.
స్వామిదయానంద సరస్వతి వారి లెక్కప్రకారం వేదాల వయస్సు లక్షల సంవత్సరాలముందు నాటివే!
ఇదంతా చెప్పటం, అసలు ప్రపంచంలో క్రైస్తవం, మహమ్మదీయ మతాలు పుట్టకముందే ఆవిర్భవించి ‘హిందువులు’గా పిలువబడిన ఈ దేశస్థులను, ఈ జాతీయులను ఆ పేరుతో కేవలం ఒక మతస్థులుగా భావించి, ‘్భరత జాతీయవాదం వేరు, హిందూ జాతీయవాదం వేరు’ అని సిద్ధాంతీకరించటం భావ్యమా?
ప్రపంచంలో ఏ వేరే మతమూ, ఏ వేరే జాతి అసలు లేనేలేనప్పుడు, ఈనాడు వారికి సంకుచితత్వాన్ని అంటగట్టటం భావ్యమా?... క్షమించండి.
కాబట్టే భారతదేశం అనేదే హిందువుల దేశం అనుకోవచ్చుగదా!... ప్రపంచంలో నేడు మహమ్మదీయులకెన్ని దేశాలున్నాయి? క్రైస్తవులకెన్ని దేశాలున్నాయి? ఈ అభాగ్య హిందువులకు- ఒక్క దేశమన్నా తమది అని పిలుచుకోగూడదా?.. కానీ- అంతమాత్రాన మిగతా వారెవరూ తమ దేశంలో ఉండగూడదనీ, వారికెలాంటి హక్కులు లేవని అనటంలా! అంతేకాదు, ఇలా యుగాల బట్టి అఖండంగా ఉన్న దేశాన్ని, తమ తెలివి తక్కువతో ‘ఖండిత భారతం’ చేసుకుంది కూడా వారేగదా!

-చాణక్య