సబ్ ఫీచర్

అవినీతి కేసుల్లో శిక్షలు ఏవీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మన దేశం అద్భుతాలు సాధిస్తున్నట్టు పాలకులు గంభీర ప్రకటనలు చేస్తున్నప్పటికీ, అవినీతిపై పోరాటంలో మాత్రం దారుణ వైఫల్యం కనిపిస్తోంది. అవినీతిని అరకట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అజమాయిషీలో పనిచేస్తున్న సంస్థలు ఆశించిన ఫలితాలను సాధించలేకపోతున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖల్లో అవినీతిపరులపై కేసులు నమోదవుతున్నా శిక్షలు పడుతున్న దాఖలాలు అంతంత మాత్రమే. కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇ.డి), రాష్ట్రాల్లో ఎసిబి అధికారులు అవినీతిపరులపై కేసులు నమోదు చేస్తుంటారు. జాతీయ నేర గణాంకాల నమోదు సంస్థ (ఎన్‌సిఆర్‌బి) సమాచారం ప్రకారం గత పదిహేనేళ్ల కాలంలో నమోదైన మొత్తం నేరాల్లో అవినీతికి సంబంధించిన కేసులు 0.06 శాతం మాత్రమే. నామమాత్రంగా కేసులు నమోదవుతున్నా శిక్షలు పడుతున్న సందర్భాలు తక్కువే.
గత పదిహేనళ్ల కాలంలో పశ్చిమ బెంగాల్‌లో ఒక్క అవినీతి కేసులోనూ శిక్షలు పడకపోవడం గమనార్హం. గోవాతో పాటు మరో మూడు రాష్ట్రాల్లో అవినీతిపై నమోదైన కేసులన్నింటినీ విచారణ దశలోనే కొట్టివేశారు. లంచాలు తీసుకుంటున్న ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులపై కేసులు పెడుతున్నా అవి శిక్షలు పడేవరకూ నిలబడడం లేదు. ఫిర్యాదుదారులపై, సాక్షులపై పలురకాలుగా ఒత్తిళ్లు వస్తున్నందునే ఈ కేసుల్లో శిక్షలు పడడం లేదని ‘కామన్‌వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనీషియేటివ్’ (సిహెచ్‌ఆర్‌ఐ) అనే సంస్థ జరిపిన అధ్యయనంలో తేలింది. జాతీయ నేర గణాంకాల నమోదు సంస్థ ఇచ్చిన సమాచారం ఆధారంగా సిహెచ్‌ఆర్‌ఐ ‘అవినీతి కేసుల’ను పలు కోణాల్లో విశే్లషించింది. 2001- 2015 మధ్య కాలంలో దేశంలోని 29 రాష్ట్రాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో వివిధ నేరాలకు సంబంధించి 9.11 కోట్ల కేసులు నమోదయ్యాయి. వీటిలో అవినీతి కార్యకలాపాలకు సంబంధించి నమోదైన కేసుల సంఖ్య 54,139 మాత్రమే. వివిధ ప్రభుత్వ శాఖల్లో అవినీతి విషయమై 1,16,010 ఫిర్యాదులు అందగా కేసుల సంఖ్య 50 శాతానికి మించకపోవడం విశేషం. ప్రభుత్వ శాఖల్లో లంచగొండి అధికారులపై నమోదయ్యే ప్రతి వంద కేసుల్లో సగటున 19 కేసుల్లో మాత్రమే అరకొరగా శిక్షలు వేస్తున్నారు.
చాలా సందర్భాల్లో పోలీసులు ఎఫ్‌ఐఆర్ (ప్రాథమిక దర్యాప్తు నివేదిక) సమర్పించాక సాక్ష్యాలు లభించకపోవడం, ఫిర్యాదుదారులపై ఒత్తిళ్లు తేవడం సర్వసాధారణమైంది. చాలాకేసులు కోర్టుల్లో విచారణ దశకు వెళ్లకుండానే నీరుగారిపోతున్నాయి. సిబిఐ, ఎసిబి అధికారులు నమోదు చేసిన కేసుల్లో విచారణ ఏళ్ల తరబడి సాగుతున్నందున మెజారిటీ కేసులు వీగిపోతున్నాయి. విచారణ ముగిసిన కేసుల్లో అయితే సాక్ష్యాలు లేవన్న సాకుతో నిందితులకు శిక్షలు పడడం లేదు. పశ్చిమ బెంగాల్, గోవా, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల్లో అవినీతి కేసుల్లో శిక్షలు పడడం బహు అరుదని గణంకాలు చెబుతున్నాయి. మణిపూర్‌లో అయితే గత 15 ఏళ్ల కాలంలో ఒక్క కేసులో మాత్రమే నిందితుడికి శిక్ష పడింది. అవినీతి కేసుల్లో శిక్షలు పడుతున్న రాష్ట్రాల్లో కేరళ, బిహార్, సిక్కిం, అస్సాం, మధ్యప్రదేశ్ ముందు వరుసలో ఉన్నాయి. కేరళలో నమోదైన మొత్తం కేసుల్లో 62.95 శాతం కేసులు విచారణ దశకు వెళుతున్నాయి. విచారణ పూర్తయిన 6,399 కేసుల్లో 1,592 కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డాయి. కేరళలో అవినీతిపై నమోదైన మొత్తం కేసుల్లో 18 శాతం కేసుల్లో నిందితులకు శిక్షలు పడినట్టు గణాంకాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల్లో (హిమాచల్ ప్రదేశ్ మినహా), ఏడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 2001-2015 మధ్య కాలంలో 43,394 మందిపై అవినీతి కేసులు నమోదు కాగా 68 శాతం కేసుల్లో నిందితులు నిర్దోషులుగా విడుదలయ్యారు. కాగా, చిన్న రాష్టమ్రైన నాగాలాండ్‌లో 90 శాతం కేసుల్లో నిందితులకు శిక్షలు పడడం గమనార్హం.